For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Bigg Boss Non Stop: ఆ కంటెస్టెంట్ నేషనల్ రికార్డు.. దేశంలోనే మొదటిసారి.. షాకైపోయిన నాగార్జున

  |

  ఎలాంటి పరిస్థితుల్లో బుల్లితెర ప్రేక్షకుల ముందుకు వచ్చినా.. భారీ స్థాయిలో స్పందనను అందుకుంటూ.. అత్యధిక టీఆర్పీని రాబడుతోన్న ఏకైక షో బిగ్ బాస్. మిగిలిన భాషల కంటే తెలుగులోకి ఆలస్యంగా వచ్చినా.. అన్నింటి కంటే ఎక్కువ రెస్పాన్స్‌తో టాప్ షోగా వెలుగొందుతోంది. దీంతో ఇప్పుడు ఓటీటీ వెర్షన్ బిగ్ బాస్ నాన్ స్టాప్ మొదటి సీజన్‌ను కూడా ఆరంభించారు.

  ఇందులో గతంలో కంటే ఎక్కువగా నిత్యం గొడవలు.. రొమాన్స్‌లు.. లవ్ ట్రాకులు.. డబుల్ మీనింగ్ డైలాగులు.. ఇలా ఎన్నో రకాల పరిణామాలతో ఇది రంజుగా సాగుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో తాజాగా బిగ్ బాస్ షోలో ఓ కంటెస్టెంట్ నేషనల్ రికార్డును క్రియేట్ చేసింది. ఈ విషయాన్ని నాగార్జునే వెల్లడించాడు. అసలేం జరిగింది? దానికి సంబంధించిన పూర్తి వివరాలు చూడండి!

   ఐదు సీజన్లు విజయవంతం

  ఐదు సీజన్లు విజయవంతం

  మిగిలిన భాషలతో పోల్చుకుంటే తెలుగులో ప్రసారం అవుతోన్న బిగ్ బాస్ మాత్రమే భారీ స్థాయిలో ప్రేక్షకాదరణను దక్కించుకుంటోంది. ఫలితంగా ఇప్పటికే ఐదు సీజన్లు పూర్తి అయ్యాయి. ఇవన్నీ కూడా ఒకదానికి మించి ఒకటి భారీ రెస్పాన్స్‌ను దక్కించుకుని రికార్డు స్థాయిలో టీఆర్పీ రేటింగ్‌ను సొంతం చేసుకున్నాయి. అదే సమయంలో దేశంలోనే టాప్ షోగా మారిపోయిందిది.

  శృంగార వీడియోలు షేర్ చేసిన రాంగోపాల్ వర్మ: వామ్మో ఇద్దరు హీరోయిన్లతో దారుణంగా!

  నాన్ స్టాప్ కూడా అదే స్పీడ్

  నాన్ స్టాప్ కూడా అదే స్పీడ్

  రెగ్యూలర్ బిగ్ బాస్ సూపర్ డూపర్ హిట్ అవడంతో ఇప్పుడు ఓటీటీ వెర్షన్ నాన్ స్టాప్ మొదటి సీజన్‌పై అంచనాలు తారాస్థాయిలో ఏర్పడ్డాయి. అందుకు అనుగుణంగానే ఇది ఆరంభం నుంచే ఆసక్తికరంగా సాగుతోంది. మరీ ముఖ్యంగా డబుల్ మీనింగ్ డైలాగులు, బూతులు, బోల్డు బ్యూటీల రచ్చతో సందడిగా నడుస్తోంది. ఫలితంగా ఈ సీజన్ రోజురోజుకూ రంజుగా మారుతూనే ఉంది.

  ఐదు వారాల్లో వాళ్లంతా ఔట్

  ఐదు వారాల్లో వాళ్లంతా ఔట్

  ఈ సీజన్‌లోకి అషు రెడ్డి, మహేశ్ విట్టా, ముమైత్ ఖాన్, అజయ్ కుమార్, స్రవంతి చొక్కారపు, ఆర్జే చైతూ, ఆరియానా గ్లోరీ, నటరాజ్ మాస్టర్, శ్రీ రాపాక, అనిల్ రాథోడ్, మిశ్రా శర్మ, తేజస్వీ మదివాడ, యాంకర్ శివ, సరయు రాయ్, బిందు మాధవి, హమీదా ఖతూన్, అఖిల్ సార్థక్‌లు ఎంట్రీ ఇచ్చారు. వీరి నుంచి ముమైత్, శ్రీ రాపాక, ఆర్జే చైతూ, సరయు, తేజస్వీలు ఎలిమినేట్ అయిపోయారు.

