For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Bigg Boss Non Stop: ఆ ఐదుగురిపై ముమైత్ ఖాన్ దారుణంగా కామెంట్.. డబుల్ మీనింగ్ డైలాగ్స్ రచ్చ!

  |

  ఎన్నో అంచనాల మధ్య అంగరంగ వైభవంగా ప్రారంభమైన బిగ్‌బాస్ నాన్‌స్టాప్ తొలి వారాన్ని పూర్తి చేసుకుంది. మొమైత్, సరయు, అషు రెడ్డి, ఆరియానా, శ్రీ రాపాక వంటి బోల్డ్ భామల సందడితో హాట్‌హాట్‌గా సాగుతోంది. డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ వేదికగా ప్రసారమవుతున్న ఈ కార్యక్రమం మొదటి వారం ఎపిసోడ్‌లో మొమైత్ ఖాన్ నిష్క్రమించిన సంగతి తెలిసిందే. యంగ్ టైగర్ ఎన్టీయార్ హోస్ట్ చేసిన బిగ్‌బాస్-1లో కొన్ని వారాలు సందడి చేసిన మొమైత్.. బిగ్‌బాస్ నాన్‌స్టాప్లో మాత్రం తొలి వారంలోనే నిరాశగా వెనుదిరిగింది. ఆ షో వివరాల్లోకి వెళితే..

  బిగ్‌బాస్ నాన్‌స్టాప్ షో వివరాల్లోకి వెళితే..

  బిగ్‌బాస్ నాన్‌స్టాప్ షో వివరాల్లోకి వెళితే..

  10 మంది బిగ్‌బాస్ మాజీ కంటెస్టెంట్స్, మరో 7 మంది కొత్త సెలబ్రిటీలతో టీమ్‌ను సెట్ చేశారు. ఈ షోలో అరియానా గ్లోరి , సరయు, అశురెడ్డి, తేజస్వి మదివాడ, అఖిల్ సార్థక్, నటరాజ్ మాస్టర్, బిందు మాధవి, హమీదా ఖాతూన్, మహేష్ విట్టా, ముమైత్ ఖాన్, శ్రీ రాపాక, మిత్రా శర్మ, యాంకర్ శివ, ఆర్జే చైతూ, స్రవంతి చొక్కారపు, అజయ్ కుమార్ కథ్వురార్, అనిల్ రాథోడ్ పాల్గొంటున్నారు. ముమైత్ ఖాన్ ఎలిమినేషన్ తర్వాత ప్రస్తుతం 16 మంది ఇంటిలో ఉన్నారు.

   ఊహించని ఎలిమినేషన్

  ఊహించని ఎలిమినేషన్


  మొదటి వారంలో సరయు లేదా మిత్ర శర్మలలో ఒకరు ఎలిమినేట్ అవుతారని అందరూ అనుకున్నారు. అయితే అనూహ్యంగా మొమైత్ ఖాన్ నిష్క్రమించాల్సి వచ్చింది. దీంతో ఆమె వేదిక మీదే కన్నీళ్లు పెట్టుకుంది. తన వ్యక్తిత్వం గురించి చెడుగా మాట్లాడారని, అందుకే ఎలిమినేట్‌ అవాల్సి వచ్చిందని తోటి కంటెస్టెంట్లపై మొమైత్ ఫైర్‌ అయింది‌. హోస్ట్ నాగార్జున ఎదుట కూడా దు:ఖాన్ని ఆపుకోలేకపోయింది. బిగ్‌బాస్ హౌస్‌లో వేస్ట్ కంటెస్టెంట్లు ఎవరని నాగ్ అడగ్గా.. చైతూ, శివ, మిత్ర, సరయు, బిందు మాధవి పేర్లను మొమైత్ చెప్పింది.

   వారు బెస్ట్..

  వారు బెస్ట్..


  ఇక హౌస్‌లో బెస్ట్ కంటెస్టెంట్లు ఎవరిని అదే వేదికపై మొమైత్‌ను నాగార్జున అడిగాడు. దానికి మొమైత్ స్పందిస్తూ.. అఖిల్‌, అషూ, తేజస్వి, అజయ్‌, అరియానా పేర్లు చెప్పింది. ముఖ్యంగా అఖిల్‌కు ఆమె చాలా క్లోజ్ అయింది. దీంతో హౌస్ నుంచి వీడేటపుడు అఖిల్‌ను హత్తుకుని కన్నీళ్లు పెట్టుకుంది. బిగ్‌బాస్ నుంచి ఎలిమినేట్ అయిన వారిని బిగ్‌బాస్ బజ్ పేరుతో ఇంటర్వ్యూలు చేస్తుంటారనే సంగతి తెలిసిందే.

  నాగుపాము అంటూ ముమైత్ ఖాన్

  నాగుపాము అంటూ ముమైత్ ఖాన్


  ఇక ఓటీటీలో ప్రసారమవుతున్న బిగ్‌బాస్ నాన్‌స్టాప్ నుంచి ఎలిమినేట్ అయిన వారిని కూడా బిగ్‌బాస్ నాన్‌స్టాప్ బజ్ పేరుతో యాంకర్ రవి ఇంటర్వ్యూలు చేస్తున్నాడు. యాంకర్ రవి అడిగిన పలు ప్రశ్నలకు మొమైత్ తనదైన శైలిలో సమాధానాలు చెప్పింది. తోటి కంటెస్టెంట్ బింధుమాధవిని ముమైత్ నాగుపాముతో పోల్చింది. ఆమెతో చాలా జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించింది. అలాగే వచ్చే వారం ఆర్జే చైతు ఎలిమినేట్ అవుతాడని జోస్యం చెప్పింది.

  డబుల్ మీనింగ్స్ రచ్చ

  డబుల్ మీనింగ్స్ రచ్చ


  బిగ్‌బాస్‌ నాన్‌స్టాప్‌లో రెండవ వారానికి సంబంధించి నామినేషన్స్‌ జరిగాయి. ఇంట్లో ఉండటానికి ఒక అర్హత ఉండాలని, అది గేమ్‌లో ఎక్కడా కనిపించడం లేదని చెప్పి యాంకర్ శివను అఖిల్‌ నామినేట్‌ చేశాడు. కాగా, డబుల్ మీనింగ్ డైలాగ్స్‌తో మాట్లాడుతున్నాడంటూ సరయు కూడా శివనే టార్గెట్ చేసింది. ఆ విషయంలో సరయు, శివ మధ్య వాగ్వాదం జరగ్గా నటరాజ్ మాస్టర్.. సరయుకు మద్దతుగా నిలిచాడు. శివ డబుల్ మీనింగ్స్‌తో మాట్లాడుతున్నాడని చెప్పాడు. అలాగే శ్రీ రాపాక, ఆరియానా మధ్య మాటల యుద్ధం జరిగింది. మొత్తానికి ఈ వారం సరయు, అఖిల్‌, హమీదా, అనిల్‌, మిత్ర శర్మ, అరియానా, శివ, నటరాజ్‌, అషూ, శ్రీరాపాక, మహేశ్‌ ఎలిమినేషన ప్రక్రియకు నామినేట్ అయిన వారిలో ఉన్నారు.

  English summary
  Mumaith Khan intestesting comments on Bigg Boss Non Stop Contestants
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X