పాపం...టీవీ షో కోసం ఆమె అష్టకష్టాలు

అందులో కూరగాయల వ్యాపారం ఒకటి. 'మూడు వారాలుగా ఈ వ్యాపారం చేస్తున్నా. మధ్యప్రదేశ్ అంతా తిరుగుతున్నాను. చానెల్ సిబ్బంది కూడా నా వెంటే ఉంటారు. ఇంతకుముం దు నిచ్చెనలు ఎక్కడం, బావుల్లోకి దూకడం, లిఫ్ట్ అడిగి ప్రయాణించడం, బట్టలు అమ్మడం వంటి పనులూ చేశాను' అని అంగీరా వివరించిం ది. ఈ పనులన్నీ చేయడం కష్టమే అయినా, ప్రయాణమంటే తనకెంతో ఇష్టమని తెలిపింది. మధ్యప్రదేశ్ ప్రజలు ఎంతో మంచి వారని, ఎక్కడికి వెళ్లినా బాగా చూసుకుంటున్నారని ప్రశంసించింది. అంగీరా టీవీ షోలో పాల్గొనడం మొదటిసారే అయినా ఇది వరకే ఆమె పలు సినిమాలకు సహాయ దర్శకురాలిగా పనిచేసింది.
మరిన్ని టీవీ షోలు, సినిమాల్లో పనిచేయాలని కోరుకుంటున్నట్టు చెప్పింది. బెగ్ బారో స్టీల్ షోకు అతిథేయిగా పనిచేస్తున్న ఆలియాఖాన్ అద్భుతమైన వ్యక్తి అని అంగీరా ప్రశంసించింది. 'ఆమెను ఇప్పటి దాకా కలుసుకోకున్నా షో చూసి ఎన్నో విషయాలు నేర్చుకున్నాను. ఆమెస్థాయిలో కాకపోయినా సాధ్యమైనంత బాగా చేయడానికి ప్రయత్నిస్తాను' అని నమ్మకంగా చెప్పింది. షోలో ఉండడం వల్ల సహనం, ప్రశాంతత అలవాడ్డాయని, ఒకప్పుడు తనకు విపరీతంగా కోపం ఉండేదని అంగీరా వివరించింది.


Click it and Unblock the Notifications











