ముక్కు అవినాష్ పెళ్లిపై షాకింగ్ న్యూస్: ఆ అమ్మాయితోనే ఫిక్స్.. తప్పని పరిస్థితుల్లోనే ఈ నిర్ణయం!

తెలుగు బుల్లితెరపైకి ఎంతో మంది పలు రకాల టాలెంట్లతో ఎంట్రీ ఇస్తుంటారు. కానీ, వారిలో చాలా తక్కువ మంది మాత్రమే ప్రేక్షకుల నుంచి మన్ననలు అందుకోవడంతో పాటు భారీ స్థాయిలో పాపులారిటీని సంపాదించుకున్నారు. ఈ జాబితాలోకే వస్తాడు జబర్ధస్త్ కమెడియన్ ముక్కు అవినాష్. అద్భుతమైన టైమింగ్‌తో ఆకట్టుకునే అతడు.. బిగ్ బాస్ షోలోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఎంటర్‌టైనర్‌గా పేరు తెచ్చుకున్నాడు. దీంతో వరుస ఆఫర్లను అందుకుంటూ దూసుకెళ్తున్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో ముక్కు అవినాష్ పెళ్లిపై షాకింగ్ న్యూస్ లీకైంది. ఆ వివరాలు మీకోసం!

 మిమిక్రీ ఆర్టిస్టు నుంచి జబర్ధస్త్ టీమ్ లీడర్‌

మిమిక్రీ ఆర్టిస్టు నుంచి జబర్ధస్త్ టీమ్ లీడర్‌


మిమిక్రీలు చేస్తూ కెరీర్‌ను ఆరంభించాడు అవినాష్. అలా స్టేజ్ షోలు, ఈవెంట్లలో దూసుకుపోతోన్న సమయంలోనే జబర్ధస్త్ కమెడియన్ల దృష్టిలో పడ్డాడు. అలా ఆ షోలోకి ఎంట్రీ ఇచ్చాడు. ఏమాత్రం అంచనాలు లేకుండానే ఎంట్రీ ఇచ్చిన అవినాష్.. చాలా తక్కువ సమయంలోనే మంచి గుర్తింపును పొందాడు. దీంతో టీమ్ లీడర్‌గా ప్రమోషన్‌ను కూడా పొంది.. టాప్ ప్లేస్‌కు చేరుకున్నాడు.

జబర్ధస్త్‌కు గుడ్‌బై... బిగ్ బాస్‌లోకి ప్రవేశం

జబర్ధస్త్‌కు గుడ్‌బై... బిగ్ బాస్‌లోకి ప్రవేశం

జబర్ధస్త్‌లో టీమ్ లీడర్‌గా వెలుగొందుతోన్న సమయంలోనే.. ముక్కు అవినాష్‌కు ఎన్నో సినిమా ఆఫర్లు వచ్చాయి. అలా ఓ వైపు వాటిని చేసుకుంటూనే.. షోలో కొనసాగుతూ వచ్చాడు. ఇలాంటి పరిస్థితుల్లో గత ఏడాది జబర్ధస్త్‌కు గుడ్‌బై చెప్పేశాడు. దీనికి కారణం బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్‌లోకి ఎంట్రీ ఇవ్వడమే. జోకర్‌గా హౌస్‌లోకి ప్రవేశించిన అతడు.. ఆరంభంలోనే మెప్పించాడు.

అక్కడ మాత్రం నిరాశే... ఆ పేరు వచ్చింది

అక్కడ మాత్రం నిరాశే... ఆ పేరు వచ్చింది

ముక్కు అవినాష్ బిగ్ బాస్ షోలోకి వెళ్లిన సమయంలోనే అతడిని టైటిల్ ఫేవరెట్‌గా భావించారంతా. అందుకు అనుగుణంగానే అతడు చాలా వారాల పాటు నామినేషన్స్‌లోకి కూడా రాలేదు. అయితే, కొన్ని రోజుల తర్వాత గొడవల్లో భాగం అవుతూ.. ప్రేక్షకుల నుంచి విమర్శలు ఎదుర్కొవడంతో పాటు ఎలిమినేట్ అయ్యాడు. కానీ, బెస్ట్ ఎంటర్‌టైనర్‌గా పేరును దక్కించుకున్నాడు.

