సీరియల్ నటిపై అవినాష్ నాటీ కామెంట్స్: ఎప్పుడు చూసినా అదే ఫీలింగ్.. ఆ హీరోపై మరీ దారుణంగా!
ముక్కు అవినాష్.. తనదైన శైలి కామెడీతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తూ చాలా కాలంగా బుల్లితెరపై హవాను చూపిస్తోన్న కమెడియన్. జబర్ధస్త్ షో ద్వారా వెలుగులోకి వచ్చిన అతడు.. చాలా తక్కువ సమయంలోనే ఎవరూ ఊహించని స్థాయికి ఎదిగిపోయాడు. అదే సమయంలో వరుస ఆఫర్లను అందుకుంటూ దూసుకెళ్తున్నాడు. బిగ్ బాస్ తర్వాత మరింత క్రేజ్‌ను అందుకున్న ఈ కమెడియన్.. స్పెషల్ అట్రాక్షన్ అయ్యేలా సందడి చేస్తున్నాడు. ఈ క్రమంలోనే తాజాగా ముక్కు అవినాష్ ఓ షోలో సీరియల్ నటి, హీరోపై షాకింగ్ కామెంట్స్ చేశాడు. ఆ సంగతులు మీకోసం!
Recommended Video

అలా మొదలైన ప్రయాణం.. సక్సెస్
ముక్కు అవినాష్ మిమిక్రీ ఆర్టిస్టుగా తన ప్రయాణాన్ని మొదలు పెట్టాడు. అలా స్టేజ్ షోలు, ఈవెంట్లు చేస్తోన్న టైమ్‌లో జబర్ధస్త్ కమెడియన్ల దృష్టిలో పడ్డాడు. అలా ఆ షోలోకి వచ్చాడు. ఏమాత్రం అంచనాలు లేకుండానే ఎంట్రీ ఇచ్చిన అవినాష్.. చాలా తక్కువ సమయంలోనే మంచి గుర్తింపును పొందాడు. దీంతో టీమ్ లీడర్‌గా ప్రమోషన్‌ను కూడా అందుకుని స్టార్‌గా ఎదిగిపోయాడు.

జబర్ధస్త్‌కు టాటా.. బిగ్ బాస్‌లో వేట
జబర్ధస్త్‌లో సత్తా చాటుతోన్న సమయంలోనే.. ముక్కు అవినాష్‌కు ఎన్నో సినిమా ఆఫర్లు వచ్చాయి. అలా ఓ వైపు వాటిని చేసుకుంటూనే.. షోలో కొనసాగుతూ వచ్చాడు. ఇలాంటి పరిస్థితుల్లో గత ఏడాది జబర్ధస్త్‌కు గుడ్‌బై చెప్పేశాడు. దీనికి కారణం బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్‌లోకి ఎంట్రీ ఇవ్వడమే. జోకర్‌గా హౌస్‌లోకి ప్రవేశించిన అతడు.. ఆరంభంలోనే అందరి దృష్టినీ ఆకర్షించాడు.

గెలవకపోయినా... పేరు తెచ్చుకుని
బిగ్ బాస్ షోలోకి వెళ్లిన సమయంలోనే ముక్కు అవినాష్‌ను టైటిల్ ఫేవరెట్‌గా భావించారంతా. అందుకు అనుగుణంగానే అతడు చాలా వారాల పాటు నామినేషన్స్‌లోకి కూడా రాలేదు. అయితే, కొన్ని రోజుల తర్వాత గొడవల్లో భాగం అవుతూ.. ప్రేక్షకుల నుంచి విమర్శలు ఎదుర్కొవడంతో పాటు ఎలిమినేట్ అయ్యాడు. షోలో గెలవకున్నా బెస్ట్ ఎంటర్‌టైనర్‌గా ఖ్యాతిని అందుకున్నాడు.

‘కామెడీ స్టార్స్'లో ఒక స్టార్‌గా రచ్చ
బిగ్ బాస్ షో ద్వారా అవినాష్ వరుస షోలతో దూసుకెళ్తున్నాడు. వాటిలో స్టార్ మాలో ప్రారంభమైన 'కామెడీ స్టార్స్' అనే షో ఒకటి. ప్రతి ఆదివారం ప్రసారం అయ్యే ఈ షోకు అప్పటి హీరోయిన్ శ్రీదేవి, శేఖర్ మాస్టర్ జడ్జ్‌లుగా వ్యవహరిస్తున్నారు. వర్షిణి యాంకరింగ్ చేస్తోంది. చమ్మక్ చంద్ర తదితరులు కూడా ఎంటర్‌టైన్ చేస్తున్నారు. అవినాష్ ఇందులో బెస్ట్ కమెడియన్‌గా దూసుకెళ్తున్నాడు.

‘అప్సరా పానీ'గా మారిన అవినాష్
వచ్చే ఆదివారం సాయంత్రం 'స్టార్ మా పరివార్ ఛాంపియన్‌షిప్' స్పెషల్ ఈవెంట్ జరగబోతుంది. దీనికి ముక్కు అవినాష్ స్పెషల్ అట్రాక్షన్ అయ్యాడు. దీనికి కారణం ఇందులో అతడు పలు గెటప్‌లతో దర్శనమివ్వడమే. మరీ ముఖ్యంగా లేడీ గెటప్‌తో 'అప్సరా పానీ' అతడు కనిపించిన తీరు ఆకట్టుకుంది. అలాగే, 'ఫస్కర్' అవార్డులు కూడా ఇస్తున్నట్లు తెగ సందడి చేశాడీ కమెడియన్.

సీరియల్ నటిపై నాటీగా కామెంట్స్
ఈ ఈవెంట్‌లో భాగంగా లేడీ గెటప్‌లో ఉన్న అవినాష్.. 'జానకి కలగనలేదు' హీరో అమర్‌దీప్ చౌదరిని స్టేజ్ పైకి పిలిచాడు. దీంతో అతడు రావడానికి రెడీ అవగా.. 'అమర్ ఎవరు పిలిచినా వచ్చేస్తాడు' అంటూ పరువు తీసేశాడు. ఆ తర్వాత 'కార్తీక దీపం' నటి ఉమాదేవిని చూస్తూ 'మిమ్మల్ని నేను టీవీలో ఎప్పుడ చూసినా' అంటూ నాటీ కామెంట్లు చేసి హాట్ టాపిక్ అయిపోయాడు.


Click it and Unblock the Notifications











