ముక్కు అవినాష్ రెమ్యునరేషన్ వివరాలు లీక్: జబర్ధస్త్‌లో ఎంతంటే!

By Manoj

జబర్ధస్త్... టాలెంట్ ఉండి అవకాశాలు దొరక్క ఇబ్బందులు ఎదుర్కొంటోన్న ఎంతో మందికి అవకాశం ఇచ్చిన షో. దాదాపు ఏడేళ్లుగా ఈ షో విజయవంతంగా ప్రదర్శితమవడంతో పాటు ఎంతో మంది టాలెంట్ ఉన్న ఆర్టిస్టులు, టెక్నీషియన్లను ఇండస్ట్రీకి అందించింది. ఇలా జబర్ధస్త్ షో ద్వారా వెలుగులోకి వచ్చి భారీ స్థాయిలో పాపులర్ అయిన వారిలో ముక్కు అవినాష్ ఒకడు. ఆ షో వల్ల దక్కిన క్రేజ్‌తో ఈ మధ్యనే బిగ్ బాస్ హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఈ నేపథ్యంలో అవినాష్ రెమ్యూనరేషన్ వివరాలు లీక్ అయ్యాయి. ఇంతకీ అతడు జబర్ధస్త్‌లో ఎంత తీసుకున్నాడు.? బిగ్ బాస్‌లో ఎంతకు డీల్ చేసుకున్నాడు.? ఆ వివరాలు మీకోసం.!

అవినాష్.. అసలు కమెడియన్ కాదు

అవినాష్.. అసలు కమెడియన్ కాదు

జబర్ధస్త్ షో ద్వారా ఫేమస్ అయిన ముక్కు అవినాష్ కెరీర్ ఆరంభంలో మిమిక్రీ ఆర్టిస్టుగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈ క్రమంలోనే ఎన్నో ఈవెంట్లలో ప్రదర్శనలు ఇచ్చాడు. ఆ సమయంలోనే జబర్ధస్త్ కమెడియన్ల దృష్టిలో పడ్డాడు. దీంతో వాళ్ల సహాయంతో ఈ యంగ్ టాలెంటెడ్ ఆర్టిస్టు కామెడీ షోలోకి ఎంట్రీ ఇచ్చాడు. అప్పటి నుంచి రాణిస్తూ కమెడియన్‌గా గుర్తింపు తెచ్చుకున్నాడు.

ఆ ముగ్గురి కారణంగానే పాపులారిటీ

ఆ ముగ్గురి కారణంగానే పాపులారిటీ

అవినాష్‌కు తమ స్కిట్లలో అవకాశం కల్పించింది సుడిగాలి సుధీర్, ఆటో రాంప్రసాద్, గెటప్ శ్రీనులే అని అప్పట్లో ప్రచారం జరిగింది. వీళ్లకు తోడు జబర్ధస్త్ జడ్జ్‌లు నాగబాబు, రోజా కూడా అతడి టాలెంట్‌ను గుర్తించి ప్రోత్సహించారట. ఈ క్రమంలోనే ఆ షోని దాదాపు అన్ని టీమ్‌లలో పని చేశాడు. ఫలితంగా చాలా స్కిట్లలో పలు రకాల గెటప్‌లు వేసి పేరు తెచ్చుకున్నాడు.

లీడర్‌గా ప్రమోషన్‌.. పేరు అలా ఫిక్స్

లీడర్‌గా ప్రమోషన్‌.. పేరు అలా ఫిక్స్

అద్భుతమైన టాలెంట్‌తో పాపులర్ అయిన అవినాష్‌కు జబర్ధస్త్‌ యూనిట్ టీమ్ లీడర్‌గా ప్రమోషన్ ఇచ్చింది. అంతేకాదు, అతడి టీమ్‌కు మాస్ అవినాష్ అన్న పేరు కూడా పెట్టింది. కానీ, అతడు మాత్రం ముక్కు అవినాష్‌గానే ఫేమస్ అయ్యాడు. దీనికి కారణం జబర్ధస్త్‌లోని చాలా మంది టీమ్ లీడర్లు అతడి పెద్ద ముక్కుపై ప్రత్యేకమైన పంచ్ డైలాగులు రాసి సెటైర్లు వేయడమే.

జబర్ధస్త్‌లో థర్డ్ గ్రేడ్ రెమ్యూనరేషన్

జబర్ధస్త్‌లో థర్డ్ గ్రేడ్ రెమ్యూనరేషన్

జబర్ధస్త్ షోలో పని చేసే వారికి నెల జీతం కింద రెమ్యూనరేషన్ చెల్లిస్తారన్న విషయం తెలిసిందే. అందులో యాంకర్లు, టాప్ టీమ్ లీడర్లకు ఫస్ట్ గ్రేడ్.. తర్వాతి వాళ్లకు సెకెండ్, మరొకరితో కలిసి టీమ్‌ లీడర్‌గా వ్యవహరించే వారికి థర్డ్ గ్రేడ్‌లో చెల్లిస్తుంటారు. కెవ్వు కార్తీక్‌తో కలిసి పని చేస్తున్న ముక్కు అవినాష్‌కు.. అందులో మూడో గ్రేడ్ టీమ్ లీడర్ కింద రూ. 10 లక్షలు ఇస్తారని సమాచారం.

Recommended Video

Bigg Boss Telugu 4: Karate Kalyani లోని మరో యాంగిల్ , వ్యాంప్ క్యారెక్టర్లకు వాడుకోవడం తప్పే !
బిగ్గెస్ట్ రియాలిటీ షోలోకి జోకర్‌గా

బిగ్గెస్ట్ రియాలిటీ షోలోకి జోకర్‌గా

జబర్ధస్త్ షోతో పాటు పలు ఈవెంట్లతో ఫుల్ బిజీగా ఉన్న అవినాష్... ఇటీవల బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్‌లోకి వైల్డ్ కార్డ్ ద్వారా ఎంటర్ అయ్యాడు. అలా ప్రవేశించాడో లేదో హౌస్‌లో తన మార్క్ చూపించేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాడు. ఇందులో భాగంగానే అందరినీ నవ్విస్తూ, కవ్విస్తూ తిరుగుతున్నాడు. దీంతో హోస్ట్ నాగార్జున కూడా అతడిని మెచ్చుకున్నాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X