వాళ్లతో కలిసి రచ్చ చేస్తున్న ఎంటర్‌టైనర్

వాళ్లతో కలిసి రచ్చ చేస్తున్న ఎంటర్‌టైనర్

బిగ్ బాస్ పుణ్యమా అని అవినాష్ వరుస షోలతో దూసుకెళ్తున్నాడు. వాటిలో స్టార్ మాలో ప్రారంభమైన 'కామెడీ స్టార్స్' అనే షో ఒకటి. ప్రతి ఆదివారం ప్రసారం అయ్యే ఈ షోకు అప్పటి హీరోయిన్ శ్రీదేవి, శేఖర్ మాస్టర్ జడ్జ్‌లుగా వ్యవహరిస్తున్నారు. వర్షిణి యాంకరింగ్ చేస్తోంది. చమ్మక్ చంద్ర తదితరులు కూడా ఎంటర్‌టైన్ చేస్తున్నారు. అవినాష్‌ ఇందులో స్పెషల్ అట్రాక్షన్ అవుతున్నాడు.

 పెళ్లిపై అవినాష్ కామెంట్లు.. హౌస్‌లో అలా

పెళ్లిపై అవినాష్ కామెంట్లు.. హౌస్‌లో అలా

బిగ్ బాస్ నాలుగో సీజన్ జరుగుతోన్న సమయంలో అవినాష్ పెళ్లి అంశం తెగ హాట్ టాపిక్ అయింది. దీనికి కారణం అతడు తరచూ తన వివాహం గురించే చర్చలు జరుపుతూ ఉండేవాడు. అదే సమయంలో ఆరియానా గ్లోరీతో ట్రాక్ నడుపుతున్నట్లు కనిపించేవాడు. అంతేకాదు, షోలోకి వచ్చిన వాళ్ల అమ్మతో తన పెళ్లి చేయమని కోరాడు. దీంతో అవినాష్ పెళ్లి వార్త హైలైట్ అయిపోయింది.

ముక్కు అవినాష్ పెళ్లిపై షాకింగ్ న్యూస్ లీక్

ముక్కు అవినాష్ పెళ్లిపై షాకింగ్ న్యూస్ లీక్

వరుసగా టీవీ షోలు, సినిమాలు చేసుకుంటూ కెరీర్‌ను సక్సెస్‌ఫుల్‌గా నడుపుకుంటున్నాడు ముక్కు అవినాష్. ఇలాంటి సమయంలో అతడి పెళ్లి గురించి ఓ వార్త బయటకు వచ్చింది. ఇటీవలే ఈ టాప్ కమెడియన్‌కు పెళ్లి సెట్ అయిందట. ఈ వార్త తెలుగు రాష్ట్రాల్లో పెద్దగా తెలియలేదు కానీ.. బుల్లితెర వర్గాల్లో మాత్రం హాట్ టాపిక్ అయింది. అంతలోనే తాజాగా ఓ షాకింగ్ న్యూస్ లీకైంది.

Recommended Video

Ek Mini Katha Funny Skit With Ariyana, Avinash, Santosh Sobhan
తప్పని పరిస్థితుల్లోనే.. ఆ అమ్మాయితో ఫిక్స్

తప్పని పరిస్థితుల్లోనే.. ఆ అమ్మాయితో ఫిక్స్

అవినాష్ పెళ్లి కుదిరిన మాట నిజమేనని అంటున్నారు. అయితే, తాజా సమాచారం ప్రకారం.. అతడి పెళ్లిని వచ్చే ఏడాదికి వాయిదా వేసుకున్నాడట. దీనికి కారణం ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో కరోనా ప్రభావం తీవ్రంగా ఉండడమేనని తెలుస్తోంది. అన్నట్లు అవినాష్ చేసుకోబోయేది ఇండస్ట్రీకి సంబంధం లేని అమ్మాయినే అని తెలిసింది. అంతేకాదు, తెలంగాణ పిల్లే అనే టాక్ వినిపిస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X