Bigg Boss Telugu 7: బిగ్‌బాస్‌ ఇంట్లో దారుణ హత్య.. షోలోకి ఎంట్రీ ఇచ్చిన పోలీసులు.. అసలేం జరిగిందంటే?

బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 షో రసవత్తరంగా సాగుతోంది. రోజుకో రకమైన టాస్క్ ఇస్తూ బుల్లితెర ప్రేక్షకులను తెగ సర్ ప్రైజ్ చేస్తున్నారు బిగ్ బాస్ టీం నిర్వాహకులు. అయితే నిన్నటి వరకూ నామినేషన్స్ టాస్క్ తో హీటెక్కిపోయిన ఇంట్లో ఓ దారుణ హత్య జరిగింది. షో మధ్యలోనే ఇంట్లోకి పోలీసులు కూడా ఎంట్రీ ఇచ్చారు. ఇదంతా జరగడంతో కంటెస్టెంట్లు అందరూ తెగ టెన్షన్ పడుతున్నారు. అసలే జరిగింది, ఏం జరుగుతుందో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

తాజాగా విడుదల అయిన ప్రోమోలో మనం ఈ విషయాలను గుర్తించవచ్చు. ముందుగా బిగ్ బాస్ అంబటి అర్జున్, అమర్ దీప్ లను కాకుండా.. మిగతా ఇంటి సభ్యులందరినీ గార్డెన్ ఏరియాలోకి పిలుస్తారు. బిగ్ బాస్ పిలవడంతో పరుగులు పెట్టుకుంటూ వచ్చిన కంటెస్టెంట్లు.. గదిలోకి రాగానే తెగ ఎగ్జైట్ అయిపోతారు. అద్భుతమైన ఆహార పదార్థాలను డైనింగ్ డేబుల్ పై ఉంచడం చూసిన హౌస్ మేట్స్ ఫుల్ ఖుషీ అవుతారు. మీ అందరి కోసం బిగ్ బాస్ ఈరోజు లంచ్ పార్టీ ఏర్పాటు చేశారని.. ఫుల్లుగా ఎంజాయ్ చేయాలని చెబుతారు.

Murder in Bigg Boss Telugu 7 House And Police Investigations Strted Check Details Here

అయితే శివాజి, పల్లవి ప్రశాంత్, గౌతమ్ కృష్ణ, ప్రిన్స్ యావర్, అశ్విని, ప్రియాంక జైన్, శోభాశెట్టి, రతికా రోజ్.. లు డైనింగ్ టేబుల్ పై కూర్చొని తమకు నచ్చిన ఐటమ్స్ కడుపునిండా తింటారు. అయితే లివింగ్ ఏరియాలోనే ఉన్న అంబటి అర్జున్, అమర్ దీప్ లకు బిగ్ బాస్ అక్కడే ఎందుకు ఉంచారో కారణం చెబుతారు. మిమ్మల్ని ఇద్దరినీ ఇక్కడ ఉంచడానికి ఓ స్పెషల్ రీజన్ ఉందని బిగ్ బాస్ చెబుతారు. కానీ ఆ కారణం ఏంటో మాత్రం వివరించరు. ఇక ఆ తర్వాత డైనింగ్ టేబుల్ పై ఉన్న ఆహారాన్ని తినకుండా హౌస్ మేట్స్ అంతా వేచి చూస్తుంటారు. ఇంతలోనే రితాక... పెద్దయ్యా.. ఇందులో ఏం పేచీ లేదు కదా అని అడుగుతుంది. వెంటనే బిగ్ బాస్ రతికా మీరు ఓవర్ గా థింక్ చేస్తున్నారు.. పార్టీని ఎంజాయ్ చేయండని చెబుతారు.

దీంతో అర్జున్, అమర్ దీప్ తప్ప అంతా బిగ్ బాస్ ఇచ్చిన లంచ్ పార్టీని ఫుల్లుగా ఎంజాయ్ చేస్తారు. ఆ తర్వాత ఓ దెయ్యం అరిచిన కేక వినిపించగానే.. కంటెస్టెంట్లు అందరూ బయటకు పరిగెత్తుకుంటూ వస్తారు. ఈక్రమంలోనే బిగ్ బాస్.. మీరు పార్టీలో ఉన్న సమయంలో బిగ్ బాస్ ఇంట్లో ఓ దారుణ హత్య జరిగిందని వివరిస్తారు. చనిపోయింది మిస్సెస్ బిగ్ బాస్ అని కూడా చెప్పుకొస్తారు. ఆ తర్వాత స్టోర్ రూం బెల్ మోగగానే.. కుటుంబ సభ్యులంతా అక్కడకు పరిగెడతారు. ముందుగా వెళ్లిన రైతుబిడ్డ పల్లవి ప్రశాంత్ ఈ రూం డోర్ తీయగానే పోలీసులు కనిపిస్తారు.

Murder in Bigg Boss Telugu 7 House And Police Investigations Strted Check Details Here
అయితే ఆ పోలీసులు మరెవరో కాదు.. అంబటి అర్జున్, అమర్ దీప్ లు. వీరిద్దరే పోలీసుల గెటప్ లో ఎంట్రీ ఇస్తారు. అయితే మిస్సెస్ బిగ్ బాస్ ను హత్య చేసిందో ఎవరో కనిపెట్టే టాస్క్ ను బిగ్ బాస్ పోలీసుల చేతిలో పెట్టినట్లు అర్థం అవుతుంది. చూడాలి మరి ఏం జరగింది అనేది. ఇంట్లో ఎవరు ఈ హత్యకు పాల్పడ్డారు, పోలీసులు నిందితులను పట్టుకున్నారా లేదా అనేది తెలియాలంటే ఈరోజుటి పూర్తి ఎపిసోడ్ చూడాల్సిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X