‘జబర్ధస్త్’కు భారీ షాకిచ్చిన అవినాష్: అలా రివేంజ్ తీర్చుకున్నాడు.. దెబ్బకు రికార్డులు బద్దలు
తెలుగులో ఎన్నో కామెడీ షోలు వస్తున్నాయి. అయితే, అవి అంతగా సక్సెస్ కాలేకపోతున్నాయి. దీనికి కారణం ప్రముఖ ఛానెల్‌లో ప్రసారం అవుతోన్న జబర్ధస్త్. అవును.. దాదాపు ఎనిమిదేళ్లుగా ఇది బుల్లితెరపై హవాను చూపిస్తూ నెంబర్ వన్ షోగా వెలుగొందుతోంది. దీని ద్వారా ఎంతో మంది వెలుగులోకి వచ్చి ఫేమస్ అయ్యారు. అందులో ముక్కు అవినాష్ కూడా ఒకడు. కొన్ని నెలల క్రితం జబర్ధస్త్‌కు గుడ్‌బై చెప్పి బిగ్ బాస్ షోలోకి ఎంట్రీ ఇచ్చాడు. ఆ సమయంలోనే తనకు లైఫిచ్చిన షోను విమర్శింశాడు. ఈ క్రమంలోనే తాజాగా ఆ షోకు భారీ షాకిచ్చాడు. ఆ వివరాలు మీకోసం!

మిమిక్రీ ఆర్టిస్టు నుంచి టీమ్ లీడర్ దాక
మిమిక్రీ ఆర్టిస్టుగా కెరీర్ ఆరంభించాడు ముక్కు అవినాష్. కొందరు హీరోల వాయిస్‌ను అనుకరించడంతో పాటు వాళ్ల స్టైల్స్‌ను ఇమిటేట్ చేసేవాడు. ఇలా జబర్ధస్త్ కమెడియన్ల దృష్టిలో పడ్డాడు. అప్పుడే ఆ షో అవకాశం దక్కించుకున్నాడు. ఆ తర్వాత అనతి కాలంలోనే అద్భుతమైన టాలెంట్‌తో ఆకట్టుకోవడంతో అవినాష్‌కు టీమ్ లీడర్‌గా ప్రమోషన్ ఇచ్చిందీ జబర్ధస్త్ యూనిట్.

దానికి బైబై.. రియాలిటీ షోలోకి ప్రవేశం
చిన్న ఆర్టిస్టుగా ఎంట్రీ ఇచ్చి తక్కువ సమయంలోనే జబర్ధస్త్ టీమ్ లీడర్‌గా ఎదిగాడు అవినాష్‌కు. ఇలాంటి పరిస్థితుల్లో అతడికి బిగ్ బాస్ షో నుంచి ఆఫర్ వచ్చింది. ఈ నేపథ్యంలోనే నాలుగో సీజన్‌లో ఎంట్రీ ఇవ్వాలని అతడిని కోరారు. దీంతో రెండో వారంలో జోకర్ గెటప్‌తో అవినాష్ ఇంట్లోకి అడుగు పెట్టాడు. అప్పటి నుంచి నవ్వుతూ అందరినీ నవ్విస్తూ రచ్చ రచ్చ చేసేశాడు.

గెలవకున్నా... ఎంటర్‌టైనర్‌గా పేరుతో
జోకర్ అని తాను పెట్టుకున్న పేరుకు ఏమాత్రం తీసిపోని విధంగా బిగ్ బాస్ హౌస్‌లోకి ఎంటర్ అయినప్పటి నుంచే తనదైన మార్క్ చూపించడానికి అవినాష్ ఎంతగానో ప్రయత్నించాడు. ఈ క్రమంలోనే అందరినీ ఆట పట్టిస్తూ, కామెడీని పంచుతూ ఎంటర్‌టైనర్ అనిపించుకున్నాడు. చివరికి బిగ్ బాస్ ట్రోఫీని గెలవకున్నా కమెడియన్ అన్న పేరుకు సార్థకం చేసుకున్నాడు అవినాష్.

జబర్ధస్త్‌పై అవినాష్ షాకింగ్ కామెంట్లు
జబర్ధస్త్ షో ద్వారా ప్రపంచానికి పరిచయం అయిన అవినాష్.. బిగ్ బాస్‌లో ఉన్న సమయంలో ఆ షోపై విమర్శలు చేశాడు. తనను దాని నుంచి తీసేశారని పలుమార్లు చెప్పాడు. బయటకు వచ్చిన తర్వాత కూడా షోపై షాకింగ్ కామెంట్స్ చేశాడు. బిగ్ బాస్‌లోకి వెళ్తానంటే తన దగ్గర రూ. 10 లక్షలు వసూలు చేశారని చెప్పాడు. అవకాశం ఇస్తే రీఎంట్రీ ఇస్తానని కూడా వెల్లడించాడతను.

కామెడీ స్టార్స్ అంటూ మొదలెట్టారుగా
స్టార్ మాలో 'కామెడీ స్టార్స్' అనే షో ప్రారంభం అయిన విషయం తెలిసిందే. ఇందులో అవినాష్‌నే ఎక్కువగా హైలైట్ చేస్తున్నారు. ప్రతి ఆదివారం ప్రసారం అయ్యే ఈ షోకు అప్పటి హీరోయిన్ శ్రీదేవి, శేఖర్ మాస్టర్ జడ్జ్‌లుగా వ్యవహరిస్తున్నారు. వర్షిణి యాంకరింగ్ బాధ్యతలు నిర్వహిస్తోంది. అవినాష్‌తో పాటు చమ్మక్ చంద్ర, కార్తీక దీపం సౌర్య, హిమ కూడా ఎంటర్‌టైన్ చేస్తున్నారు.

‘జబర్ధస్త్’కు భారీ షాకిచ్చిన అవినాష్
ఏమాత్రం అంచనాలు లేకుండానే ప్రారంభం అయిన ఈ షో ఆరంభ ఎపిసోడ్‌తోనే సత్తా చాటింది. అదిరిపోయే పంచులతో ఆకట్టుకునే టీమ్ లీడర్లు ప్రేక్షకులను దీని వైపునకు తిరిగేలా చేశారు. అందుకే ఫస్ట్ ఎపిసోడ్‌కు భారీ స్థాయిలో 9.8 టీఆర్పీ రేటింగ్ వచ్చింది. ఈ విషయాన్ని అవినాష్ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ద్వారా తెలిపాడు. దీంతో జబర్ధస్త్‌కు భారీ షాక్ తగిలినట్లైంది.

అలా రివేంజ్.. దెబ్బకు రికార్డులు బద్దలు
సాధారణంగా జబర్ధస్త్ ఎపిసోడ్లకు ఆరు ఏడుకు మించి రేటింగ్ రాదు. కానీ.. 'కామెడీ స్టార్స్'కు మాత్రం ఏకంగా 9.8 రావడం హాట్ టాపిక్ అవుతోంది. ఈ సక్సెస్ వెనుక అవినాష్ పాత్ర ఉందన్న విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ కారణంగానే ఈ విజయాన్ని బాగా ఆస్వాదిస్తున్నాడు. ఆ రికార్డుతో అవినాష్ జబర్ధస్త్‌పై రివేంజ్ తీర్చుకున్నాడని కొందరు కామెంట్లు చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











