మళ్లీ అదే తప్పు చేసిన అవినాష్: బిగ్ బాస్ హౌస్‌లో వింత ప్రవర్తన.. పేరు చెప్పలేక అలా అనడంతో!

ముక్కు అవినాష్... తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు ఏమాత్రం పరిచయం చేయనవసరం లేని పేరిది. దాదాపు ఐదేళ్లుగా టెలివిజన్ రంగంలో తన మార్క్ చూపిస్తూ దూసుకుపోతున్నాడీ కమెడియన్. జబర్ధస్త్ ద్వారా వెలుగులోకి వచ్చిన అతడు.. విపరీతమైన ఫాలోయింగ్‌ను సంపాదించుకున్నాడు. ఇక, ఈ మధ్య బిగ్ బాస్ షోలోకి వెళ్లడంతో మరింత పాపులర్ అయ్యాడు. ఇటీవలే షో నుంచి ఎలిమినేట్ అయిన అవినాష్.. మరోసారి రీఎంట్రీ ఇచ్చాడు. హౌస్‌లోకి వెళ్లిన సమయంలో మరోసారి పెద్ద తప్పు చేశాడు. దీంతో అతడిపై విమర్శల వర్షం కురుస్తోంది. ఆ వివరాలేంటో చూడండి!

మిమిక్రీ ఆర్టిస్టు నుంచి... టీమ్ లీడర్

మిమిక్రీ ఆర్టిస్టు నుంచి... టీమ్ లీడర్

మిమిక్రీ ఆర్టిస్టుగా కెరీర్‌ను ఆరంభించాడు ముక్కు అవినాష్. ఆ సమయంలోనే ఎన్నో ఈవెంట్లలో ప్రదర్శన ఇచ్చాడు. అప్పుడే జబర్ధస్త్ కమెడియన్ల దృష్టి పడి ఆ షోలో అవకాశం దక్కించుకున్నాడు. అలా కామెడీ షోలోకి ఎంట్రీ ఇచ్చిన అతడు.. అద్భుతమైన టాలెంట్‌తో మంచి పేరుతో పాటు భారీ స్థాయిలో ఫాలోయింగ్‌ను సంపాదించుకున్నాడు. ఫలితంగా ఓ టీమ్‌కు లీడర్ అయిపోయాడు.

బిగ్ బాస్ షోతో పెరిగిన ఫాలోయింగ్

బిగ్ బాస్ షోతో పెరిగిన ఫాలోయింగ్

జోకర్ గెటప్ వేసుకుని బిగ్ బాస్ షోలోకి ఎంట్రీ ఇచ్చాడు అవినాష్. అప్పటి నుంచి తనదైన మార్క్ కామెడీని పంచుతూ హౌస్‌మేట్లలో నవ్వులు పూయించాడు. అంతేకాదు, అద్భుతమైన టైమింగ్‌తో అందరిపై పంచులు వేస్తూ ఆకట్టుకున్నాడు. ఈ నేపథ్యంలోనే హోస్ట్ నాగార్జున, స్పెషల్ హోస్ట్ సమంత నుంచి ప్రశంసలు అందుకున్నాడు. మొత్తంగా బెస్ట్ ఎంటర్‌టైనర్‌గా పేరు తెచ్చుకున్నాడు.

 ఊహించని విధంగా బయటకొచ్చాడు

ఊహించని విధంగా బయటకొచ్చాడు

వైల్డ్ కార్డ్ ద్వారా బిగ్ బాస్ షోలోకి ఎంట్రీ ఇచ్చిన అవినాష్.. చాలా వారాల పాటు నామినేషన్స్‌లోకి కూడా వెళ్లలేదు. కానీ, చివరి దశలో మాత్రం పలుమార్లు ఎలిమినేషన్ జోన్‌లోకి చేరాడు. దీంతో సహనం కోల్పోతూ అందరితో గొడవలకు దిగేవాడు. ఇదే కారణంతో 13వ వారం చివర్లో అవినాష్ షో నుంచి ఎలిమినేట్ అయ్యాడు. వాస్తవానికి అప్పుడు మోనాల్ వెళ్తుందని అంతా అనుకున్నారు.

 బిగ్ బాస్‌ షోలోకి కమెడియన్ రీఎంట్రీ

బిగ్ బాస్‌ షోలోకి కమెడియన్ రీఎంట్రీ

ఫినాలేకు సమయం దగ్గర పడడంతో ఈ సీజన్‌లో ఇప్పటికే ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్లతో రీయూనియన్ పార్టీ నిర్వహించాడు బిగ్ బాస్. కరోనా వైరస్ ప్రభావం ఎక్కువగా ఉన్న కారణంగా మాజీ కంటెస్టెంట్లను అద్దాల గదిలోకి తీసుకొచ్చేలా డిజైన్ చేశారు. దీంతో దేవీ నాగవల్లి, సూర్య కిరణ్, అమ్మ రాజశేఖర్‌లు మినహా అంతా హాజరయ్యారు. శనివారం అవినాష్ హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు.

అతడికి ఎలివేషన్ ఇచ్చిన బిగ్ బాస్

అతడికి ఎలివేషన్ ఇచ్చిన బిగ్ బాస్

అనవసరంగా ఎలిమినేట్ చేశామనుకున్నాడో ఏమో రీయూనియన్ పార్టీ కోసం హౌస్‌లోకి ప్రవేశించిన అవినాష్‌కు ఊహించని రీతిలో ఎలివేషన్ ఇచ్చాడు బిగ్ బాస్. షోలో కొనసాగిన సమయంలో అతడు మాట్లాడిన మాటలన్నింటితో ప్రత్యేకమైన ఆడియో క్రియేట్ చేశారు. ఎప్పటి లాగే ఈ సారి కూడా కమెడీతో ఆకట్టుకున్నాడతను. దీంతో చాలా రోజుల తర్వాత షోలో నవ్వులు కనిపించాయి.

మళ్లీ అదే తప్పు చేసిన కమెడియన్

మళ్లీ అదే తప్పు చేసిన కమెడియన్


బిగ్ బాస్ షోలో ఉన్నప్పుడు జబర్ధస్త్ గురించి పదే పదే షాకింగ్ కామెంట్స్ చేసేవాడు అవినాష్. తనను ఆ షో నుంచి తీసేశారని చెబుతుండేవాడు. ఇప్పుడు హౌస్‌లోకి ప్రవేశించిన సమయంలో కంటెస్టెంట్లతో మాట్లాడుతూ.. ‘అప్పట్లో నన్ను సో అండ్ సో అవినాష్ అనేవారు. ఇప్పుడు ఎంటర్‌టైనర్ అంటున్నారు' అని జబర్ధస్త్ పేరును దాట వేశాడు. దీంతో అతడిపై విమర్శలు వస్తున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X