Bigg Boss Non Stop.. నిరాశపరిచిన ముమైత్ ఖాన్.. ఊహించని ఎలిమినేషన్ తర్వాత రెమ్యూనరేషన్ ఎంతంటే..

ఎన్నో అంచనాల మధ్య అంగరంగ వైభవంగా ప్రారంభమైన బిగ్‌బాస్ నాన్‌స్టాప్ తొలి వారంలో హాట్ భామ మొమైత్ ఖాన్ నిష్క్రమించింది. యంగ్ టైగర్ ఎన్టీయార్ హోస్ట్ చేసిన బిగ్‌బాస్-1లో కొన్ని వారాలు సందడి చేసిన మొమైత్.. బిగ్‌బాస్ నాన్‌స్టాప్లో మాత్రం తొలి వారంలోనే నిరాశగా వెనుదిరిగింది. వారియర్స్ టీమ్‌ కంటెస్టెంట్ అయిన ముమైత్‌కు అతి తక్కువ ఓట్లు రావడంతో ఆమె బిగ్‌బాస్‌ హౌజ్‌ను వీడాల్సి వచ్చింది. దీంతో స్టేజ్ మీద కన్నీరు పెట్టుకుంది.

షాకింగ్ రెమ్యునరేషన్

షాకింగ్ రెమ్యునరేషన్

మొమైత్ తొలి వారంలోనే నిష్క్రమించడంతో ఆమెకు పెద్దగా పారితోషికం రాలేదని సమాచారం. బిగ్‌బాస్ నిర్వాహకులతో ఆమె వారానికి రూ.80 వేలకు ఒప్పందం కుదుర్చుకుందట. తొలి వారంలోనే నిష్క్రమించాల్సి రావడంతో ఆమె లక్ష రూపాయలు కూడా అందుకోలేదని సమాచారం. హౌస్‌లో నుంచి బయటకు వచ్చేసిన తర్వాత ఆర్జే చైతూ, బిందుమాధవిపై మొమైత్ విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. బిందుమాధవిని నాగినిగా అభివర్ణించిన మొమైత్.. తన తర్వాత ఆర్జే చైతూ ఇంటి నుంచి బయటకు వచ్చేస్తాడని చెప్పింది.

ఆరియానా, అషు సందడి

ఆరియానా, అషు సందడి

వర్మ గాళ్స్‌గా ప్రాచుర్యం పొందిన ఆరియానా, అషూ రెడ్డి తమ బోల్డ్ బిహేవియర్‌తో సందడి చేశారు. బోల్డ్‌ టాక్స్‌తో రెచ్చిపోతున్నారు. తోటి కంటెస్టెంట్ అజయ్‌తో వీరిద్దరూ సరదగా చేసిన ఓ ఎపిసోడ్ వీక్షకులకు మంచి వినోదాన్ని పంచింది. అజయ్‌కు అషు భార్యగా, ఆరియానా మరదలిగా చిన్న ఎపిసోడ్ చేశారు. ఆ ఎపిసోడ్‌లో అషు, ఆరియానా తమదైన శైలిలో డబుల్ మీనింగ్ డైలాగ్స్‌తో రచ్చ రచ్చ చేశారు.

నటరాజ్ మాస్టర్‌తో బిందుమాధవి గొడవ

నటరాజ్ మాస్టర్‌తో బిందుమాధవి గొడవ

యాంకర్ శివతో క్లోజ్‌గా మూవ్ అవుతున్న బిందుమాధవితో నటరాజ్ మాస్టర్ గొడవ పడ్డాడు. అందం గురించి కామెంట్లు చేస్తూ ఆమెకు కోపం తెప్పించాడు. ఆమె కూడా మాస్టర్‌కు అంతే ఘాటుగా జవాబు చెప్పింది. కాగా, మాటిమాటికి బిందుమాధవిని టార్గెట్ చేస్తూ అఖిల్ కాస్త తడబడుతున్నాడు. టైటిల్ అంచనాలతో బరిలోకి దిగిన అఖిల్.. స్రవంతి, అజయ్‌లతో కలిసి తిరుగుతూ గ్రూపు కట్టేశాడు.

Recommended Video

Bigg Boss Telugu Non Stop: Contestants బోల్డ్ స్టేట్మెంట్స్ Trolls | Filmibeat Telugu
యాంకర్ శివను హైలెట్ చేస్తూ..

యాంకర్ శివను హైలెట్ చేస్తూ..

బిగ్‌బాస్ మంగళవారం ఇచ్చిన టాస్క్‌తో యాంకర్ శివ హైలెట్ అయ్యాడు. హౌస్‌లో ఉన్న వాళ్లకి జోతిష్యం చెప్పమంటూ శివకు బిగ్‌బాస్ టాస్క్‌ ఇచ్చాడు. ఇందులో జోతిష్యుడిగా శివ ఫన్ జనరేట్ చేసి తనకి ఇచ్చిన పాత్రకి న్యాయం చేశాడు. అఖిల్‌తో తరచుగా గొడవకు దిగుతున్న శివ కూడా టైటిల్ ఫేవరెట్ అనిపించుకుంటున్నాడు. దీంతో శివకు సోషల్ మీడియాలో బాగానే ఫాలోయింగ్ పెరుగుతోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X