Brahmamudi October 10th: భర్త అంటే అలా ఉండాలన్న మూర్తి... ఇక రాజ్ రహస్యం అందరికీ తెలిసిపోనుందా... ?

బ్రహ్మముడి సీరియల్ రోజు రోజుకు ఆసక్తి కలిగిస్తోంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో కావ్య కనిపించకుండా పోవడం చూసి రాజ్ అండ్ ఫ్యామిలీ అంతా వెతుకుతుంది. ఈ విషయం తెలుసుకున్న కనకం... దుగ్గిరాల ఇంటికి వచ్చి అందరినీ నిలదీస్తుంది. కావ్యను ఏం చేశారు.. మీరు ఏం అన్నారు.. ఎందుకు వెళ్లిపోతుంది అంటూ ప్రశ్నల వర్షం కురిపిస్తుంది. అయితే అసలు కావ్య దొరుకుతుందా.. ఏం జరిగిందో ఈ ఎపిసోడ్ చదివితెలుసుకుందాం.

కావ్య కనిపించకపోవడంతో రాజ్ అండ్ ఫ్యామిలీ అంతా వెతుకే పనిలో పడతారు. ఈ విషయం తెలుసుకున్న కనకం... కావ్య గురించి టెన్షన్ పడుతూ ఉంటుంది. స్నేహితురాలి ఇంటికి వెళ్లొచ్చాని మూర్తి చెబుతాడు. ఇక కనకం కావ్య ఫ్రెండ్స్ కు ఫోన్ చేస్తుంది. కావ్య గురించి అడిగితే.. పెళ్లి తర్వాత అసలు మాకు కంటాక్ట్ లో లేదని చెబుతారు. ఇక కనకం మరింత టెన్షన్ పడుతుంది. ఇక మరోవైపు కల్యాణ్.. రాహుల్ కు కాల్ చేస్తాడు. ఇక రాహుల్.. కావ్య కోసం వెతుకుతున్నట్లు యాక్టింగ్ చేస్తాడు.

Murthy Kanakam Fires on Duggirala Family in October 10th 2023 Episode number 223 in Brahmamudi Telugu Serial

ఇక కావ్య ఓ గుడిలో కూర్చొని ఉంటుంది. తను రాజ్ తో గడిపిన జ్ఞాపకాలను తలుచుకుంటూ కూర్చుంటుంది. మరోవైపు రాజ్, కల్యాణ్, సుభాష్, ప్రకాశ్.. కావ్య కోసం రాత్రంతా వెతుకుతూనే ఉంటారు. తెల్లవారు అవుతుంది. రాహుల్, కల్యాణ్ ఇంట్లోకి వస్తారు. ఇందిరా దేవి ఏమైనా తెలిసిందా అంటే.. మొత్తం వెతికాం ఎక్కడ కనబడలేదని కల్యాణ్ చెబుతాడు. ఇక సుభాష్, ప్రకాష్ వస్తారు. వారిని అడిగినా.. అదే సమాధానం చెబుతారు. లేదమ్మా.. ఎక్కడ కనిపించలేదు అని ఇందిరాదేవికి సుభాష్ చెబుతాడు.

పోనీ వాళ్ల అమ్మ ఇంటికి వెళ్లారా అని అపర్ణ అడుగుతుంది. అక్కడికి వెళ్లి అడుగుదామంటే.. వాళ్లు కంగారు పడతారని వద్దని రాజ్ చెప్పాడు అని సుభాష్ చెప్తాడు. ఇక రాజ్ కూడా ఇంట్లోకి వస్తాడు. కావ్య గురించి అడిగితే.. అన్ని చోట్ల వెతికాను అంటాడు రాజ్. దొరకలేదని చెప్తాడు. ఇక రుద్రాణి.. రాహుల్ నువ్వేమైనా చేశావా అని అడిగితే నాకేం తెలియదు మమ్మీ అంటాడు. ఇక కనకం ఇంట్లోకి వచ్చి...ఏమైంది.. కావ్య కనిపించడం లేదట.. ఎందుకు ఏమైందీ అని అడుగుతుంది. దానికి అపర్ణ తెలీదు అని చెబుతుంది.

ఏమైందో తెలియాదా.. ఎక్కడికి వెళ్లిందో తెలియాదా.. అని కనకం అడుగుతుంది. నిజంగానే వెళ్లిపోయిందని చెబుతుంది ధాన్యం. ఎవరితో గొడవపడలేదు.. కానీ రాత్రి నుంచి కనబడటం లేదు అని అపర్ణ చెబుతుంది. ఇక స్వప్న మొద్దులా నిద్రపోతుంది. ఇక కనకం కోపంతో వచ్చి స్వప్నను తిడుతుంది. కావ్య కనబడకుండా పోతే కనీసం చెప్పవా అంటూ ఫైర్ అవుతుంది. నువ్వు కనబడకుండా పోతే.. కావ్య ఎంతలా వెతికిందో తెలుసా... కనీసం ఫోన్ చేసి కూడా చెప్పావా అంటూ స్వప్నపై ఫైర్ అవుతుంది.

