»   » బిగ్‌బాస్‌కు ముమైత్ తలనొప్పి.. తొలి ఎలిమినేషన్ ఆమెనే.. కారణాలు ఇవే..

బిగ్‌బాస్‌కు ముమైత్ తలనొప్పి.. తొలి ఎలిమినేషన్ ఆమెనే.. కారణాలు ఇవే..

Posted By:
Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

  తొలిరోజు బిగ్‌బాస్ రియాలిటీ షో ఆసక్తికరంగా సాగింది. ఈ కార్యక్రమం గురించిన అనేక విషయాలను, నిబంధనలు బిగ్‌బాస్ ఎప్పటికప్పుడు చెబుతూనే హెచ్చరికలు కూడా జారీ చేశారు. అయితే తొలి వారంలోనే ఎలిమినేట్ అవుతాడనుకొన్న సినీ నటుడు సంపూర్ణేశ్ బాబు ఏకంగా బిగ్‌బాస్ హౌస్‌కు కెప్టెన్ అయ్యాడు. దాంతో ఇక తొలివారం బిగ్‌బాస్ హౌస్ నుంచి ఎవరు ఎలిమినేట్ అవుతున్నారనే విషయం మళ్లీ ఆసక్తికరంగా మారింది. అయితే తాజా పరిస్థితుల ప్రకారం బిగ్‌బాస్ కార్యక్రమం నుంచి ఎలిమినేట్ అయ్యేది ఖచ్చితంగా సినీ నటి ముమైత్ ఖాన్ అనే మాట వినిపిస్తున్నది. ముమైత్ ఖాన్ ఎందుకు ఎలిమినేట్ అవుతారనడానికి బలమైన కారణాలు ఇవే..

  నిబంధనలకు విరుధ్దంగా ముమైత్

  నిబంధనలకు విరుధ్దంగా ముమైత్

  తెలుగు బిగ్‌బాస్ షో పాల్గొనే సెలబ్రిటీలు తప్పకుండా తెలుగు భాషలోనే మాట్లాడాలనేది ప్రాథమిక నిబంధన. ఈ రూల్‌ను ప్రారంభ ఎపిసోడ్‌లోనే ప్రధానంగా ప్రస్తావించారు. తొలి రోజు బిగ్‌బాస్ కార్యక్రమాన్ని చూస్తే ముమైత్ ఖాన్ ఎక్కువగా హిందీ, లేదా ఇంగ్లీష్‌లోనే మాట్లాడినట్టు స్పష్టమైంది. తెలుగులో మాట్లాడిన దాఖలాలు చాలా అరుదుగా కనిపించింది.

  Bigg Boss Telugu : Sampoornesh Babu Have Elimination Threat From Big Boss Show
  తెలుగులోనే ఎందుకు మాట్లాడలంటే

  తెలుగులోనే ఎందుకు మాట్లాడలంటే

  తెలుగు బిగ్‌బాస్ కార్యక్రమం తెలుగు ప్రేక్షకుల కోసం ఉద్దేశించింది. గ్రామీణ ప్రాంతాల వారిని ఆకర్షించడానికి ఈ కార్యక్రమాన్ని రూపొందించారు. తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకోగలిగితేనే ఈ కార్యక్రమం రేటింగ్ పెరుగుతుంది. ఈ నేపథ్యంలో ముమైత్ ఖాన్ తెలుగులో మాట్లాడకపోవడం ప్రధానమైన లోపం. ఆమెకు ఈ పాయింట్ మైనస్‌గా మారడానికి అవకాశం ఉంది.

  బిగ్‌బాస్ ప్రారంభానికి ముందే తలనొప్పి

  బిగ్‌బాస్ ప్రారంభానికి ముందే తలనొప్పి

  బిగ్‌బాస్ ప్రారంభానికి ముందే ముమైత్ ఖాన్‌ ఎదురు దెబ్బ తగిలింది. టాలీవుడ్ పరిశ్రమకు డ్రగ్ మాఫియాతో లింకులు ఉన్నాయనే ఆరోపణలు రావడం సంచలనంగా మారింది. ఈ కేసులో ముమైత్ ఖాన్ పేరు కూడా ప్రధానంగా వినిపించింది. ఈ నేపథ్యంలో ఆమెకు నోటీసులు అందజేయడానికి అధికారులు ప్రయత్నిస్తున్నారు.

