ఏడాది తర్వాత బిగ్ సీక్రెట్ రివీల్.. బిగ్ బాస్ నటుడు సర్ప్రైజ్ ఇచ్చాడుగా!

ముక్కు అవినాష్ (Mukku Avinash).. తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు ఈ నటుడి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. జబర్దస్త్ ద్వారా తెలుగు వారికి పరిచయమయ్యారు. తన కామెడీ టైమింగ్ తో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నారు. ఈ ఫేమ్ తో తర్వాత బిగ్ బాస్ తెలుగు రియాల్టీ షోలో పాల్గొని మరింత గుర్తింపు సంపాదించాడు. రెండు సార్లు ఈ రియాలిటీ షోలో పాల్గొన్న అతను విజేతగా నిలవకున్నా తన ఆట, మాట తీరుతో మంచి క్రేజ్ సొంతం చేసుకున్నాడు.ఇక బిగ్ బాస్ తర్వాత ఎన్నో షోలో పాల్గొంటూ ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తున్నారు. అయితే, గతేడాదిగా ఓ విషయాన్ని దాచిపెట్టి, సడెన్ గా బిగ్ సీక్రెట్ ఇచ్చారు. ఇంతకీ ఆ సీక్రెట్ ఎంటీ?

Also Read
పెద్దిలో జాన్వీ ఫస్ట్ ఛాయిస్ కాదా.. గోల్డెన్ ఛాన్స్ మిస్ చేసుకున్న ఆ హీరోయిన్ ఎవరు?
పెద్దిలో జాన్వీ ఫస్ట్ ఛాయిస్ కాదా.. గోల్డెన్ ఛాన్స్ మిస్ చేసుకున్న ఆ హీరోయిన్ ఎవరు?

ఆ బిగ్ సర్ఫ్రైజ్ ఏంటో కాదు.. ముక్కు అవినాష్ ఇటీవల తండ్రయ్యాడనే విషయం బయటకు రావడం. ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆశ్చర్యకర విషయం ఏమిటంటే.. అతను ఈ విషయాన్ని దాదాపు ఏడాది పాటు రహస్యంగా ఉంచాడు. గతేడాది మే 14న తనకు కుమారుడు జన్మించాడని, అతనికి 'అద్వైత్' అని పేరు పెట్టినట్లు అవినాష్ వెల్లడించాడు. తాజాగా తన కొడుకు మొదటి పుట్టినరోజును ఘనంగా నిర్వహించగా, ఆ వేడుకలో పలువురు బుల్లితెర ప్రముఖులు పాల్గొని సందడి చేశారు. ఈ సందర్భంగా తన కుటుంబంతో కలిసి ఉన్న ఫోటోలు, వీడియోలు పంచుకుంటూ ఈ శుభవార్తను అభిమానులతో షేర్ చేసుకున్నాడు.

Recommended For You
ఆ 50 నిమిషాలు పిచ్చెక్కిపోతుంది.. పెద్దిపై డైరెక్టర్ బుచ్చిబాబు హైప్
ఆ 50 నిమిషాలు పిచ్చెక్కిపోతుంది.. పెద్దిపై డైరెక్టర్ బుచ్చిబాబు హైప్
Mukku Avinash Reveals Secret After a Year Bigg Boss Star Shares Emotional Fatherhood Story

అయితే ఈ ఆనందం వెనుక ఒక పెద్ద విషాద గాథ దాగి ఉంది. అవినాష్ 2021 నవంబర్‌లో అనూజను వివాహం చేసుకున్నాడు. దంపతులు 2023లో తల్లిదండ్రులు కాబోతున్నామంటూ సంతోషకర వార్తను ప్రకటించారు. బేబీ బంప్ ఫోటోలు, మెటర్నిటీ షూట్స్, సీమంతం వేడుకలతో ఆ ఆనందాన్ని సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకున్నారు. కానీ ఆ సంతోషం ఎక్కువకాలం నిలవలేదు. 2024 ప్రారంభంలో అనూహ్యంగా వారికి పెద్ద షాక్ తగిలింది. డెలివరీకి కొన్ని గంటల ముందు, అనూజ గర్భంలో ఉన్న బిడ్డ కదలికలు ఆగిపోయాయి. వెంటనే ఆస్పత్రికి తరలించగా, వైద్యులు బిడ్డ గుండె కొట్టుకోవడం ఆగిపోయిందని తెలిపారు.

You May Also Like
Karuppu Day 2 Box Office Collection: బాక్సాఫీస్ వద్ద కరుప్పు వసూళ్ల వేట..సూర్య మూవీకి ఎన్ని కోట్లంటే?
Karuppu Day 2 Box Office Collection: బాక్సాఫీస్ వద్ద కరుప్పు వసూళ్ల వేట..సూర్య మూవీకి ఎన్ని కోట్లంటే?

ఈ వార్త అవినాష్‌ను పూర్తిగా కుదిపేసింది. ఏదైనా చేసి తన బిడ్డను కాపాడాలని డాక్టర్లను వేడుకున్నప్పటికీ, పరిస్థితి వారి చేతుల్లో లేదని వైద్యులు స్పష్టం చేశారు. ఈ విషాదం అవినాష్ దంపతులను తీవ్ర మానసిక వేదనకు గురిచేసింది. ఈ సంఘటన గురించి తర్వాత ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన అవినాష్, "2.75 కిలోల బరువుతో పుట్టిన మా బిడ్డలో ప్రాణం లేకపోవడం మమ్మల్ని పూర్తిగా కుంగదీసింది" అని చెప్పాడు. ఆ సమయంలో తాను ఎంతగా మానసికంగా కృంగిపోయానో వివరిస్తూ, అర్ధరాత్రి రోడ్డుపై ఒంటరిగా ఏడ్చిన రోజుల్ని గుర్తుచేసుకున్నాడు. ఆ బాధ నుంచి బయటపడటానికి చాలా సమయం పట్టిందని చెప్పాడు.

7 ఏళ్ల ప్రేమ.. పెళ్లి తర్వాత లైఫ్ పూర్తి మారిపోయింది.. అవికా షాకింగ్ స్టేట్‌మెంట్!
7 ఏళ్ల ప్రేమ.. పెళ్లి తర్వాత లైఫ్ పూర్తి మారిపోయింది.. అవికా షాకింగ్ స్టేట్‌మెంట్!

అందుకే రెండోసారి అనూజ గర్భవతి అయినప్పుడు, ఈ విషయం ఎవరికీ చెప్పకూడదని నిర్ణయించుకున్నారు. ఈసారి ఏ చిన్న రిస్క్ కూడా తీసుకోకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. కొడుకు పుట్టిన తర్వాత కూడా వెంటనే బయటకు చెప్పకుండా, ఒక సంవత్సరం పూర్తయ్యాక మాత్రమే ఈ విషయాన్ని వెల్లడించారు. ఇప్పుడు కొడుకు ఆరోగ్యంగా ఉండటం, కుటుంబంలో మళ్లీ ఆనందం నిండటం అవినాష్‌కు కొత్త జీవితాన్ని ఇచ్చినట్లైంది. ప్రస్తుతం ఆయనకు అభిమానులు శుభాకాంక్షలు తెలియజేస్తూ, చిన్నారి అద్వైత్‌కు ఆశీస్సులు అందిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X