బిగ్‌బాస్ తెలుగు 9 షోలోకి తీసుకోవాలి.. మినిమమ్ డిగ్రీ మన్మథ రాజా నిరాహరదీక్ష

భారతీయ టెలివిజన్ రంగంలో బిగ్‌బాస్ ఓ సంచలనం. సరికొత్త థీమ్‌తో వచ్చిన ఈ కార్యక్రమం.. దేశంలో రియాలిటీ షో లెక్కలనే మార్చేయడంతో పాటు ఎందరికో లైఫ్ ఇచ్చింది. హిందీలో ప్రారంభమైన ఈ మెగా షో తర్వాత దేశంలోని మిగిలిన ప్రాంతీయ భాషలకు కూడా విస్తరించి అక్కడా హిట్ కొట్టింది. మిగిలిన భాషల సంగతేమో కానీ తెలుగులో మాత్రం బిగ్‌బాస్ క్రేజ్ వేరే. భారీ టీఆర్పీలతో పాటు కాంట్రవర్సీలను కూడా తెలుగు బిగ్‌బాస్ తెచ్చిపెట్టింది.

బిగ్‌బాస్‌కు తెలుగులో భారీ క్రేజ్

యువతీ యువకులు పెళ్లి కాకుండా ఒకే రూమ్‌లో ఉండటం, అశ్లీలం వంటి అంశాలతో సాంప్రదాయవాదులు ఈ మెగా షోను వ్యతిరేకిస్తున్నప్పటికీ ప్రేక్షకుల ఆదరణతో దూసుకెళ్తోంది బిగ్‌బాస్. తెలుగులో ఇప్పటి వరకు 8 సీజన్‌లను కంప్లీట్ చేసుకున్న బిగ్‌బాస్.. ఈసారి 9వ సీజన్‌కు రెడీ అవుతోంది. లాస్ట్ సీజన్‌లో కన్నడ నటుడు నిఖిల్ మలియాక్కల్ విజేతగా నిలవగా.. గౌతమ్ రన్నరప్‌గా నిలిచాడు. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ గత సీజన్‌కు సరైన ఆదరణ దక్కలేదని బిగ్‌బాస్ నిర్వాహకులు భావిస్తున్నారు.

Multistar Manmadha Raja Hunger Strike For a Place In Bigg Boss Telugu 9

బిగ్‌బాస్ తెలుగు 9కి భారీ ఏర్పాట్లు

అలాగే తెలుగు నటులు, కంటెస్టెంట్స్ కాకుండా కన్నడిగులకు ప్రయారిటీ ఇవ్వడం, వారి కోసం తెలుగు కంటెస్టెంట్స్‌ను ఎలిమినేట్ చేసినట్లుగా రూమర్స్ రావడంతో నిర్వాహకులు ఈసారి ఆ తప్పులు చేయకూడదని భావిస్తున్నారు. ఊరుపేరు లేని సెలబ్రెటీలు కాకుండా జనంలో పేరున్న, ప్రేక్షకులకు బాగా తెలిసినవారిని కంటెస్టెంట్స్‌గా తీసుకురావాలని భావిస్తున్నారు. ఇప్పటికే కంటెస్టెంట్స్‌ను వెతికే పనిలో బిగ్‌బాస్ టీమ్ ఉన్నట్లుగా గాసిప్స్ వినిపిస్తున్నాయి. అయితే కంటెస్టెంట్స్‌గా ఎవరినీ తీసుకోవాలో జనమే ఓ లిస్ట్ ప్రిపేర్ చేస్తూ సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు.

ఈసారి హోస్ట్ నాగార్జునేనా?

ఎప్పుడు బిగ్‌బాస్ ప్రారంభమవుతున్నా హోస్ట్, కంటెస్టెంట్స్ విషయంలో గాసిప్స్ రావడం సహజం. దానికి తగినట్లుగానే ఈసారి అక్కినేని నాగార్జున హోస్ట్‌గా తప్పుకోనున్నారని, ఆయనకు బదులు నందమూరి బాలకృష్ణ, విజయ్ దేవరకొండలలో ఒకరు హోస్ట్ బాధ్యతలు స్వీకరిస్తారని వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతానికి ఇవి గాసిప్స్ మాత్రమే కాగా.. రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందో చూడాలి. మరోవైపు బిగ్‌బాస్ తెలుగు 9లో తనకు అవకాశం కల్పించాలని ఓ వ్యక్తి నిరసనకు దిగడం కలకలం సృష్టిస్తోంది.

మల్టీసార్ మన్మధరాజా రచ్చ

కొత్త సినిమాల రిలీజ్‌ల సమయంలో హైదరాబాద్ ప్రసాద్ ఐమ్యాక్స్ దగ్గర నల్ల కళ్లజోడు పెట్టుకుని కింది స్థాయి వాళ్లకి అర్ధం కాదు.. మినిమమ్ డిగ్రీ చదవాలి అంటూ రివ్యూలు చెబుతూ పాపులరయ్యాడు మల్టీ స్టార్ మన్మధరాజ. గతంలోనే బిగ్‌బాస్ షోప రివ్యూలు చెప్పిన ఇతను అప్పట్లో పల్లవ ప్రశాంత్‌ను హౌస్‌మేట్స్ తక్కువ చేసి మాట్లాడటంతో సీరియస్ అయ్యాడు. బిగ్‌బాస్ నుంచి పల్లవి ప్రశాంత్‌ని బయటికి పంపించే కుట్రలు జరుగుతున్నాయని ఆరోపించాడు. అయితే పల్లవి ప్రశాంత్‌ ఒక్కడి కోసం మిగిలిన కంటెస్టెంట్స్‌పై ఆరోపణలు చేయడం కరెక్ట్ కాదని మన్మధ రాజాపై నెటిజన్లు అప్పట్లోనే మండిపడ్డారు. తనకు కూడా గుర్తింపు కావాలనే గతంలోనే రాజా చెప్పుకొచ్చాడు.

బిగ్‌బాస్ 9లో అవకాశం కోసం నిరాహార దీక్ష

ఈ క్రమంలో ఇప్పుడు ఏకంగా తనకు బిగ్‌బాస్ 9లో అవకాశం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాడు. హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియో ఎదుట కూలి బిడ్డ నిరాహార దీక్ష అంటూ బ్యాన్ కట్టి అక్కడ నిరాహార దీక్షకు కూర్చొన్నాడు. బాలీవుడ్, కోలీవుడ్, మల్లూవుడ్, శాండల్‌వుడ్ హటావో.. టాలీవుడ్ బచావో అని బ్యానర్ మీద రాసుకొచ్చాడు. అన్నపూర్ణ స్టూడియోకు వచ్చి పోయేవాళ్లకు ఇతను ఆసక్తిగా కనిపించడంతో కొందరు వెళ్లి పలకరిస్తున్నారు కూడా. ప్రస్తుతం మన్మధ రాజా నిరాహారదీక్షకు సంబంధించిన వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X