Brahmamudi July 21st:ఎట్టకేలకు భార్యను పట్టేసుకున్న రాజ్.. పుట్టింటికి వెళ్తున్న కావ్య
బ్రహ్మముడి సీరియల్ ఈరోజు ఎపిసోడ్ కూడా ఆసక్తిగా సాగింది. కావ్య మీద రాజ్ మనసులో ప్రేమ మొదలు కావడంతో సీరియల్ ఇంట్రెస్టింగ్ గా మారుతోంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో కావ్య డిజైన్స్ వేస్తుండగా రాజ్ రెడ్ హ్యాండెడ్ గా పట్టేసుకున్నాడు. మరోవైపు అప్పుకి తెలీకుండానే కల్యాణ్ సాయం చేశాడు. ఇక ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందో వివరాల్లోకి వెళితే....
రాజ్ ప్రవర్తనతో అపర్ణ షాక్:కావ్యని అందరితో తిట్టించాలని చూసిన స్వప్నను రాజ్ రివర్స్ లో తిడతాడు. మీ చెల్లి ఎలాంటిదో ఈ ఇంట్లో మానానమ్మని అడిగినా చెప్తుంది. కలిసి పుట్టి పెరిగావ్ అర్థం చేసుకోలేవా అని రాజ్.. స్వప్నతో అంటాడు. నీ పెళ్లి కోసం నానా కష్టాలు పడినా గుర్తించవా... పెళ్లికి ముందే తొందరపడి మీ అమ్మానాన్నకి తలవంపులు తెచ్చినా ప్రతీ క్షణం నీ గురించే ఆలోచించింది. నీ పెళ్లి కోసం ప్రయత్నాలు చేసింది. అలాంటిది నీ గురించి పట్టించుకోదా? వినడానికే అసహ్యంగా ఉందని తిడతాడు. రాజ్ ప్రవర్తనతో అపర్ణ ఆశ్చర్యపోతుంది. కావ్య మీద నిందలు వేయడం కరెక్ట్ కాదని ఇంద్రాదేవి అంటుంది.

ఫోన్లపై ఇంద్రాదేవి వార్నింగ్... :మరోవైపు కళ్యాణ్ అప్పుకి సాయం చేసే పనిలో ఉంటాడు. అప్పు పిజ్జా డెలివరీ చేస్తూ ఉంటే కళ్యాణ్ వెనుకాలే ఫాలో అవుతూ ఉంటాడు. పిజ్జా డెలివరీ చేసిన ప్రతి చోట టిప్ ఎక్కువగా ఇస్తూ ఉంటారు. సీన్ కట్ చేస్తే... డైనింగ్ టేబుల్ దగ్గర భోజనం చేసేందుకు కూర్చున్న ప్రతీ ఒక్కరూ ఫోన్లు చూస్తూ ఉండటం చూసి ఇంద్రాదేవి సీరియస్ అవుతుంది. తినడానికి వచ్చి ఏం చేస్తున్నారని తిడుతుంది. ఫోన్లు చూస్తున్నారని క్లాస్ పీకుతుంది. ఇంకోసారి భోజనం చేసేటప్పుడు ఫోన్ ఎవరి చేతిలో చూసిన పగలగొడతానని వార్నింగ్ ఇస్తుంది. అమ్మమ్మ మాటలని కావ్య మెచ్చుకుంటుంది.

అప్పును మెచ్చుకున్న కృష్ణమూర్తి.. :మరోవైపు కనకం అప్పు కోసం కంగారుగా వెయిట్ చేస్తూ ఉంటుంది. అప్పుడే కూతురు రాగానే తన మీద అరుస్తుంది. పెద్దమ్మ టెస్ట్ ల కోసం ఉంచమని అప్పు డబ్బులు తల్లి చేతికి ఇస్తుంది. తండ్రి భారాన్ని తగ్గించాలని కష్టపడుతున్న నిన్ను చూస్తుంటే గర్వంగా ఉందని కనకం మెచ్చుకుంటుంది. కూతురిగా అన్ని చేస్తున్నావని కృష్ణమూర్తి కూడా అభినందిస్తాడు. కావ్య ఎప్పటిలాగానే రాజ్ నిద్రపోయాడో లేదో చూసి మెల్లగా డిజైన్స్ వేసేందుకు కిందకి వెళ్తుంది. కావ్య ఉన్నప్పుడు నిద్రపోయినట్టు నటిస్తాడు. ఇక డిజైన్స్ వేయడానికి పేపర్స్ తీసుకుని మెల్లగా కావ్య వెళ్ళడం ఒంటి కన్నుతో రాజ్ గమనిస్తూనే ఉంటాడు. తను గదిలో నుంచి బయటకి వెళ్ళగానే ఈరోజు ఎలాగైనా రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోతుంది లేకపోతే నాతోనే దోబూచులాడుతుందా అనుకుని కిందకి వస్తాడు.

కావ్యను పట్టేసుకున్న రాజ్... :రాజ్ కిందకి వచ్చి ఇంట్లో కావ్య ఏ మూలన దాక్కుందా అని చూస్తూ ఉండగా సోఫా వెనుక కూర్చుని ఉంటుంది. మెల్లగా వెళ్ళి సోఫా మీద కూర్చుని కావ్యకి ఎరేజర్ అందిస్తూ ఉంటాడు. కాసేపటికి కావ్య రాజ్ ని చూస్తుంది. హాయ్ శిరీష చూస్తావే.. డిస్ట్రబ్ చేశానా గీసుకో అంటాడు రాజ్. మీరు నిద్రపోలేదా అని కావ్య అంటుంది. లేదు నువ్వు నా ముక్కు మీద చీర కొంగు పెట్టినప్పుడు కూడ మేల్కొని ఉన్నాను. నా దగ్గర ఎందుకు దాచావు. అంటే ఏంటి నీ ఉద్దేశం, నేను కళలని గుర్తించనని, నేను కళాకారులని గుర్తించనని.. నాతో చెప్తే నీకు గుర్తింపు రాదని అనుకున్నావ్ అంతే కదా అని అంటాడు రాజ్. అవును అంటుంది కావ్య. దీనితో ఎపిసోడ్ ముగుస్తోంది.
తర్వాత ఎపిసోడ్లో రాజ్ లేవడం కంటే ముందే కావ్య అన్ని పనులు చేసి పెడుతుంది. తర్వాత.. ఇంట్లో వాళ్ల దగ్గర అమ్మవాళ్ల ఇంటికి వెళ్లిరావొచ్చా అని పర్మిషన్ తీసుకుంటుంది. పంపిద్దాం మమ్మి అని రాజ్ అంటాడు. కారులో వెళ్తుండగా.. కావ్యకు రాజ్ మల్లెపూలు కొనిస్తాడు. దీంతో కావ్య సంబరపడిపోతుంది.


Click it and Unblock the Notifications











