వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఒక్కరు కాదు ముగ్గురు: బిగ్ బాస్‌లోకి మరో హీరోయిన్ కూడా.!

By Manoj

బిగ్ బాస్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన సీజన్ 4 గత ఆదివారం అంగరంగ వైభవంగా ప్రారంభం అయింది. అయితే, మునుపటి సీజన్లలా కాకుండా దీనికి ముందు ఏమాత్రం వివాదాలు కానీ, గొడవలు కానీ కనిపించలేదు. దీంతో ఈ సీజన్ సూపర్ సక్సెస్ అవుతుందని అంతా అనుకున్నారు. తీరా పదహారు మంది కంటెస్టెంట్లు హౌస్‌లోకి వెళ్లిన తర్వాత బిగ్ బాస్ పరిస్థితి దారుణంగా మారింది. ఈ సారి స్టార్‌డమ్ లేని వాళ్లనే తీసుకున్నారన్న కామెంట్లు వినిపించాయి. ఈ నేపథ్యంలో హౌస్‌లోకి ఏకంగా ముగ్గురు ప్రముఖులు వైల్డ్ కార్డ్ ద్వారా ఎంటర్ అవబోతున్నారని ఓ న్యూస్ లీకైంది. ఇంతకీ ఎవరా ముగ్గురు.? వివరాల్లోకి వెళితే....

ఒకేసారి పదహారు మంది.. ఆమె తప్ప

ఒకేసారి పదహారు మంది.. ఆమె తప్ప

గత ఆదివారం బిగ్ బాస్ సీజన్ 4 గ్రాండ్‌గా ప్రారంభమైంది. దీనికి కూడా అక్కినేని నాగార్జున హోస్టింగ్ చేస్తున్నారు. ప్రారంభ ఎపిసోడ్‌లో బిగ్ బాస్ హౌస్‌లోకి పదహారు మంది కంటెస్టెంట్లు ఎంట్రీ ఇచ్చారు. వీరిలో ఒకరిద్దరు తప్ప మిగిలిన వారంతా పెద్దగా పరిచయం లేని వారే. అయితే, మై విలేజ్ షో ద్వారా పాపులర్ అయిన గంగవ్వకు మాత్రం మంచి ఫాలోయింగ్ ఉందనే చెప్పాలి.

మాస్క్ ముఖానికే.. దానికి కాదన్నారు

మాస్క్ ముఖానికే.. దానికి కాదన్నారు

నాలుగో సీజన్‌కు సంబంధించిన టీజర్లు ఆ మధ్య వరుసగా విడుదల అయ్యాయి. అన్నింటిలోనూ ఈ సారి సరికొత్తగా ప్లాన్ చేస్తున్నామని, ఎంటర్‌టైన్‌మెంట్ ఊహించని విధంగా ఉండబోతుందని షో నిర్వహకులు వెల్లడించారు. అలాగే, ప్రీమియర్ ఎపిసోడ్‌లో నాగార్జున కూడా మాస్క్ ముఖానికి మాత్రమేనని, ఎంటర్‌టైన్‌మెంట్‌కు మాత్రం కాదని చెప్పడంతో దీనిపై అంచనాలు ఏర్పడ్డాయి.

అప్పుడే వారమైంది.. ఘోరంగా మారింది

అప్పుడే వారమైంది.. ఘోరంగా మారింది

బిగ్ బాస్ నాలుగో సీజన్ ప్రారంభమై వారం రోజులు కావొస్తుంది. అప్పుడే మొదటి ఎలిమినేషన్‌కు సమయం దగ్గరపడింది. అయినప్పటికీ... ఈ షో అంతగా ఆకట్టుకున్నట్లు కనిపించడం లేదు. వాస్తవానికి సీజన్ ప్రారంభానికి ముందు చెప్పిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం ప్రేక్షకులు ఎదురు చూస్తూనే ఉన్నారు. కానీ, ప్రారంభ ఎపిసోడ్ మినహా మిగిలినదంతా చాలా చప్పగా సాగింది.

అలా హైప్ క్రియేట్ చేసినా నో యూజ్

అలా హైప్ క్రియేట్ చేసినా నో యూజ్

ఇక, ఈ సీజన్ ప్రారంభం అయిన తర్వాత ‘ఇంటిలో మీ పక్కనే ఉంటూ.. మీకు వెన్నుపోటు పొడవాలనుకునే ఓ కట్టప్ప ఉన్నాడు' అని బిగ్ బాస్ సరికొత్త నాటకానికి తెరలేపాడు. ఈ విధంగానైనా షోపై హైప్ క్రియేట్ చేయాలని భావించారు. కానీ, ఇది సక్సెస్ అయినట్లు కనిపించడం లేదు. బయటి వారికేమో కానీ, ఇంటి లోపల ఉన్న కొందరు కట్టప్ప అనేది అబద్ధమని తేల్చేశారు.

వైల్డ్ కార్డ్ ఎంట్రీతో మొత్తం మారాలని

వైల్డ్ కార్డ్ ఎంట్రీతో మొత్తం మారాలని

సినిమా థియేటర్లు ఇంకా తెరవనే లేదు... ఐపీఎల్ సీజన్ ఇంకా మొదలవనే లేదు... కానీ బిగ్ బాస్ షో పట్ల ప్రజల్లో ఆసక్తి ఏమాత్రం కనిపించనట్లు ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ప్రేక్షకులను తమ వైపునకు తిప్పుకునేందుకు స్టార్ మా సరికొత్త ఎత్తుగడలు సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే త్వరలోనే వైల్డ్ కార్డ్ ఎంట్రీని ప్రవేశ పెట్టాలని ప్లాన్ చేసినట్లు ప్రచారం జరుగుతోంది.

వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఒక్కరు కాదు ముగ్గురు

వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఒక్కరు కాదు ముగ్గురు

వచ్చే వారం.. లేదా ఆపై వారంలో ఓ కంటెస్టెంట్ వైల్డ్ కార్డ్ ద్వారా హౌస్‌లోకి ప్రవేశించబోతున్నాడని కొద్ది రోజులుగా వార్తలు వస్తున్నాయి. అలా బిగ్ బాస్ ఇంట్లోకి వచ్చేది జబర్ధస్త్ ద్వారా బాగా పాపులర్ అయిన ముక్కు అవినాష్ అని అంటున్నారు. అంతేకాదు, అతడు ఇప్పటికే క్వారంటైన్‌లో ఉన్నాడని చెబుతున్నారు. ఇదిలాఉండగా, మరో ఇద్దరు కూడా హౌస్‌లోకి రాబోతున్నారట.

Recommended Video

Bigg Boss Telugu 4 Episode 5 Highlights దివి, అమ్మా రాజశేఖర్ రొమాంటిక్‌గా
బిగ్ బాస్‌లోకి మరో హీరోయిన్ కూడా.!

బిగ్ బాస్‌లోకి మరో హీరోయిన్ కూడా.!

ఇప్పటికే పదహారు మంది కంటెస్టెంట్లు బిగ్ బాస్ హౌస్‌లో ఉన్నారు. వారిలో ఒకరు ఈ వారం ఎలిమినేట్ కాబోతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ముక్కు అవినాష్‌తో పాటు కమెడియన్ సాయి కుమార్ (ఈరోజుల్లో ఫేం), హీరోయిన్ స్వాతి దీక్షిత్ (అల్లరి నరేష్ జంప్ జిలానీ) కూడా రాబోయే రోజుల్లో బిగ్ బాస్ హౌస్‌లోకి ఎంటర్ అవుతారని తాజాగా ఓ న్యూస్ బయటకు వచ్చింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X