Bigg Boss OTT: షోలోకి హాట్ ఐటెం గర్ల్ ఎంట్రీ.. గ్లామర్ ట్రీట్‌తో రచ్చ చేయనున్న బ్యూటీ
తెలుగు బుల్లితెరపై సంచలనాలకు కేరాఫ్ అడ్రెస్‌గా నిలుస్తూ నెంబర్ వన్ రియాలిటీ షోగా వెలుగొందుతోంది బిగ్ బాస్. అసలేమాత్రం అంచనాలు లేకుండానే వచ్చిన ఈ షో.. చాలా తక్కువ సమయంలోనే భారీ స్థాయిలో పాపులర్ అయింది. దీంతో నిర్వహకులు రెట్టించిన ఉత్సాహంతో సీజన్ల మీద సీజన్లను పూర్తి చేసుకుంటూ వెళ్తున్నారు. ఇలా ఇప్పటికే ఐదింటిని దిగ్విజయంగా నడిపించారు.
ఈ క్రమంలోనే ఇప్పుడు బిగ్ బాస్ ఓటీటీ వెర్షన్‌ను మొదలు పెట్టడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. దీంతో ఇందులో పాల్గొనే కంటెస్టెంట్ల పేర్లు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. ఇక, ఇప్పుడు ఈ సీజన్ కంటెస్టెంట్‌గా ఓ ఐటెం గర్ల్ ఎంట్రీ ఇస్తుందని వార్త ఒకటి లీకైంది. ఇంతకీ ఎవరా భామ? పూర్తి వివరాలకై మొత్తం చూడండి!

ఓటీటీ వెర్షన్‌తో కొత్త ప్రయోగం
చాలా భాషల్లో ప్రసారం అవుతోన్న తెలుగులో మాత్రమే బిగ్ బాస్ షోకు భారీ స్థాయిలో ఆదరణ దక్కింది. అందుకే ఇది వరుసగా ఐదు సీజన్లను కూడా దిగ్విజయంగా పూర్తి చేసుకుంది. ఈ క్రమంలోనే ఇప్పుడు సరికొత్తగా ఓటీటీ వెర్షన్‌ను కూడా ప్రారంభించబోతున్నారు. ఈ విషయాన్ని నిర్వహకులు ప్రకటించారు. దీన్ని కూడా అక్కినేని నాగార్జున హోస్టింగ్ చేయబోతున్నాడు.

ఓటీటీలో 24 గంటల ప్రసారం
2021లో హిందీ నిర్వహకులు బిగ్ బాస్ ఓటీటీ వెర్షన్‌ను ప్రసారం చేశారు. అక్కడ ఇది విజయవంతం అయింది. దీంతో ఇప్పుడు తెలుగులోకి కూడా తీసుకుస్తున్నారు. అయితే, దీన్ని బిగ్ బాస్ సీజన్ మాదిరిగా టీవీలో కాకుండా కేవలం ప్రముఖ సంస్థ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లోనే ప్రసారం చేస్తారు. అంతేకాదు, దీన్ని 24 గంటల పాటు స్ట్రీమింగ్ చేయబోతున్నారన్న విషయం తెలిసిందే.

బిగ్ బాస్ ఫోకస్ మొత్త దానిపై
తెలుగులో బిగ్ బాస్ ఓటీటీ ఫస్ట్ సీజన్ ఫిబ్రవరి చివరి వారం నుంచి ప్రారంభం కాబోతుంది. దీంతో ఇప్పటికే దీనికి సంబంధించిన అన్ని పనులను ముమ్మరం చేసేశారు. ఇందులో సెట్ వర్క్‌ను దాదాపుగా కంప్లీట్ చేసేశారని అంటున్నారు. ఐదో సీజన్ హౌస్‌కు కొన్ని మార్పులు చేసి దీన్ని ఏర్పాటు చేస్తున్నారట. అలాగే, కంటెస్టెంట్ల ఎంపిక ప్రక్రియ కూడా చివరి దశకు చేరినట్లు టాక్.

ఓటీటీ సీజన్ పూర్తి వివరాలివే
బిగ్ బాస్ వర్గాల ద్వారా అందుతోన్న సమాచారం ప్రకారం.. తెలుగు ఓటీటీ మొదటి సీజన్ ఫిబ్రవరి 27వ తేదీ నుంచి ఎంతో వైభవంగా మొదలు అవుతుందట. ఇది మొత్తం 82 రోజుల పాటు సాగనుందని తెలుస్తోంది. ఇక, ఇందులో 15 మంది కంటెస్టెంట్లు ఎంట్రీ ఇవ్వబోతున్నారని తెలిసింది. ఇప్పటికే కంటెస్టెంట్లకు సంబంధించిన షార్ట్ లిస్ట్ కూడా రెడీ అయిందని సమాచారం.

వాళ్లు కూడా రీఎంట్రీ ఇచ్చేలా
అంగరంగ వైభవంగా ప్రారంభం కాబోతున్న బిగ్ బాస్ ఓటీటీ వెర్షన్ కోసం చాలా మంది ప్రేక్షకులు ఆసక్తిగా చూస్తున్నారు. అదే సమయంలో ఇందులో పాల్గొనబోయే కంటెస్టెంట్ల గురించి కూడా చర్చించుకుంటున్నారు. ఇక, ఇందులో ముగ్గురు లేదా నలుగురు మాజీ కంటెస్టెంట్లు పాల్గొనే అవకాశాలు ఉన్నాయట. ఇందుకోసం పాత కంటెస్టెంట్లతో మంతనాలు చేస్తున్నారని సమాచారం.

షోలోకి ఐటెం గర్ల్ వస్తుందని
సరికొత్త హంగులతో ఎంతో ప్రయోగాత్మకంగా ప్రసారం కాబోతున్న బిగ్ బాస్ తెలుగు ఓటీటీ మొదటి సీజన్‌పై అంచనాలు నెలకొన్నాయి. అందుకు అనుగుణంగానే నిర్వహకులు సరికొత్త ప్లాన్లతో ముందుకు వస్తున్నారు. ఇందుకోసం గత సీజన్లలో బాగా హైలైట్ అయిన కంటెస్టెంట్లను తీసుకు రాబోతున్నారు. ఇందులో భాగంగానే ఐటెం గర్ట్ ముమైత్ ఖాన్ రీఎంట్రీ ఇస్తుందని తెలిసింది.

గ్లామర్ ట్రీట్‌తో రచ్చ రచ్చే
టాలీవుడ్‌లో చాలా కాలం పాటు ఐటెం సాంగ్స్‌తో రచ్చ రచ్చ చేసింది ముమైత్ ఖాన్. ఈ క్రమంలోనే ఎన్టీఆర్ హోస్ట్ చేసిన మొదటి సీజన్‌లో కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇచ్చింది. అందులో గెలవకున్నా బోల్డుగా ఉంటూ రచ్చ చేసింది. దీంతో ఇప్పుడు ఆమెను మరోసారి తీసుకు రాబోతున్నారని తెలుస్తోంది. ఇక, ఆమె వస్తే హౌస్‌లో రచ్చ రచ్చ ఉండడం ఖాయమని చెప్పుకోవచ్చు.


Click it and Unblock the Notifications











