For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  ఆరియానాపై అవినాష్ సంచలన వ్యాఖ్యలు: అతడితో అలాంటి పనులు.. తప్పని చెప్పినా వినలేదంటూ!

  |

  తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షోగా వెలుగొందుతోంది బిగ్ బాస్. ఏమాత్రం అంచనాలు లేకుండానే వచ్చిన ఈ కార్యక్రమానికి మన ప్రేక్షకుల నుంచి ఎవరూ ఊహించని రీతిలో స్పందన వచ్చింది. ఫలితంగా ఇది సూపర్ డూపర్ హిట్ అయింది. అదే సమయంలో ఏకంగా నాలుగు సీజన్లను కూడా పూర్తి చేసుకుని.. ఐదో దానికై సిద్ధం అవుతోంది. ఇక, ఈ షో వల్ల ఎంతో మంది చిన్న ఆర్టిస్టులు బిగ్ సెలెబ్రిటీలు అయ్యారు. వారిలో కొందరు మాత్రం జంటగా పాపులర్ అయ్యారు. అలాంటి వారిలో ముక్కు అవినాష్ - ఆరియానా గ్లోరీ జోడీ ఒకటి. నాలుగో సీజన్‌లో సందడి చేసిన వీళ్లిద్దరూ.. బయట కూడా క్లోజ్‌గానే ఉంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఆరియానా ప్రవర్తనతో ఈ ఇద్దరి మధ్య విభేదాలు వచ్చాయట. ఈ విషయాన్ని అవినాష్ స్వయంగా చెప్పాడు. వివరాల్లోకి వెళ్తే..

  అవినాష్ అలా.. ఆరియానా ఇలా ఫేమస్

  అవినాష్ అలా.. ఆరియానా ఇలా ఫేమస్

  మిమిక్రీ ఆర్టిస్టుగా కెరీర్‌ను ఆరంభించి.. ఆ తర్వాత జబర్ధస్త్‌ షోలోకి వెళ్లడం వల్ల గుర్తింపును సంపాదించుకున్నాడు ప్రముఖ హాస్య నటుడు ముక్కు అవినాష్. అందులో తనదైన శైలి కామెడీతో ఎంతో ఫేమస్ అయ్యాడతను. దీంతో సినిమా ఛాన్స్‌లు కూడా పట్టేశాడు. మరోవైపు, యూట్యూబ్‌ ఛానెల్‌లో యాంకర్‌గా తన ప్రయాణాన్ని మొదలెట్టింది బోల్డ్ బ్యూటీ ఆరియానా గ్లోరీ. ఈ క్రమంలోనే ఎంతో మంది సినీ ప్రముఖులను ఇంటర్వ్యూలు చేసి పాపులర్ అయింది. మరీ ముఖ్యంగా రాంగోపాల్ వర్మతో చేసిన చిట్‌చాట్‌తో ఈ అమ్మాయి ఎనలేని క్రేజ్‌ను అందుకుని సత్తా చాటింది.

  మెగా హీరోల కోసం అభిమాని సాహసం: సర్‌ప్రైజ్ చేసిన చిరంజీవి, పవన్.. ఏ హీరో చేయని విధంగా!

