బిగ్ బాస్‌ వల్లే ఇలా జరిగింది.. తప్పును బయట పెట్టి క్షమాపణ: స్టార్ హీరోను వేడుకున్న అవినాష్

జబర్ధస్త్ అనే కామెడీ షో ద్వారా వెలుగులోకి వచ్చి.. చాలా తక్కువ సమయంలోనే ఊహించని రీతిలో పాపులారిటీని సొంతం చేసుకున్న వారిలో ముక్కు అవినాష్ ఒకడు. సాధారణ ఆర్టిస్టుగా షోలోకి ఎంట్రీ ఇచ్చిన అతడు.. అసాధారణ ప్రతిభతో ఆకట్టుకున్నాడు. ఫలితంగా టీమ్ లీడర్ అయ్యాడు. ఈ క్రేజ్‌ కారణంగానే బిగ్ బాస్ నాలుగో సీజన్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. అక్కడా మంచి పేరు తెచ్చుకున్న అతడు.. తాజాగా ఓ ఈవెంట్‌కు వెళ్లాడు. అక్కడ అందరి ముందే ఓ స్టార్ హీరోకు, డైరెక్టర్‌కు క్షమాపణలు చెప్పాడు అవినాష్. అసలేం జరిగింది? పూర్తి వివరాలు మీకోసం!

జోకర్‌గా ఎంట్రీ ఇచ్చి.. అదరగొట్టేశాడు

జోకర్‌గా ఎంట్రీ ఇచ్చి.. అదరగొట్టేశాడు


జబర్ధస్త్‌లోని టాప్ కమెడియన్లలో ఒకడిగా వెలుగొందుతోన్న ముక్కు అవినాష్.. కొద్ది రోజుల క్రితం మొదలైన బిగ్ బాస్ నాలుగో సీజన్‌లోకి కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇచ్చాడు. తనను తాను జోకర్ అని చెప్పుకుంటూ వచ్చిన అతడు.. అద్భుతమైన ఆటతీరుతో ఆకట్టుకున్నాడు. ప్రతి టాస్కులోనూ వందకు వంద శాతం శ్రమిస్తూ సత్తా చాటాడు. ఫలితంగా గేమర్ అనిపించుకున్నాడు.

బెస్ట్ ఎంటర్‌టైనర్‌గా బయటకొచ్చాడు

బెస్ట్ ఎంటర్‌టైనర్‌గా బయటకొచ్చాడు

బిగ్ బాస్ హౌస్‌ లోపలికి ప్రవేశించినప్పటి నుంచి తనదైన శైలి కామెడీని పంచుతూ మిగిలిన కంటెస్టెంట్లతో పాటు ప్రేక్షకులను నవ్విస్తూ సందడి చేశాడు ముక్కు అవినాష్. ఎప్పుడూ కొట్లాటలు, గొడవలతో సాగే షోను అద్భుతమైన టైమింగ్‌తో పంచులు పేలుస్తూ నవ్వుల కార్యక్రమంగా మార్చాడు. ఫలితంగా అతడు బిగ్ బాస్ చరిత్రలోనే బెస్ట్ ఎంటర్‌టైనర్ అనిపించుకున్నాడు.

ఆమె ట్రాకుతో మరింత హాట్ టాపిక్‌గా

ఆమె ట్రాకుతో మరింత హాట్ టాపిక్‌గా

ఎప్పుడూ నవ్వుతూ నవ్విస్తూ బెస్ట్ ఎంటర్‌టైనర్ అనిపించుకున్న అవినాష్.. ఆరియానా గ్లోరీతో లవ్ ట్రాకుతో మరింత పాపులర్ అయ్యాడు. దీనికితోడు టాస్కుల్లో మంచిగా ఆడుతూ ఆకట్టుకున్నాడు. ఇవన్నీ చేసినా నామినేషన్స్ సమయంలో మాత్రం సహనం కోల్పోతూ ఉండేవాడు. ఈ క్రమంలోనే 13వ వారంలో ఊహించని విధంగా బిగ్ బాస్ షో నుంచి బయటకు వచ్చేశాడు.

ఆ షోలోకి రీఎంట్రీ.. అసలేం జరిగింది?

ఆ షోలోకి రీఎంట్రీ.. అసలేం జరిగింది?


బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత అవినాష్ ఫుల్ బిజీ అయిపోయాడు. ఈ క్రమంలోనే వరుస ఇంటర్వ్యూలు ఇవ్వడంతో పాటు సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటున్నాడు. అంతేకాదు, తన పాత షో జబర్ధస్త్ రీఎంట్రీ గురించి ఎన్నో విషయాలు వెల్లడిస్తున్నాడు. వాళ్లు మరోసారి అవకాశం ఇస్తే.. తప్పుకుండా వెళ్తానని చెబుతున్నాడు. ఇలా తరచూ ట్రెండ్ అవుతున్నాడు.

బిగ్ బాస్‌ వల్లే ఇలా జరిగిందంటూ లీక్

బిగ్ బాస్‌ వల్లే ఇలా జరిగిందంటూ లీక్

రవితేజ - గోపీచంద్ మలినేని కాంబినేషన్‌లో వస్తున్న చిత్రం 'క్రాక్'. సంక్రాంతి కానుకగా జనవరి 9న ఈ మూవీ విడుదల కాబోతుంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా బుధవారం సాయంత్రం హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. దీనికి ముక్కు అవినాష్ కూడా హాజరయ్యాడు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. బిగ్ బాస్ వల్ల జరిగిన ఓ తప్పును లీక్ చేశాడు.

సారీతో స్టార్ హీరోను వేడుకున్న అవినాష్

సారీతో స్టార్ హీరోను వేడుకున్న అవినాష్


వాస్తవానికి అవినాష్ 'క్రాక్' మూవీలో నటించాడట. అయితే, బిగ్ బాస్ షోలోకి వెళ్లడం వల్ల కొంత భాగం షూటింగ్‌కు హాజర కాలేకపోయాడు. దీన్ని ప్రస్తావిస్తూ.. 'లాక్‌డౌన్ కొనసాగుతుంది.. షూటింగ్‌లు ఉండవని బిగ్ బాస్‌లోకి వెళ్లాను. అందుకే ఈ షూటింగ్‌కు రాలేకపోయాను. రవితేజ సార్.. గోపీచంద్ సార్ దయచేసి నన్ను క్షమించండి' అంటూ స్టేజ్ నుంచే వేడుకున్నాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X