For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  నాగబాబుకు ఫేమస్ కమెడియన్ వార్నింగ్: ఏమనుకుంటున్నావ్.. ఇది కరెక్ట్ కాదు అంటూ!

  |

  మెగాస్టార్ చిరంజీవి సోదరుడిగా ప్రపంచానికీ, సినిమా రంగానికి పరిచయమైనా.. తనదైన శైలి యాక్టింగ్‌, వ్యవహార శైలితో తక్కువ సమయంలోనే తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకున్నారు మెగా బ్రదర్ నాగబాబు. సుదీర్ఘ కాలంగా సినిమాల్లో ఉన్న ఆయన హీరోగా, సహాయ నటుడిగా, నిర్మాతగా సేవలు అందించారు. ఈ క్రమంలోనే చాలా ఏళ్ల క్రితమే బుల్లితెరపైకి సైతం ఎంట్రీ ఇచ్చారు. అక్కడ కొన్ని సీరియళ్లలో నటించడంతో పాటు ప్రత్యేకమైన కార్యక్రమాలను కూడా చేశారు. ఇప్పుడు మళ్లీ యాక్టివ్ అయిన నాగబాబు.. తాజాగా ఓ స్పెషల్ ఈవెంట్‌లో భాగం అయ్యారు. ఈ నేపథ్యంలో ఓ ప్రముఖ కమెడియన్ ఆయనకు వార్నింగ్ ఇవ్వడం షాకిస్తోంది. అసలేం జరిగిందో మీరే చూడండి!

  బుల్లితెరపైకి ఎంట్రీ.. ఫుల్ బిజీగా

  బుల్లితెరపైకి ఎంట్రీ.. ఫుల్ బిజీగా

  సుదీర్ఘ కాలం పాటు సినీ రంగంలో సత్తా చాటిన మెగా బ్రదర్ నాగబాబు.. 'అపరంజీ' అనే సీరియల్ ద్వారా బుల్లితెరపైకి కూడా హీరోగా ఎంట్రీ ఇచ్చారు. దాని తర్వాత 'శిఖరం', 'సీతామహాలక్ష్మీ' సహా కొన్ని సీరియళ్లలో నటించారు. ఈ క్రమంలోనే 'వీర' అనే షో ద్వారా జడ్జ్‌గా మారి 'అదుర్స్' రెండు సీజన్లను పూర్తి చేశారు. దీని తర్వాత 'జబర్ధస్త్' షోలో చేరారు.

  తెలుగు పిల్ల అనన్య నాగళ్ల పరువాల విందు: వామ్మో ఆమెనిలా చూశారంటే!

  దానికి బ్రేక్.. ఎన్నో ప్రయత్నాలు

  దానికి బ్రేక్.. ఎన్నో ప్రయత్నాలు

  దాదాపు ఏడేళ్ల పాటు నాగబాబు జబర్ధస్త్ షోకు జడ్జ్‌గా వ్యవహరించిన విషయం తెలిసిందే అప్పటి నుంచి దీన్ని నెంబర్ వన్ స్థానంలో నడిపించారు. ఇలాంటి సమయంలో దానికి అర్థాంతరంగా గుడ్‌బై చెప్పేశారు. అదే సమయంలో మరో ఛానెల్‌లో 'అదిరింది', 'బొమ్మ అదిరింది' అనే షోలు చేసి వాటినీ ఉన్నట్లుండి ఆపేశారు. తర్వాత కొన్ని షోలను స్వయంగా మొదలెట్టారు.

  బుల్లితెరకు గ్యాప్ ఇచ్చిన బ్రదర్

  బుల్లితెరకు గ్యాప్ ఇచ్చిన బ్రదర్


  చాలా కాలంగా తీరిక లేకుండా బుల్లితెరపై వరుసగా షోలు చేస్తూ వచ్చిన మెగా బ్రదర్ నాగబాబు.. ఈ మధ్య కాలంలో తన సోదరుడు పవర్ స్టార్ పవన్ కల్యాణ్ స్థాపించిన జనసేన పార్టీ కోసం ఆయన పని చేస్తున్నారు. అయితే, మధ్యలో కొన్ని సినిమాలలో కూడా భాగం అయ్యారు. ఈ కారణాల వల్ల నాగబాబు బుల్లితెరపై కార్యక్రమాలు చేయకుండా గ్యాప్ తీసుకున్న విషయం తెలిసిందే.