  బిగ్ బాస్‌లోకి ప్రవేశం... ఇద్దరూ సీక్రెట్‌గా

  బిగ్ బాస్‌లోకి ప్రవేశం... ఇద్దరూ సీక్రెట్‌గా

  యాంకర్‌గా ఆరియానా గ్లోరీ.. కమెడియన్‌గా ముక్కు అవినాష్ తమ తమ రంగాల్లో సత్తా చాటుతోన్న సమయంలోనే బిగ్ బాస్ షో నాలుగో సీజన్‌లో కంటెస్టెంట్లుగా ఎంట్రీ ఇచ్చారు. అందరిలా కాకుండా వీళ్లిద్దరూ సీక్రెట్‌గానే హౌస్‌లోకి ప్రవేశించారు. ముందుగా ఆరియానా.. సయ్యద్ సోహెల్ రియాన్‌తో కలిసి సీక్రెట్‌ రూమ్‌లోకి వెళ్లగా.. ఆ తర్వాత రెండో వారంలో అవినాష్ జోకర్‌గా మారి లోపలికి ప్రవేశించాడు. సీక్రెట్ రూమ్‌లో ఉన్న సమయంలో ఆరియానా చేసిన అతికి హౌస్‌మేట్స్ ఆమెను దూరం పెట్టారు. దీంతో అప్పుడే ఎంట్రీ ఇచ్చిన అవినాష్‌కు ఆమె చాలా దగ్గరైపోయింది.

  జంటగా మారారు.. షోలో రచ్చ చేసేశారు

  జంటగా మారారు.. షోలో రచ్చ చేసేశారు

  జబర్ధస్త్ కమెడియన్ అవినాష్ ఎన్నో అంచనాల నడుమ టైటిల్ ఫేవరెట్‌గా బిగ్ బాస్ షోలోకి ఎంట్రీ ఇచ్చాడు. హౌస్‌లో కాలు పెట్టిన సమయం నుంచే మిగిలిన వారందరినీ నవ్వించడం మొదలు పెట్టాడు. ఈ క్రమంలోనే తోటి కంటెస్టెంట్ ఆరియానా గ్లోరీతో క్లోజ్ అయ్యాడు. ఆమెతో చెట్టాపట్టాలేసుకుని తిరుగుతూ హల్‌చల్ చేశాడు. ఫలితంగా ఇద్దరి మధ్య ట్రాక్ నడుస్తుందని ప్రచారం సాగింది. ఒకానొక సమయంలో వీళ్ల మధ్య ప్రేమ బలమైందని, బయటకు వచ్చిన తర్వాత పెళ్లి కూడా చేసుకుంటారన్న టాక్ వినిపించింది. దీంతో బిగ్ బాస్ హౌస్‌లో ఉన్నప్పుడే హైలైట్ అయిపోయారు.

  సుడిగాలి సుధీర్ రెమ్యూనరేషన్ లీక్: ఏ షోకు ఎంత వస్తుందంటే.. వామ్మో నెలకే అంత ఆదాయమా!

  క్రేజ్ పెరిగింది... బిజీ అయ్యారు.. జంటగా

  క్రేజ్ పెరిగింది... బిజీ అయ్యారు.. జంటగా

  అంతకు ముందే ఫుల్ ఫాలోయింగ్‌ను సంపాదించుకున్న అవినాష్.. బిగ్ బాస్ షో తన క్రేజ్‌ను మరింతగా పెంచుకున్నాడు. తద్వారా వరుసగా ఆఫర్లను అందుకుంటూ దూసుకెళ్తున్నాడు. అదే సమయంలో ఆరియానా గ్లోరీ సైతం బిగ్ బాస్ షో పుణ్యమా అని విపరీతమైన పాపులారిటీని సంపాదించుకుంది. దీంతో బయటకు వచ్చిన తర్వాత ఆమెకు ఆఫర్లు వెల్లువెత్తాయి. ఇప్పటికే అవినాష్ కొన్ని షోలలో సందడి చేస్తుండగా.. ఆరియానా మాత్రం షోలతో పాటు పలు సినిమాల్లోనూ నటిస్తూ బిజీగా మారింది. అప్పుడప్పుడూ వీళ్లిద్దరూ జంటగానూ ఎంజాయ్ చేస్తూ కనిపిస్తున్నారు.

