బిగ్‌బాస్ కోసం వెళ్లాలంటే జబర్దస్ట్ షోకు నష్టపరిహారం.. అవినాష్ దగ్గర గట్టిగానే గుంజారు..?
సాధారణంగా టీవీ ఇండస్ట్రీలలో కూడా అహంకారాలు ఒక రేంజ్ లో ఉంటాయి. ఒకరు ఉన్నత స్థాయికి ఎదుగుతుంటే ఓర్వలేని గుణాలు చాలానే ఉంటాయి. వాటన్నిటినీ తట్టుకొని నిలబడాలి అంటే అంత సులువైన విషయం కాదు. ఇక జబర్దస్త్ వలన చాలా మంది కమెడియన్స్ జీవితాలు బాగుపడిన విషయం తెలిసిందే. అయితే గత కొంత కాలంగా ఆ షోను నిర్వహిస్తున్న మల్లెమాల ప్రొడక్షన్ పై అనేక రకాల నెగిటివ్ కామెంట్స్ వస్తున్నాయి.

తెగదెంపులు తెచ్చుకోవడంతో..
క్యాష్, మహిళలు మహారాణులు, ఢీ వంటి షోలతో ఎంతగానో క్రేజ్ తెచ్చుకున్న మల్లెమాల ఎంటర్టైన్మెంట్స్ ఆ తరువాత జబర్దస్త్ తో మరో స్థాయికి చేరుకుంది. ఎంతో మంది కమెడియన్స్ వారి జీవితాలను సెట్ చేసుకున్నారు. అయితే ఈ మధ్య కాలంలో ఆ షో నుంచి నాగబాబు బయటకు రావడం అలాగే ఇతర కమెడియన్స్ కూడా తెగదెంపులు తెచ్చుకోవడం వైరల్ అయిన విషయం తెలిసిందే.

అవినాష్ కూడా ఇబ్బంది పడ్డాడు..?
ఇక ముక్కు అవినాష్ కూడా జబర్దస్త్ షో నుంచి గ్యాప్ తీసుకొని బిగ్ బాస్ షోలోకి రావడానికి చాలా తిప్పలు పడ్డాడని తెలుస్తోంది. ఎందుకంటే జబర్దస్ట్ యాజమాన్యం ప్రతీ ఒక్క కమెడియన్ తో ఒక అగ్రిమెంట్ సెట్ చేసుకుంటుందని టాక్. అందులో చేసిన వారు మరో షోలోకి వెళ్ళాలి అంటే ఒక అగ్రిమెంట్ ప్రకారం నడుచుకోవాల్సి ఉంటుంది.

నష్టపరిహారం చెల్లించాలని..
మరో షోలోకి వెళ్ళాలి అంటే జబర్దస్త్ కి భారీ మొత్తంలో నష్టపరిహారం చెల్లించాల్సి ఉంటుంది. వారికి నచ్చకపోతే ఫ్రీగానే వెళ్లిపోవచ్చు. కానీ రేటింగ్ తో లాభాలు వస్తే మాత్రం అంత ఈజీగా వదిలి పెట్టరు. మళ్ళీ జీతాలు పెంచుతారు అంటే అది ఉండదట. అందుకే నష్టపరిహారం అగ్రిమెంట్ కి భయపడి మరో షోలోకి వెళ్ళాలి అంటే బయపడుతున్నారట కొంతమంది నటులు.

గట్టిగానే గుంజారట..
ఇక ఇటీవల తెగించి మరీ జబర్దస్త్ నుంచి బయటకు వచ్చేశాడు ముక్కు అవినాష్. గత కొన్నేళ్లుగా జబర్దస్త్ లోనే ఉంటున్న అవినాష్ ఎలాగైనా కెరీర్ లో ఇంకా ఉన్నత స్థాయికి ఎదగాలని బిగ్ బాస్ షో కోసం సాహసం చేయలేక తప్పలేదు. జబర్దస్త్ యాజమాన్యానికి అగ్రిమెంట్ ప్రకారం నష్టపరిహారం చెల్లించే బయటకు వచ్చాడట. ఈ విషయంలో గత నెల నుంచి అవినాష్ వారితో చర్చలు జరుపుతున్నాడట. చర్చల ఆలస్యం వలనే కంటెస్టెంట్స్ గా రావాల్సింది వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చినట్లు తెలుస్తోంది.


Click it and Unblock the Notifications