  డ్రగ్ కేసులో నోటీసులు అందజేస్తారా?

  డ్రగ్ కేసులో నోటీసులు అందజేస్తారా?

  బిగ్‌బాస్ కార్యక్రమంలో పాల్గొంటున్న ముమైత్ ఖాన్‌కు నోటీసులు అందజేశారా లేక త్వరలో అందజేస్తారా అనే విషయంపై ఇంకా వివరాలు వెల్లడి కాలేదు. ఒకవేళ అందజేయకపోతే ముమైత్ ఖాన్‌కు బిగ్‌బాస్ హౌస్‌లో అందజేస్తారా? అందుకు బిగ్‌బాస్ నిర్వాహకులు అధికారులకు అనుమతిస్తారా? అనేది ప్రస్తుతం మిలియన్ డాలర్ల ప్రశ్న.

  బయటకు రావాలంటే కష్టం

  బయటకు రావాలంటే కష్టం

  ఒకవేళ ముమైత్ ఖాన్ విచారణకు హాజరుకావాల్సి వస్తే బిగ్‌బాస్ కార్యక్రమం నుంచి బయటకు వెళ్లడం కష్టం. అందుచేత ఈ వ్యవహారం నిర్వహకులకు తలనొప్పిగా మారింది. ఈ నేపథ్యంలో ముమైత్ ఖాన్‌ను తప్పించడం అనివార్యంగా కనిపిస్తున్నది.

  ముమైత్‌ను తప్పించడానికి కారణాలు అనేకం

  ముమైత్‌ను తప్పించడానికి కారణాలు అనేకం

  బిగ్‌బాస్ నుంచి ముమైత్‌ను తప్పించడానికి ఆమె అనుసరిస్తున్న తీరు కూడా అందుకు అనుకూలంగా మారింది. ఆమె తెలుగులో మాట్లాడకపోవడం ఆమెకు ప్రతికూలంగా మారే అవకాశం ఉంది. అంతేకాకుండా ఈ షోలో పాల్గొంటున్న వారిలో ఎక్కువ మంది ముమైత్‌కు వ్యతిరేకంగా ఉన్నట్టు కనిపిస్తున్నారు.

  తొలి ఎలిమినేటర్ ముమైతే కావొచ్చు..

  తొలి ఎలిమినేటర్ ముమైతే కావొచ్చు..

  ఇలాంటి కారణాలను అవకాశంగా చేసుకొని ముమైత్ ఖాన్‌ను బిగ్‌బాస్ నుంచి నిర్వహకులు తప్పించవచ్చు. ఒకవేళ ఇదే నిజమైతే తెలుగు బిగ్‌బాస్ నుంచి ఎలిమినేట్ అయిన తొలి సెలబ్రిటీ ముమైత్ కావడం తథ్యం. బిగ్‌బాస్ నుంచి బయటపడటం వలన నిర్వాహకులకు తలనొప్పి తగ్గుతుంది. అంతేకాకుండా ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించే కార్యక్రమంపైన మచ్చ పడకుండా చర్యలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది.

  తొలి ఎలిమినేటర్‌పై వారాంతంలో నిర్ణయం

  తొలి ఎలిమినేటర్‌పై వారాంతంలో నిర్ణయం

  రాష్ట్ర ఎక్సైజ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ శాఖ వెల్లడించిన సమాచారం ప్రకారం ముమైత్ ఈ నెల 21 తేదీన సిట్ ముందు విచారణకు హాజరుకావాల్సి ఉంటుంది. ప్రస్తుతం బిగ్‌బాస్ షోలో పాల్గొంటున్నందున కొన్ని రోజులు వెసలుబాటు ఇవ్వవచ్చు. ఈ షోలో ఎన్టీఆర్ శని, ఆదివారాల్లో మళ్లీ కనిపిస్తారు. ఈ సందర్భంగా తొలి ఎలిమినేటర్‌పై నిర్ణయం తీసుకొనే అవకాశం ఉంది.

  English summary
  Telugu Version of Bigboss started with High Note. Now first round of elimination on cards. Now Drug case is become sensational in Tollywood. Biggboss contestant Mumaith Khan facing allegations in Drug case. So her elimination may happen in this jucture.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more