బిగ్‌బాస్ హౌస్‌లోకి ముమైత్.. కుప్పకూలిన కల్పన.. కొత్త కెప్టెన్‌గా ప్రిన్స్..

బిగ్‌బాస్ తెలుగు వెర్షన్ కార్యక్రమంలో శుక్రవారం నాటి ఎపిసోడ్‌లో అనూహ్యమైన పరిణామాలు చోటుచేసుకొన్నాయి. బిగ్‌బాస్‌ నుంచి బయటకు వచ్చిన ముమైత్ ఖాన్ మళ్లీ ఇంటి సభ్యులతో జాయిన్ అయ్యింది. ఇక బిగ్‌బాస్ ఇచ్చి

By Rajababu

బిగ్‌బాస్ తెలుగు వెర్షన్ కార్యక్రమంలో శుక్రవారం నాటి ఎపిసోడ్‌లో అనూహ్యమైన పరిణామాలు చోటుచేసుకొన్నాయి. బిగ్‌బాస్‌ నుంచి బయటకు వచ్చిన ముమైత్ ఖాన్ మళ్లీ ఇంటి సభ్యులతో జాయిన్ అయ్యింది. ఇక బిగ్‌బాస్ ఇచ్చిన టాస్క్‌లో కల్పన ఓడిపోవడంతో ప్రిన్స్ కొత్త కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. ఇక కల్పనకు వ్యతిరేకంగా ఇంటి సభ్యులు మాట్లాడుకోవడం, ఆమెకు వ్యతిరేకంగా ఓ బలమైన గ్రూప్ ఏర్పాటైనట్టు స్పష్టమవుతున్నది. కాగా ముమైత్ బిగ్‌బాస్ హౌస్‌లోకి చేరుకోవడంతో ఇంటి సభ్యుల మధ్య ఆనందం వెల్లువెత్తింది.

కొత్త కెప్టెన్ ఎంపిక

కొత్త కెప్టెన్ ఎంపిక

బిగ్‌బాస్ కార్యక్రమంలో కల్పన ఒక వారానికి కెప్టెన్‌గా బాధ్యతలను పూర్తి చేయడంతో మళ్లీ కొత్త కెప్టెన్ ఎంపిక మొదలైంది. ఆ క్రమంలోనే ప్రిన్స్, కల్పన, శివబాలాజీలకు బిగ్‌బాస్ కొత్త టాస్క్ ఇచ్చారు. గుర్రపు బొమ్మలపై ఊగుతూ ఎక్కువ సేపు ఎవరు ఉంటారో వారి కెప్టెన్‌ అవుతారని చెప్పారు. ఆ టాస్క్‌లో కొంత సేపటి తర్వాత కల్పన కూప్పకూలింది. మధ్యలోనే శివబాలాజీ డ్రాప్ అయ్యాడు. దాంతో ప్రిన్స్‌ను కొత్త కెప్టెన్‌గా అవకాశం వచ్చింది.

Recommended Video

Bigg Boss : Jr Ntr Show Facing Problems Due To Mumaith Khan, Watch Here
కుప్పకూలిన కల్పన

కుప్పకూలిన కల్పన

గుర్రంపై బొమ్మపై ఊగుతున్న కల్పన ఒక్కసారిగా కుప్పకూలడంతో ఇంటి సభ్యులు ఆమెకు సపర్యలు చేశారు. కల్పన త్వరగానే కోలుకోవడం, ఆమె వ్యవహరించిన తీరుపై కొందరు సభ్యులు చర్చ జరిపారు. కల్పన తీరుపై కత్తి కార్తీక, మధుప్రియ మనస్తాపానికి గురయ్యారు. తాము ఆమెకు ఎంతో దగ్గరగా ఉంటే తమతో అలా వ్యవహరిస్తారా అనే చర్చించుకోవడం కనిపించింది.

ఆమెకు మోజు ఎక్కువ

ఆమెకు మోజు ఎక్కువ

కల్పనకు కెప్టెన్ పదవిపై చాలా మోజు ఉంది. లేకపోతే ఆమె అలా వ్యవహరించదు. కెప్టెన్ పదవి వచ్చిన తర్వాత ఆమె బాడీ ల్వాంగ్వేజ్ మారిపోయింది. వామ్మో ఆమెను చూస్తుంటే చాలా భయమేస్తుంది అని అర్చన, సమీర్ గుసగుసలాడుకోవడం గమనార్హం.

ఇంటిలో ముమైత్ అలజడి

ఇంటిలో ముమైత్ అలజడి

అలా కలహాలు, ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకోవడం లాంటి ఘటనలతో శుక్రవారం ఎపిసోడ్ సాగింది. అర్థరాత్రి సమయంలో ఇంటి సభ్యులు నిద్రిస్తుండగా ఒక్కసారిగా ఇంటిలో లైట్లు వెలిగాయి. ముమైత్ మాటలు వినిపించడంతో ఇంటి సభ్యుల ముఖంలో ఆనందం వెల్లువెత్తింది. చాలా సేపు తనదైన శైలిలో, మాటలతో బిగ్‌బాస్ ఇంటిలో ముమైత్ అలజడి సృష్టించింది

ఆనందంలో ఇంటి సభ్యులు

ఆనందంలో ఇంటి సభ్యులు

చివరకి ముమైత్ ఇంటిలోకి రావడంతో ఇంటి సభ్యుల ముఖాలు వెలిగిపోయాయి. ముమైత్‌ను అందరూ కౌగిలించుకొని లోనికి ఆహ్వానించారు. అందరూ కౌగిలింతలతో ముమైత్‌ను ముంచెత్తారు. ధన్‌రాజ్, ముమైత్ మధ్య అనుబంధం మరోసారి ఆకర్షణగా నిలిచింది.

మధుప్రియ ఎలిమినేషన్ గ్యారెంటీ

మధుప్రియ ఎలిమినేషన్ గ్యారెంటీ

ఇక ఈ వారం ఎలిమినేషన్‌లో సింగర్ మధుప్రియ బయటకు వెళ్లినట్టు కనిపిస్తున్నది. సింగర్ మధుప్రియ తన ప్రతిభతో ఆకట్టుకోలేకపోయింది. తన ఏడుపు ద్వారానే ఆమె ఎక్కువగా గుర్తుండి పోయేలా ముద్ర వేసుకొన్నది. ఈ వారం మధు ప్రియ ఎలిమినేషన్ గ్యారెంటి అని శుక్రవారం ఎపిసోడ్‌లో కనిపించింది.

వైల్డ్ కార్డు ఎంట్రీతో కొత్త తారలు

వైల్డ్ కార్డు ఎంట్రీతో కొత్త తారలు

ఇక వైల్డ్ కార్డు ఎంట్రీతో బిగ్‌బాస్‌లోకి మరో తార వస్తున్నదంటూ వార్తలు ప్రచారం జరుగుతున్నాయి. యాంకర్లు అనసూయ, రష్మీ‌లను సంప్రదిస్తున్నట్టు తెలుస్తున్నది. అంతేకాకుండా షటిల్ ప్లేయర్ గుత్తా జ్వాలా కూడా వచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తున్నది. అనసూయ, రష్మీలు బిగ్‌బాస్‌లోకి రాకపోయే అవకాశాలు ఎక్కువ. వారు డెయిలీ షోలలో ఎక్కువగా యాంకర్‌గా వ్యవహరిస్తుండటమే అందుకు కారణం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X