  Bigg Boss Non Stop: అతడి వల్లే తేజస్వీ బలి.. ప్లాన్ ప్రకారమే ఎలిమినేట్.. తెరపైకి సంచలన నిజం

  ఆమె రీఎంట్రీతో రంజుగానే

  ఆమె రీఎంట్రీతో రంజుగానే

  బిగ్ బాస్ నాన్ స్టాప్ మొదటి సీజన్‌లోకి ఫలానా సెలెబ్రిటీ వైల్డ్ కార్డ్ ద్వారా ఎంట్రీ ఇచ్చే అవకాశాలు ఉన్నాయని ఎన్నో రకాల వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇందులో భాగంగానే చాలా మంది ప్రముఖుల పేర్లు కూడా తెరపైకి వచ్చాయి. ఇలాంటి పరిస్థితుల్లో మొదటి వారం ఎలిమినేట్ అయిన ముమైత్ ఖాన్‌ రీఎంట్రీ ఇచ్చింది. అదిరిపోయే టాస్కుతో ఆమె సర్‌ప్రైజ్ చేసేసింది.

  ఆదివారం ఎపిసోడ్‌లో అలా

  ఆదివారం ఎపిసోడ్‌లో అలా

  సాధారణంగా ఆదివారం జరిగే ఎపిసోడ్ ఆద్యంతం సందడిగా సాగుతుంది. ఆరోజు చివర్లో ఎలిమినేషన్ ఉన్నా.. దాన్ని మరిపించేందుకు హోస్ట్ నాగార్జున కంటెస్టెంట్లతో ఆటలు ఆడిస్తాడు. అందుకు అనుగుణంగానే తాజాగా జరిగిన ఎపిసోడ్‌లో ముందుగా ఇంటి సభ్యులు చేసిన తప్పు ఒప్పులను ప్రస్తావించాడు. ఆ తర్వాత అందరితో సందడిగా గడిపి ప్రేక్షకులను అలరించాడు.

  బిగ్ బాస్ దివి అందాల ఆరబోత: టాప్‌ను కిందకు జరిపి.. అక్కడి టాటూను చూపిస్తూ!

  ముమైత్ నేషనల్ రికార్డుతో

  ముమైత్ నేషనల్ రికార్డుతో

  ఐదో వారానికి సంబంధించిన అఖిల్, బిందు మధ్య విడాకుల కేసు అంటూ ఓ కొత్త టాస్కును తీసుకొచ్చారు. ఇందులో ముమైత్ ఖాన్ జడ్జ్‌గా చేసింది. ఆమె తన స్నేహితుడైన అఖిల్‌ వైపే తీర్పు ఇచ్చింది. దీంతో ఆమెపై విమర్శలు వచ్చాయి. ఇలాంటి పరిస్థితుల్లో నాగార్జున ముమైత్ తీర్పును మెచ్చుకున్నాడు. అదే సమయంలో ఆమె నేషనల్ రికార్డు క్రియేట్ చేసిందని వెల్లడించాడు.

  అప్పుడు అలా.. ఇప్పుడిలా

  అప్పుడు అలా.. ఇప్పుడిలా

  ముమైత్ ఖాన్ బిగ్ బాస్ సీజన్ 1లో డ్రగ్స్ కేసు విచారణ కోసం బయటకు వెళ్లి వచ్చింది. ఒకసారి ఎలిమినేట్ చేసి మళ్లీ తీసుకొచ్చారు. ఇక, ఇప్పుడు మొదటి వారమే బయటకు వెళ్లిపోయి.. ఇప్పుడు రీఎంట్రీ ఇచ్చింది. ఇలా ఇండియాలోని ఏ కంటెస్టెంట్ కూడా ఇన్ని సార్లు వచ్చి వెళ్లలేదు. ఈ విషయాన్ని వెల్లడించిన నాగార్జున.. ఇది నేషనల్ రికార్డు అంటూ కామెంట్స్ చేశాడు.

  English summary
  Bigg Boss Telugu Non Stop OTT First Season Running Successfully. Mumaith Khan Create National Record This Show.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X