బిగ్ బాస్: ముమైత్ ఎందుకిలా చేస్తోంది? షాకయ్యారు, ఏడ్చారు...!

బిగ్ బాస్ ఇంట్లో 11వ రోజు విషాదం కనిపించింది. ఇంటి నుండి ముమైత్ వెళ్లిపోతుండటంతో అంతా ఏడ్చేశారు.

By Bojja Kumar

చిన్న చిన్న గొడవలు, గిల్లిగజ్జాలతో సరదాగా సాగుతున్న బిగ్ బాస్ ఇంట్లో 11వ రోజు అనుకోని సంఘటనతో విషాద వాతావరణం నెలకొంది. డ్రగ్స్ కేసులో ముమైత్ విచారణ ఉండటంతో ఆమెను ఇంటి నుండి బయటకు పంపేశారు బిగ్ బాస్.

అయితే ఈ డ్రగ్స్ కేసు విషయం బిగ్ బాస్ ఇంట్లో ఉన్న వారికి తెలియదు కాబట్టి అసలు ఏం జరుగుతుందో తెలియక అయోమయంలో పడ్డారు. ముమైత్ ఇలా ఉన్నట్టుండి వెలుతుంటే షాకయ్యారు, కొందరు ఏడ్చేశారు.

బిగ్ బాస్ ఆదేశాన్ని పాటించిన ముమైత్

బిగ్ బాస్ ఆదేశాన్ని పాటించిన ముమైత్

ముమైత్‌ను ప్రత్యేకంగా పిలిచిన బిగ్ బాస్.... ‘కొన్ని అత్యవసర చట్టపరమైన కారణాల దృష్ట్యా బిగ్ బాస్ ఇంట్లో ఇకపై మీరు కొనసాగలేరు. మీ లగేజ్ సర్దుకోవడానికి బిగ్ బాస్ మీకు 10 నిమిషాల టైమ్ ఇస్తున్నారు, అందరికీ గుడ్ బై చెప్పి మెయిన్ డోర్ ద్వారా వెళ్లి పోండి' అని ముమైత్‌కు బిగ్ బాస్ సూచించారు.

Recommended Video

Bigg Boss Telugu : Mumaith Khan Trolled For Hugging Dhanraj
హ్యాపీగా వెళ్లిపోయిన ముమైత్

హ్యాపీగా వెళ్లిపోయిన ముమైత్

బిగ్ బాస్‍‌ను ఎదురు ప్రశ్నించకుండా..... కేవలం 10 నిమిషాలు మాత్రమే సమయం ఇవ్వడంతో ముమైత్ ఆదరాబాదరాగా తన లగేజ్ సర్దుకుంది. అయితే తాను ఎందుకు వెళ్లిపోతున్నాననే కారణం చెప్పకూడదని బిగ్ బాస్ సూచించడంతో ముమైత్ హ్యాపీగా ఫోజు కొడుతూ ఇంటి నుండి బయటకు వెళ్లిపోయారు.

షాకయ్యారు, ఏడ్చారు...

షాకయ్యారు, ఏడ్చారు...

ముమైత్ వెలుతుంటే ఇంటి సభ్యులంతా షాకయ్యారు. ఉన్నట్టుండి సడెన్‌గా ముమైత్ ఇంటి నుండి బయటకు వెలుతుండటంతో ఏం జరుగుతుందో తెలియక అయోమయంలో పడ్డారు. ధనరాజ్, అర్చన, హరితేజ, మధుప్రియ... ఇలా బిగ్ బాస్ ఇంట్లో ఉన్న వారంతా ఏడ్చేశారు.

ఏదో టాస్క్ అనుకున్నారు

ఏదో టాస్క్ అనుకున్నారు

ముమైత్ ఇలా ఉన్నట్టుండి లగేజ్ మొత్తం సర్దటంతో.... ఆమెకు బిగ్ బాస్ ఏదైనా కొత్త టాస్క్ ఇచ్చారని భావించారు. అయితే ముమైత్ నిజంగానే ఇంటి నుండి బయటకు వెలుతుండటంతో అంతా ఒక్కసారి షాకయ్యారు.

తిరిగొస్తుందనే నమ్మకంతో...

తిరిగొస్తుందనే నమ్మకంతో...

ముమైత్ వెళ్లిపోతుండటంతో ఏడ్చేసిన ఇంటి సభ్యులును... ఇతర సభ్యులు బుజ్జగించే ప్రయత్నం చేశారు. ముమైత్ ఏదో పర్సనల్ రీజన్ కారణంగా వెళ్లిపోతోందని... అది బయటకు చెప్పకూడదని, మళ్లీ తిరిగి వస్తుందనే నమ్మకంతో తామంతా ఉన్నట్లు ఇంటి సభ్యులు అభిప్రాయపడ్డారు.

ముమైత్‌ను తలుచుకుంటూ..

ముమైత్‌ను తలుచుకుంటూ..

ముమైత్‌ వెళ్లిపోయిన తర్వాత ఆమెతో గడిపిన క్షణాలను తలుచుకుంటూ బిగ్ బాస్ ఇంటి సభ్యులు కొన్ని గంటల పాటు గడిపేశారు. దీన్నిబట్టి గడిచిన 10 రోజుల్లో ముమైత్ తో ఇంటి సభ్యులు ఎంలాంటి ఎటాచ్మెంట్ పెంచుకున్నారో అర్థం చేసుకోవచ్చు.

బిగ్ బాస్ ఇంటి సభ్యులను రిఫ్రెష్ చేసేందుకు...

బిగ్ బాస్ ఇంటి సభ్యులను రిఫ్రెష్ చేసేందుకు...

ముమైత్ వెళ్లి పోయిన బాధలో ఉన్న వారిని రిఫ్రెష్ చేసేందుకు బిగ్ బాస్ ఇంటి సభ్యులకు కొత్త టాస్క్ ఇచ్చారు. అందరూ కలిసి డ్రామా ఆడాలని సూచించారు. ఇందులో నవాబ్ పాత్రను ఆదర్శ్ పోషించాలని, శివగామి పాత్రను కల్పన, నవాబ్- శివగామి కొడుకు కాలకేయుడు పాత్రను ప్రిన్స్, నవాబ్-శివగామిల కూతురుగా మధుప్రియ, రాజనర్తకి పాత్రను హరితేజ, అందమైన నర్స్ పాత్రను అర్చన, డాక్టర్ బాలి పాత్రను ధనరాజ్, కిల్ బిల్ పాండే పాత్రను సమీర్, కిల్ బిల్ పాండే సబార్డినేట్ పాత్రను కార్తీక, కట్టప్ప పాత్రను మహేష్ కత్తి చేయాలని సూచించారు.

ఆకట్టుకున్న డ్రామా

ఆకట్టుకున్న డ్రామా

బిగ్ బాస్ సూచన మేరకు ఇంటి సభ్యులు నిర్వహించిన ఫన్నీ డ్రామా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఈ డ్రామాలో ఉత్తమ నటిగా కల్పనను, ఉత్తమ నటుడిగా ఆదర్శ్ ను ఎంపిక చేస్తూ వారి వివరాలను బిగ్ బాస్‌కు తెలియజేశారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X