మరోవైపు మూర్తి కూడా ఏడుస్తూ స్వప్నను అడుగుతాడు. నాకు తెలియదు నాన్న అని స్వప్న చెబుతుంది. బాబు నా కూతరు కావ్య కనిపించడం లేదు.. అన్నిపూజలు బాగానే జరుపుకుంది. నిజం చెప్పు బాబు నా కూతుర్ని ఏం చేశావ్ అంటూ రాజ్ ను కనకం నిలదీస్తుంది. ఇక్కడ అంత కసాయి మనుషులు లేరు అని అపర్ణ అంటుంది. దానికి జవాబు చెప్పే మనుషులు కూడా లేరు అని అంటుంది కనకం. ఇక నా కూతురు నాకు కావాలి అంటూ ఏడుస్తుంది.

అసలు నా కూతురు ప్రాణాలతో ఉందా.. ఏదైనా అఘాయిత్యం చేసుకుందా అంటూ కనకం ప్రశ్నిస్తుంది. అందరిని ఎందుకు అడుగుతావ్ కనకం.. ఈ పెద్ద మనిషి ఉన్నాడు కదా ఆయన్నే అడుగుదామని సుభాష్ ను ఉద్దేశించి మూర్తి చెప్తాడు. ఆనాడు తండ్రి స్థానంలో ఉంటానంటూ మీరే ఇంట్లోకి తీసుకువచ్చారు.. మీ కూతురు స్థానంలో ఉన్న నా కూతురు ఏమై పోయింది.. అని నిలదీస్తాడు మూర్తి. భయపడకండి కావ్యకు ఏం కాదు అని సుభాష్ చెప్తాడు.

ఎలా వెళ్లిపోతుంది.. అంటూ కనకం ఏడుస్తూ ఉండగా... రాజ్.. దయచేసి అపార్థం చేసుకోండి అంటూ సర్ది చెప్తాడు. ఈ ఇంటికి ఆడపిల్లలను ఇస్తే... ఆ మాత్రం భార్యల్ని కాపాడుకోలేని వాళ్లా నా అల్లుల్లు అంటూ మూర్తి అంటాడు. నా పెద్ద కూతురిని ఎవడో రెండు సార్లు ఎత్తుకు పోయారు.. అప్పుడు ఏం చేయలేకపోయారు. ఇప్పుడు చిన్న కూతురు అదృశ్యమైంది ఇప్పుడు ఏం చేయలేకపోతున్నారు... భర్త అంటే రక్షకుడిగా ఉండాలి అంటూ మూర్తి ఆవేదన చెందుతాడు. కానీ ఈ ఇంట్లో ఆడపిల్లకు రక్షణ లేకుండాపోయింది అంటూ మూర్తి అంటాడు.

ఇక చాలు ఆపండి అంటూ రుద్రాణి రెచ్చిపోతుంది. ఎవరు ఎవరికి చెప్పకుండా ఎవరు వెళ్లరు. మీరెంత భాద పడుతున్నారో మా ఇంట్లో వాళ్లు అంతే బాధ పడుతున్నారు... వెళ్లి కేసు పెట్టండి అంటూ చెప్తుంది. ఇక సీతారామయ్య రుద్రాణిపై ఫైర్ అవతుున్నారు. కన్న ప్రేమతో నిలదీస్తే..మన దగ్గర జవాబు లేదని చెప్పగలం కానీ.. మనం జవాబుదారీ కాదు అని చెప్పవద్దు అంటూ చెప్తాడు. ఇక ఇందిరాదేవి కూడా వారికి సర్ది చెప్పే ప్రయత్నం చేస్తుంది. కావ్యను వెనక్కి తీసుకువస్తాం అంటారు. ఎపిసోడ్ ముగుస్తోంది.

ఇక తదుపరి ఎపిసోడ్ లో... కావ్య ఓ గుడిలో ఉండటాన్ని సీతారామయ్య, ఇందిరాదేవి చూస్తారు. ఇక్కడ ఉన్నావేంటమ్మా అంటారు. ఇక రాజ్ రాసిన చీటిని చూపిస్తుంది. ఇక ఇంటికి వస్తుంది కావ్య. అపర్ణ ఎందుకు వెళ్లావ్.. ఎక్కడికి వెళ్లావ్ అంటూ నిలదీస్తుంది. నేను చెప్తాను అంటూ సీతారామయ్య అంటాడు. ఇక ఏం చెప్పనున్నాడో రేపటి ఎపిసోడ్ లో చూడాల్సిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X