ఇద్దరు స్టార్ హీరోలతో ముక్కు అవినాష్: భారీ సినిమాలో ఛాన్స్ పట్టేసిన బిగ్ బాస్ ఎంటర్‌టైనర్

తెలుగు బుల్లితెరపై జబర్ధస్త్ షోకు ఉన్న ప్రత్యేకతే వేరు. దాదాపు ఎనిమిదేళ్లుగా ఈ షో టెలివిజన్ రంగంలో ప్రభావాన్ని చూపిస్తోంది. అంతేకాదు, ఎంతో మంది ఆర్టిస్టులను ఇండస్ట్రీకి పరిచయం చేసింది. అలా.. ఈ షో ద్వారా పాపులారిటీని సొంతం చేసుకున్న వారిలో ముక్కు అవినాష్ ఒకడు. ఎప్పటి నుంచో జబర్ధస్త్‌ షోలో పని చేసిన అతడు.. ఈ మధ్య బిగ్ బాస్ రియాలిటీ షోలోకి ఎంట్రీ ఇచ్చాడు. దీని వల్ల క్రేజ్‌ను రెట్టింపు చేసుకున్నాడు. దీంతో అవినాష్‌కు ఆఫర్లు వెల్లువెత్తున్నాయి. ఇలాంటి సమయంలో ఓ భారీ సినిమాలో అతడు అవకాశం పట్టేశాడట. ఆ వివరాలు మీకోసం!

చిన్న ఆర్టిస్టు నుంచి ఒక టీమ్ లీడర్‌

చిన్న ఆర్టిస్టు నుంచి ఒక టీమ్ లీడర్‌

ఎన్నో షోలు, ఈవెంట్లలో మిమిక్రీ ఆర్టిస్టుగా కనిపించాడు ముక్కు అవినాష్. ఆ సమయంలోనే జబర్ధస్త్‌ కామెడీ షోలో పాల్గొనే అవకాశం అందుకున్నాడు. అలా.. ఆ షోలోకి ప్రవేశించిన అతడు.. మొదట్లో చిన్న చిన్న పాత్రలను చేసేశాడు. ముక్కు స్కిట్‌‌తో పాపులరిటీ సంపాదించుకున్నాడు. ఇలా అన్ని రకాలుగా రాణిస్తుండడంతో అవినాష్‌కు టీమ్ లీడర్‌గా ప్రమోషన్ ఇచ్చారు.

జోకర్‌గా ఎంట్రీ.. ఎంటర్‌టైనర్‌గా పేరు

జోకర్‌గా ఎంట్రీ.. ఎంటర్‌టైనర్‌గా పేరు

జబర్ధస్త్ ద్వారా వచ్చిన పేరుతో బిగ్ బాస్ రియాలిటీ షోలో నాలుగో సీజన్‌కు ఎంపికయ్యాడు ముక్కు అవినాష్. జోకర్ గెటప్‌తో ఎంట్రీ ఇచ్చిన అతడు.. దాన్ని నిలబెట్టుకునేలా సందడి చేశాడు. లోపలికి ప్రవేశించినప్పటి నుంచి తనదైన శైలి కామెడీని పంచుతూ హౌస్‌లోని కంటెస్టెంట్లతో పాటు ప్రేక్షకులను నవ్విస్తూ బిగ్ బాస్ చరిత్రలోనే బెస్ట్ ఎంటర్‌టైనర్ అనిపించుకున్నాడు.

అవన్నీ కలిసొచ్చినా తప్పని నిరాశ

అవన్నీ కలిసొచ్చినా తప్పని నిరాశ

ఎప్పుడూ నవ్వుతూ నవ్విస్తూ బెస్ట్ ఎంటర్‌టైనర్ అనిపించుకున్న అవినాష్.. ఆరియానా గ్లోరీతో లవ్ ట్రాకుతో మరింత పాపులర్ అయ్యాడు. దీనికితోడు టాస్కుల్లో మంచిగా ఆడుతూ ఆకట్టుకున్నాడు. ఇవన్నీ చేసినా నామినేషన్స్ సమయంలో మాత్రం సహనం కోల్పోతూ ఉండేవాడు. ఈ క్రమంలోనే 13వ వారంలో ఊహించని విధంగా బిగ్ బాస్ షో నుంచి బయటకు వచ్చేశాడు.

Recommended Video

Bigg Boss Telugu 4 : Rahul Sipligunj Controversial Post On Bigg Boss Contestants
 బిగ్ బాస్ వల్ల లాభపడ్డ కమెడియన్

బిగ్ బాస్ వల్ల లాభపడ్డ కమెడియన్

బిగ్ బాస్ షో నుంచి బయటకు వచ్చిన తర్వాత ముక్కు అవినాష్ వరుస ఇంటర్వ్యూలతో బిజీగా గడుపుతున్నాడు. ఈ క్రమంలోనే ఎన్నో ఆసక్తికర విషయాలు బయటపెడుతున్నాడు. ఇందులో భాగంగానే జబర్ధస్త్‌ను వీడినందుకు గానూ నిర్వహకులకు రూ. 10 లక్షలు కట్టానని చెప్పాడు. అంతేకాదు, బిగ్ బాస్ షోలోకి రావడం వల్ల తన అప్పులన్నీ తిరిపోయినట్లు వెల్లడించాడు.

డైరెక్టర్ ప్రామిస్‌ లీక్ చేసిన అవినాష్

డైరెక్టర్ ప్రామిస్‌ లీక్ చేసిన అవినాష్

బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత అవినాష్‌కు ఆఫర్ల మీద ఆఫర్లు వస్తున్నాయని ప్రచారం జరుగుతోంది. అందుకు అనుగుణంగానే అతడు తాజా ఇంటర్వ్యూలో సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి తనను ఓ సారి కలవమని చెప్పారని వెల్లడించాడు. అంతేకాదు, తనకు ఓ సినిమాలో అవకాశం కల్పిస్తానని కూడా ప్రామిస్ చేసినట్లు కమెడియన్ అవినాష్ చెప్పుకొచ్చాడు.

 మల్టీస్టారర్‌లో నటించనున్న అవినాష్‌

మల్టీస్టారర్‌లో నటించనున్న అవినాష్‌

అనిల్ రావిపూడి డైరెక్షన్‌లో వెంకటేష్, వరుణ్ తేజ్ కలిసి నటిస్తోన్న చిత్రం ‘F3'. గత ఏడాది భారీ హిట్ అయిన ‘F2'కి సీక్వెల్‌గా రూపొందుతోన్న ఈ చిత్రంలో అవినాష్ కీలక పాత్రను పోషించబోతున్నాడని ఓ న్యూస్ ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతోంది. బిగ్ బాస్ అంటే పడిచచ్చిపోయే అనిల్.. అవినాష్ కోసం ఓ కామెడీ రోల్ క్రియేట్ చేశాడనే టాక్ వినిపిస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X