బయటకు రా.. బిడ్డా నీకు పెళ్లి జేస్తా.. రంది పెట్టుకోకు.. అవినాష్‌‌‌కు తల్లి లైన్ క్లియర్

బిగ్‌బాస్ ఇంటిలో 73వ రోజులు భావోద్వేగాలు కనిపించారు. ఇంటి సభ్యుల తల్లులు ప్రవేశించడంతో ఇళ్లంతా పండగ వాతావరణం కనిపించింది. కమాండెంట్ టాస్క్ జరుగుతుండగా అవినాష్ తల్లి మల్లమ్మ ఇంట్లోకి ప్రవేశించారు. ఆ సమయంలో ఇంటి సభ్యులందరూ ఫ్రీజ్ మోడ్‌లో ఉన్నారు. తన తల్లిని చూసి అవినాష్ సంతోషంలో మునిగిపోయాడు. అవినాష్ తల్లి ఇంటి సభ్యులకు ఏం చెప్పారంటే..

నీ కోసమే టీవీ చూస్తున్నా

నీ కోసమే టీవీ చూస్తున్నా

అవినాష్‌తో తన తల్లి మాట్లాడుతూ.. ఇంట్లో అందరూ మంచిగా ఉన్నారు. నాన్న బాగున్నారు. అన్న, వదినలందరూ మంచిగా ఉన్నారు. మీరు బాగా ఆడుతున్నారు. నీ గురించి అందరూ బాగా మాట్లాడుకొంటున్నారు. చాలా మెచ్చుకొంటున్నారు. నాకు టీవీ చూడటం అలవాటు లేకున్నా నీ కోసం టీవీ చేస్తున్నాను అని అవినాష్ తల్లి మల్లమ్మ తెలిపారు.

భయపడకు బిడ్డా అంటూ

భయపడకు బిడ్డా అంటూ

నా బంగారు తండ్రి అంటూ ముద్దు చేసింది. పోలంలో నాట్లు వేశారు. కోతకు కూడా వచ్చింది. ఇంటి వద్ద అంతా బాగానే ఉంది. ఎవరితో నీవు గొడవ పడకు అని చెప్పింది. ఇక ఇంటి సభ్యులందరూ అన్ ఫ్రీజ్ కావడంతో పరుగెత్తుకొంటూ వచ్చి అవినాష్ తల్లితో ముచ్చటించారు. నాకు ఏం మాట్లాడాలో తెలియడం లేదు అంటే... భయపడకు బిడ్డా.. మంచిగా మాట్లాడు అంటూ తల్లి ధైర్యం చెప్పింది. అయితే నాపై అలుగుతున్నాడు.. కోపగించుకొంటున్నాడు అంటూ అరియానా కంప్లయిట్ చేయడంతో వద్దు బిడ్డ అలా చేయకు.. అందరితో మంచిగా ఉండూ అంటూ బుజ్జగించింది.

దేవుడికి చేతులెత్తి మొక్కుతున్నా

దేవుడికి చేతులెత్తి మొక్కుతున్నా

మీరందరూ బాగా ఆడుతున్నారు. మీరు బాగుండాలని దేవుడికి రోజు చేతులు ఎత్తి మొక్కుతున్నాను. మీకే ఎలాంటి బాధలు రావొద్దని పూజలు చేస్తున్నాను. ఇంటి నుంచి బయటకు వచ్చిన తర్వాత నీకు పెళ్లి చేస్తాను. రందీ పెట్టుకోకు అంటూ మల్లమ్మ తన కొడుకు చెప్పింది. దాంతో ఇంటి సభ్యులందరూ నవ్వుల్లో మునిగిపోయారు.

ఆ నలుగురికి ముద్దులు

ఆ నలుగురికి ముద్దులు

ఇక ఇంటిలోని అరియానా, లాస్య, హారిక, మోనాల్ గజ్జర్‌ను అందర్నీ ప్రత్యేకంగా పలకరించారు. ఒక్కొక్కరితో మాట్లాడుతూ... లేడి కంటెస్టెంట్లందరికి ముద్దులు పెట్టారు. ముద్దుగా మాట్లాడుతూ అందర్ని అప్యాయంగా పలకరించారు. నీవు బాగా ఆడుతున్నావంటూ నాతో అందరూ ఫొటోలు దిగుతున్నారు. ఇంటికి చాలా మంది వచ్చి కలుస్తున్నారు అని మల్లమ్మ చెప్పడంతో అవినాష్, ఇతర సభ్యులు హ్యాపీగా ఫీలయ్యారు.

Recommended Video

Prabhas, Saif Ali Khan-Starrer 'Adipurush' To Release In August 2022
నీ జోకులకు నవ్వుతున్నారు..

నీ జోకులకు నవ్వుతున్నారు..

బిగ్‌బాస్‌లోకి వచ్చిన తర్వాత నీకు మంచి ఫాలోయింగ్ ఏర్పడింది. నన్ను హైదరాబాద్‌కు తీసుకెళ్తామంటూ చెప్పారు. అయితే వాళ్లు తీసుకెళ్లి ఏమైనా చేస్తారేమో అనే భయంతో నేను రానని చెప్పాను. అందరూ నీ జోకులకు నవ్వుతున్నారు. మీరు చాలా కష్టపడి వచ్చారు. ఇక్కడ కష్టాలు పడుతున్నారు. మీరు బాగా ఆడాలి అంటూ మల్లమ్మ చెప్పారు. అవినాష్‌తో కలిసి డ్యాన్స్ చేసి ఇంటి నుంచి నిష్క్రమించారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X