  ఆర్జీవీతో ఆరియానా ఇంటర్వ్యూ.. సెటైర్లు

  ఆర్జీవీతో ఆరియానా ఇంటర్వ్యూ.. సెటైర్లు

  తనకు గుర్తింపు దక్కడంలో కీలక పాత్రను పోషించిన సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మతో ఇటీవల ఆరియానా గ్లోరీ ఓ బోల్డ్ ఇంటర్వ్యూ చేసిన విషయం తెలిసిందే. ఇందులో ఆమె బాడీలోని పార్టుల గురించి ఆయన అడిగిన ప్రశ్నలు.. దానికి ఈ బ్యూటీ రెస్పాండ్ అయిన తీరు అందరినీ ఆశ్చర్య పరిచాయి. మరీ ముఖ్యంగా జిమ్‌లో అందాలు ఆరబోస్తూ ఈ బోల్డ్ పాప చేసిన వర్కౌట్లు మరింతగా హైలైట్ అయ్యాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఈ ఇంటర్వ్యూను ప్రస్థావిస్తూ ముక్కు అవినాష్ తాజాగా జరిగిన ఓ కార్యక్రమంలోనే ఆరియానా గ్లోరీపై సెటైర్లు వేయడం షాకిచ్చింది.

  ఘాటు ఫోజులతో రెచ్చిపోయిన సుస్మితా సేన్: 45 ఏళ్ల వయసులో మరీ ఇంత దారుణంగానా!

  ఆయనలానే చేస్తూ.. పంచులు పేలుస్తూ

  ప్రస్తుతం ముక్కు అవినాష్ స్టార్ మాలో ప్రసారం అవుతోన్న ‘కామెడీ స్టార్స్' అనే షోలో చేస్తున్న విషయం తెలిసిందే. అతడి స్కిట్‌లో ఆరియానా గ్లోరీ కూడా కీలక పాత్రను చేసింది. తాజాగా దీనికి సంబంధించిన ప్రోమో విడుదలైంది. ఇందులో భాగంగా అవినాష్ ‘మేడం మీ బరువు ఎంత' అని ప్రశ్నించాడు. దీనికామె 44 అని చెప్పింది. అప్పుడు ‘మరి అక్కడ జిమ్‌లో అన్నన్ని బరువులు ఎత్తితే వెయిట్ తగ్గరా' అంటూ ఆర్జీవీ ఇంటర్వ్యూపై పంచ్ వేశాడు. ఆ తర్వాత ‘వీళ్లకు ఎక్కడా జాగా లేనట్లు జిమ్‌లోనే మాట్లాడాలా' అంటూ వర్మను అనుకరిస్తూ ఎన్నో రకాలుగా కామెంట్స్ చేశాడు.

  Ek Mini Katha Funny Skit With Ariyana, Avinash, Santosh Sobhan
  ఆరియానా ప్రవర్తనపై అవినాష్ కామెంట్స్

  ఆరియానా ప్రవర్తనపై అవినాష్ కామెంట్స్

  ఈ స్కిట్ చివర్లో హోస్ట్ శ్రీముఖి మాట్లాడుతూ.. ‘కొన్ని గొడవల వల్ల మీ ఇద్దరి మధ్య తేడా వచ్చింది. అసలు ఎందుకు విడిపోయారు' అని ప్రశ్నించింది. దీనికి ఆరియానా ‘అసలు గొడవ ఎందుకు అయిందో అర్థం కాలేదు. కానీ, దాని తర్వాత మాట్లాడొద్దు అనేది బాగా బాధగా అనిపించింది' అంది. దీనికి అవినాష్ ‘ఫ్రెండ్ తప్పుదారిలో వెళ్తుంటే ఇది రాంగ్ వే.. నాకంటూ ఎక్స్‌పీరియన్స్ ఉంది అలా వెళ్లకని చెప్పా. నా మాట వినలేదు. దీంతో ఆమెతో మాట్లాడడం మానేశాను. ఆ తర్వాత తనే వచ్చి సారీ అని చెప్పింది' అంటూ ఆమె ప్రవర్తనపై సంచలన వ్యాఖ్యలు చేశాడు.

  English summary
  Jabardasth fame Self-made comedian Mukku Avinash Recently Participated in Comedy Stars Show. In This Show He Commented about Ariyana Glory behaviour.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X