Just In
- just now
అలాంటి సమయంలో పర్సనల్‌గా ఫోన్.. నరేష్‌పై పవిత్రా లోకేష్ కామెంట్స్
- 57 min ago
అది మాత్రం కంపల్సరీ అంటూ... గోవాలో రాశీ ఖన్నా రచ్చ
- 1 hr ago
మరో నిర్మాత కొడుకును హీరోగా పరిచయం చేస్తున్న శ్రీకాంత్ అడ్డాల.. నారప్ప తరువాత అదే..
- 1 hr ago
‘పుష్ప’ విషయంలో అల్లు అర్జున్ నిర్ణయం మార్పు: సినిమా విడుదల అయ్యేది ఐదు భాషల్లో కాదు!
Don't Miss!
- Finance
IMF చీఫ్ గీతా గోపినాథ్‌పై అమితాబ్ వ్యాఖ్యలు, ఏం మాటలు అంటూ నెటిజన్ల అసహనం
- News
ఎస్సై ఆత్మహత్యను రాజకీయంగా వాడుకుంటారా ? చంద్రబాబు, దేవినేని ఉమపై పోలీస్ అధికారుల సంఘం ధ్వజం
- Sports
IPL 2021: చెన్నై జట్టులోకి రాబిన్ ఊతప్ప.. మీరు మారరంటూ ఫ్యాన్స్ ఫైర్!
- Automobiles
భారత్‌లో సిట్రోయెన్ మొదటి షోరూమ్ ప్రారంభం, త్వరలో సి5 ఎయిర్‌క్రాస్ విడుదల
- Lifestyle
ఈ రాశుల వారు పిల్లల్ని బాగా పెంచుతారట... మీ రాశి కూడా ఉందేమో చూసెయ్యండి...!
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
అవినాష్ రీఎంట్రీపై సెన్సేషనల్ న్యూస్ లీక్: అదే నిజమైతే ఆయనను ఎందుకు కలిసినట్లు!
జబర్ధస్త్ అనే కామెడీ షో ద్వారా వెలుగులోకి వచ్చి, చాలా తక్కువ సమయంలోనే ఊహించని రీతిలో పాపులారిటీని సొంతం చేసుకున్నాడు ప్రముఖ కమెడియన్ ముక్కు అవినాష్. సాధారణ ఆర్టిస్టు స్థాయి నుంచి టీమ్ లీడర్‌గా ఎదిగిన అతడు.. ఫ్యాన్ ఫాలోయింగ్‌ను సైతం సంపాదించుకున్నాడు. ఈ క్రమంలోనే ప్రస్తుతం ప్రసారం అవుతోన్న బిగ్ బాస్ నాలుగో సీజన్‌లోకి కంటెస్టెంట్‌గా వెళ్లాడు. చాలా రోజుల పాటు అలరించిన అతడు.. ఇటీవల షో నుంచి ఎలిమినేట్ అయ్యాడు. బయటకు వచ్చిన తర్వాత అవినాష్ చేసిన ఓ పని అనుమానాలు రేకెత్తిస్తోంది. ఆ వివరాలు మీకోసం!

జోకర్‌గా ఎంట్రీ ఇచ్చి... షోలో సత్తా చాటి
చాలా కాలంగా జబర్ధస్త్ షో ద్వారా ఎంతో మందికి కామెడీని పంచాడు ముక్కు అవినాష్. ఈ క్రమంలోనే బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. ప్రస్తుతం ప్రసారం అవుతోన్న నాలుగో సీజన్‌లోకి జోకర్ గెటప్‌తో ఎంట్రీ ఇచ్చిన అతడు.. దానికి సరైన అర్థం చెప్పేలా ప్రవర్తించాడు. హౌస్‌లోకి ప్రవేశించనప్పటి నుంచే తన మార్క్ చూపిస్తూ ప్రేక్షకుల మనసు గెలుచుకున్నాడు.

