మా జడ్జ్‌మెంట్‌ను జడ్జ్ చేస్తున్నారా?.. యశ్ మాస్టర్‌పై ముమైత్ ఖాన్ ఫైర్
బుల్లితెరపై ఓ షో క్లిక్ అవ్వాలంటే.. కొన్ని అంశాలు ఉండాల్సిందే. కంటెస్టెంట్ల మధ్య ట్రాక్‌ను క్రియేట్ చేస్తుంటారు.. లేదా.. జడ్జ్‌ల మధ్య గొడవలు క్రియేట్ అయ్యేలా చూస్తుంటారు. ఓ వైపు రొమాన్స్, మరో వైపు గొడవలు ఇలా అన్నింటితో టీఆర్పీలను పెంచుకోవాలని చూస్తుంటారు. ప్రస్తుతం డ్యాన్స్ ప్లస్ అనే షోలో జడ్జ్‌లు, కంటెస్టెంట్లు చేస్తోన్న రచ్చతో బాగానే పాపులర్ అవుతున్నారు.

ఢీకి పోటీగా..
డ్యాన్స్ ప్లస్ అనే షోను ఓంకార్ ఢీ షోకు పోటీగా నిలబెట్టేందుకు బాగానే ప్రయత్నిస్తున్నాడు. గత వారం ఢీ షోను టీఆర్పీ విషయంలో డ్యాన్స్ ప్లస్ వెనక్కి నెట్టేసింది. ఓంకార్ వేసిన సెలెబ్రిటీల పాచికలు బాగానే పని చేశాయి. కంటెస్టెంట్లకు సెలెబ్రిటీలను కలిపి పర్ఫామెన్స్ ఇచ్చేలా చేశాడు.

జడ్జ్‌లు అలా..
డ్యాన్స్ ప్లస్ షోలో బాబా మాస్టర్, యశ్, యానీ, రఘు మాస్టర్లు చేసే రచ్చ అందరికీ తెలిసిందే. వీరితో పాటు ముమైత్ ఖాన్, మోనాల్ చేసే హంగామా కూడా మామూలుగా ఉండదు. ప్రతీ ఒక్కరూ తమ తమ టీంలకు సంబంధించిన కంటెస్టెంట్ల పర్ఫామెన్స్‌కు సంబంధించిన జడ్జ్‌మెంట్‌లు ఇస్తుంటారు.

రెడ్, గ్రీన్ అంటూ..
కంటెస్టెంట్లు చేసిన పర్ఫామెన్స్‌లకు జడ్జ్‌లందరూ కూడా గ్రీన్, రెడ్ లైట్‌లంటూ ఇస్తుంటారు. గ్రీన్ ఇస్తే పర్ఫామెన్స్ బాగుందని.. రెడ్ ఇస్తే పర్ఫామెన్స్ నచ్చలేదని అర్థం. అయితే తాజాగా జడ్జ్‌ల మధ్యలో విబేధాలు వచ్చినట్టు కనిపిస్తున్నాయి.

యశ్ మాస్టర్‌లపై..
యశ్ మాస్టర్ టీంకు సంబంధించిన కంటెస్టెంట్ పర్ఫామెన్స్‌పై ముమైత్ ఖాన్, యానీ మాస్టర్ పెదవి విరిచారు. మజా అనిపించలేదంటూ ముమైత్ ఖాన్ చెప్పుకొచ్చింది. ముమైత్ ఖాన్ చెప్పినట్టుగానే తనకు కూడా అనిపించిందని యానీ మాస్టర్ చెప్పుకొచ్చింది.

ముమైత్ ఖాన్ ఫైర్..
ముమైత్ ఖాన్, యానీ మాస్టర్ ఇచ్చిన జడ్జ్‌మెంట్‌పై యశ్ మాస్టర్ స్పందించాడు. వారు ఇచ్చారని కన్ఫ్యూజ్ అవ్వకు అంటూ యశ్ మాస్టర్ అనడంతో.. మా జడ్జ్‌మెంట్‌ను జడ్జ్ చేస్తున్నారా? అంటూ ముమైత్ ఖాన్ ఫైర్ అయింది. యానీ మాస్టర్ కూడా యశ్ మాస్టర్‌పై ఘాటుగానే స్పందించింది.


Click it and Unblock the Notifications