  మళ్లీ రెచ్చిపోయిన తెలుగు యాంకర్: చీరలోనూ హాట్‌గా.. ఈ వీడియో చూశారంటే!

  స్టార్ మాలోకి.. ఆ షోతో స్పెషల్‌గా

  స్టార్ మాలోకి.. ఆ షోతో స్పెషల్‌గా

  తన సుదీర్ఘ ప్రయాణంలో పలు టీవీ ఛానెళ్లలో పని చేసిన మెగా బ్రదర్ నాగబాబు.. కొన్ని నెలల క్రితమే స్టార్ మాలోకి ఎంట్రీ ఇచ్చారు. ఇందులో 'కామెడీ స్టార్స్ ధమాకా' అనే కార్యక్రమానికి జడ్జ్‌గా వ్యవహరించారు. అయితే, ఇది కూడా కొన్ని రోజులుగా ప్రసారం కావడం లేదు. దీంతో నాగబాబు ఎందులోనూ పర్మినెంట్‌గా కనిపించడం లేదు. దీనిపై మెగా ఫ్యాన్స్ నిరాశగా ఉన్నారు.

  పార్టీ చేద్దాం పుష్ప అంటూ రచ్చ

  పార్టీ చేద్దాం పుష్ప అంటూ రచ్చ

  స్టార్ మాలో గత ఆదివారం 'పార్టీ చేద్దాం పుష్ప' అనే స్పెషల్ ఈవెంట్ చేశారు. దీనికి హోస్టుగా సుడిగాలి సుధీర్ వ్యవహరించాడు. అలాగే, మెగా బ్రదర్ నాగబాబు జడ్జ్‌గా వచ్చారు. ఇందులో డ్యాన్స్‌లు, పాటలు, కామెడీ స్కీట్లు చేశారు. అనసూయ కూడా ఇందులో సందడి చేసింది. ఇక, దీనికి కొనసాగింపుగా రెండో భాగాన్ని వచ్చే ఆదివారం ప్రసారం చేయబోతున్నట్లు తెలిపారు.

  సుమ షోలో యంగ్ హీరోకు అవమానం: మొబైల్ విసిరేసిన యాంకర్.. కోపంతో వెళ్లిపోయిన స్టార్ కిడ్

  నాగబాబుకు అవినాష్ వార్నింగ్

  'పార్టీ చేద్దాం పుష్ప' ఈవెంట్‌లో భాగంగా గత వారం కిర్రాక్ ఆర్పీ తన ఛాతిపై నాగబాబు పేరును టాటూగా వేసుకున్న విషయం తెలిసిందే. ఈ ఎపిసోడ్ అంతా ఇదే హైలైట్ అయింది. ఇక, వచ్చే వారం మాత్రం మెగా బ్రదర్ నాగబాబుకు ప్రముఖ కమెడియన్ ముక్కు అవినాష్ వార్నింగ్ ఇవ్వడం సంచలనం అవుతోంది. దీంతో ఈ ప్రోమో విపరీతంగా వైరల్ అయిపోయింది.

  స్కిట్ కోసం తెగించిన అవినాష్

  స్కిట్ కోసం తెగించిన అవినాష్


  'పార్టీ చేద్దాం పుష్ప' ఈవెంట్ కోసం ముక్కు అవినాష్ ఓ స్కిట్ చేశాడు. ఇందులో తన కొడుకు కలలో నాగబాబుకు అవినాష్ వార్నింగ్ ఇచ్చినట్లు చెబుతాడు. దీన్ని రీ క్రియేట్ చేయడం కోసం అతడు మెగా బ్రదర్ దగ్గరకు వెళ్లి 'మిస్టర్ నాగబాబు.. ఏమనుకుంటున్నావ్ నువ్వు. ఆ లుక్ ఏంటి? ఇది కరెక్ట్ కాదు' అంటూ ఫన్నీగా వార్నింగ్ ఇచ్చాడు. ఆ తర్వాత ఆయన కాళ్లపై పడ్డాడు.

  English summary
  Famous Comedian and Bigg Boss Fame Mukku Avinash Gave Strong Warning To Nagababu in Star Maa PARTY CHEDAM PUSHPA Event.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X