Bigg Boss Non Stop: ఆమెకు బిగ్ బాస్ మరో ఛాన్స్.. షోలోకి ఫైర్ బ్రాండ్ రీఎంట్రీ.. ఎప్పుడు వస్తుందంటే!
ఎప్పుడు ప్రసారమైనా ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో స్పందనను అందుకుంటూ నెంబర్ వన్ రియాలిటీ షోగా వెలుగొందుతోంది బిగ్ బాస్. తెలుగులో ఆలస్యంగా వచ్చినా.. అన్నింటి కంటే ఎక్కువగా రెస్పాన్స్‌తో టాప్ ప్లేస్‌కు చేరుకుంది. దీంతో ఇప్పుడు ఓటీటీ వెర్షన్ బిగ్ బాస్ నాన్ స్టాప్ మొదటి సీజన్‌ను కూడా ప్రారంభించారు. ఇందులో గతంలో కంటే ఎక్కువగా నిత్యం గొడవలు.. రొమాన్స్‌లు.. లవ్ ట్రాకులు.. డబుల్ మీనింగ్ డైలాగులు.. ఇలా ఎన్నో రకాల సన్నివేశాలతో ఇది రసవత్తరంగా సాగుతోంది. దీంతో ఇప్పుడు దీన్ని మరింత రంజుగా మార్చేందుకు నిర్వహకులు మాజీ కంటెస్టెంట్‌ను తీసుకొస్తున్నారని తెలిసింది. అసలేం జరిగింది? దానికి సంబంధించిన పూర్తి వివరాలు మీకోసం!

ఆరంభం నుంచే వినోదాత్మకం
ఐదు సీజన్లు సూపర్ డూపర్ హిట్ అవడంతో బిగ్ బాస్ నాన్ స్టాప్ మొదటి సీజన్‌పై అంచనాలు తారాస్థాయిలో ఏర్పడ్డాయి. అందుకు అనుగుణంగానే ఇది ఆరంభం నుంచే ఎంతో ఆసక్తికరంగా సాగుతోంది. మరీ ముఖ్యంగా డబుల్ మీనింగ్ డైలాగులు, బూతులు, బోల్డు బ్యూటీల రచ్చతో సందడిగా నడుస్తోంది. ఫలితంగా ఈ సీజన్ రోజురోజుకూ రసవత్తరంగా మారుతూ సాగిపోతోంది.

4 వారాల్లో వెళ్లిపోయింది వీళ్లే
నాన్ స్టాప్ సీజన్‌లోకి అషు రెడ్డి, మహేశ్ విట్టా, ముమైత్ ఖాన్, అజయ్ కుమార్, స్రవంతి చొక్కారపు, ఆర్జే చైతూ, ఆరియానా గ్లోరీ, నటరాజ్ మాస్టర్, శ్రీ రాపాక, అనిల్ రాథోడ్, మిశ్రా శర్మ, తేజస్వీ మదివాడ, యాంకర్ శివ, సరయు రాయ్, బిందు మాధవి, హమీదా ఖతూన్, అఖిల్ సార్థక్‌లు ఎంట్రీ ఇచ్చారు. వీరిలో నుంచి ముమైత్, శ్రీ రాపాక, ఆర్జే చైతూ, సరయులు ఎలిమినేట్ అయిపోయారు.

వైల్డ్ కార్డ్ ఎంట్రీ అని ప్రచారం
బిగ్ బాస్ షో అంటేనే ఎన్నో ఊహించని పరిణామాలు జరుగుతూ ఉంటాయి. ఇక, ఓటీటీ వెర్షన్ నాన్ స్టాప్ సీజన్‌లో ఇవన్నీ ఇంకాస్త ఎక్కువగా ఉంటాయని ముందు నుంచీ నిర్వహకులు చెబుతూ వస్తున్నారు. ఇందులో భాగంగానే ఈ సీజన్‌లోకి ఎంతో మంది గెస్టులు వస్తారని అంటున్నారు. అంతేకాదు, వైల్డ్ కార్డ్ ఎంట్రీలు కూడా ఉంటాయని ప్రచారం జరుగుతూనే ఉంది.

ఎంతో మంది పేర్లు రావడంతో
బిగ్ బాస్ నాన్ స్టాప్ మొదటి సీజన్‌లోకి ఫలానా సెలెబ్రిటీ వైల్డ్ కార్డ్ ద్వారా ఎంట్రీ ఇచ్చే అవకాశాలు ఉన్నాయని ఎన్నో రకాల వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇందులో భాగంగానే చాలా మంది ప్రముఖుల పేర్లు కూడా తెరపైకి వచ్చాయి. మరీ ముఖ్యంగా గత సీజన్లలో పాల్గొన్న కంటెస్టెంట్లు వచ్చే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. దీంతో అందరిలోనూ ఆసక్తి పెరుగుతూనే ఉంది.

ఆమెకు బిగ్ బాస్ మరో ఛాన్స్
బిగ్ బాస్ వైల్డ్ కార్డ్ విషయంలో చాలా రకాల వార్తలు వస్తున్నప్పటికీ షో నిర్వహకుల నుంచి మాత్రం ఎలాంటి స్పందన రావడం లేదు. దీంతో ఎవరికి తోచిన విధంగా వాళ్లు మాట్లాడుకుంటున్నారు. అయితే, తాజా సమాచారం ప్రకారం.. ఈ సీజన్‌లో ఇప్పటికే ఎలిమినేట్ అయిన వాళ్లలో ఒకరిని మాత్రమే షోలోకి తీసుకు రాబోతున్నారని ఓ న్యూస్ తెలిసింది.

షోలోకి ఫైర్ బ్రాండ్ రీఎంట్రీ
ఇప్పటి వరకూ బిగ్ బాస్ నాన్ స్టాప్ మొదటి సీజన్‌లో నాలుగు వారాలు ముగిశాయి. అందులో మొదటి వారం ముమైత్ ఖాన్, రెండో వారం శ్రీ రాపాక, మూడో వారం ఆర్జే చైతూ, నాలుగో వారం సరయులు ఎలిమినేట్ అయ్యారు. వీళ్లలో ముమైత్ రీఎంట్రీ ఇవ్వబోతుందని తెలుస్తోంది. తాజాగా ఆమె తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో సర్‌ప్రైజ్ అంటూ ఓ పోస్ట్ చేయడం దీనికి బలానిచ్చింది.

ఎప్పుడు ఎంట్రీ ఇస్తుందంటే
బుల్లితెర వర్గాల నుంచి అందుతోన్న సమాచారం ప్రకారం.. ముమైత్ ఖాన్ ఇప్పటికే మరోసారి బిగ్ బాస్ క్వారంటైన్‌కు కూడా వెళ్లిపోయిందట. ఈరోజు ఎపిసోడ్‌లోనో.. రేపటి ఎపిసోడ్‌లోనో ఆమె హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. అయితే, నేరుగా ఇంట్లోకి వెళ్లిపోతుందా? లేక సీక్రెట్ రూమ్‌లో ఉంటుందా? అన్నది మాత్రం ప్రస్తుతానికి సస్పెన్స్‌గా మారిపోయింది.


Click it and Unblock the Notifications