లవ్ ట్రాక్ వల్ల హాట్ టాపిక్ అయిపోయి
బిగ్ బాస్ హౌస్‌లో తనలోని రొమాంటిక్ యాంగిల్‌ను బయట పెట్టాడు ముక్కు అవినాష్. ఉదయం లేచినప్పటి నుంచి పడుకునే వరకు కంటెస్టెంట్లతో సరదాగా గడుపుతూ నవ్వులు పూయించిన అతడు.. ఆరియానా గ్లోరీతో ట్రాకు నడిపి మరింత హాట్ టాపిక్ అయ్యాడు. ఆమెతోనే ఉంటూ ఆమె కోసమే ఆడుతూ తరచూ వార్తల్లో నిలిచిన అవినాష్.. సోషల్ మీడియాలో పాపులర్ అయ్యాడు.

ఊహించని విధంగా షో నుంచి బయటకు
చాలా కాలం పాటు బిగ్ బాస్ హౌస్‌లో కొనసాగిన అవినాష్.. అందరికీ నవ్వులు పంచాడు. ఈ క్రమంలోనే హోస్టులతో పాటు ప్రేక్షకుల నుంచి బెస్ట్ ఎంటర్‌టైనర్ అనే బిరుదును సంపాదించుకున్నాడు. ఇలా నవ్వుతూ నవ్విస్తూ షోలో కొనసాగుతూ వచ్చిన అతడు.. 13వ వారం జరిగిన ఎలిమినేషన్స్‌లో ఊహించని విధంగా బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చేశాడు.

బిజీ బిజీగా అవినాష్.. ఊర్లో టూర్ సక్సెస్
బిగ్ బాస్ షో నుంచి బయటకు వచ్చిన తర్వాత అవినాష్ ఫుల్ బిజీ అయిపోయాడు. తరచూ ఏదో ఒక ఇంటర్వ్యూలో పాల్గొడంతో పాటు సోషల్ మీడియా ద్వారా ఫ్యాన్స్‌తో ముచ్చటించాడు. ఈ సందర్భంగా బిగ్ బాస్ గురించి ఎన్నో విషయాలను ఫ్యాన్స్‌తో పంచుకున్నాడు. అంతేకాదు, తన స్వగ్రామం వెళ్లి అక్కడ విజయయాత్రలోనూ పాల్గొన్నాడు. దానికి భారీ స్థాయిలో జనం వచ్చారు.

అవినాష్ రీఎంట్రీపై సెన్సేషనల్ న్యూస్ లీక్
బిగ్ బాస్ హౌస్‌లో ఉన్న సమయంలో తనను జబర్ధస్త్ షో నుంచి తీసేశారని అవినాష్ పలుమార్లు సంచలన వ్యాఖ్యలు చేశాడు. కొన్ని సార్లు ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ కన్నీరు కూడా కార్చాడు. దీంతో బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత జబర్ధస్త్‌లోకి వెళ్లడని అంతా అనుకున్నారు. కానీ, ఇంటర్వ్యూల్లో మాత్రం పిలిస్తే వెళ్తానని చెప్పాడు. ఈ నేపథ్యంలో తాజాగా ఓ న్యూస్ లీకైంది.

మరి ఆయనను ఎందుకు కలిసినట్లు?
ఇటీవల వివాహం చేసుకున్న నిహారిక - చైతన్యకు శుభాకాంక్షలు తెలిపేందుకు అవినాష్.. గెటప్ శ్రీనుతో కలిసి నాగబాబు ఇంటికి వెళ్లాడు. అంతేకాదు, అక్కడ కొత్త దంపతులతో ఓ ఫొటోను కూడా దిగాడు. అయితే, అవినాష్ అక్కడకు వెళ్లింది తన భవిష్యత్ గురించి నాగబాబుతో చర్చలు జరపడానికే అని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇదే జరిగితే అతడు త్వరలోనే రీఎంట్రీ ఇవ్వడం ఖాయం.