Bigg Boss7 స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ వద్ద శిష్యరికం.. తెలుగులో అనేక సినిమాలకు సంగీతం.. ఎవరీ Bhole Shavali?

బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 సెప్టెంబర్ 3 న ప్రారంభం అవ్వగా.. ఇక ఐదో వారంలో బిగ్ బాస్ 2.ఓ అట్టహాసంగా ప్రారంభం అయింది. ఇక అక్కినేని నాగార్జున హోస్టుగా వ్యవహారిస్తున్న ఈ షోకు సంబంధించిన ఈవెంట్ ఎంతో ఆసక్తికరంగా సాగింది. ఇక ఐదు వారాలు గడవగా.. ఈ షో రసవత్తరంగా సాగుతోంది. ఇప్పటికే వైల్డ్ కార్డు ద్వారా అర్జున్ అంబటి, అశ్విని శ్రీ ఎంటర్ అయ్యారు. ఇప్పుడు మరో వ్యక్తి భోలే షావలి ఎంటర్ అయ్యారు. అయితే బిగ్ బాస్ హౌజ్ లోకి ఎంట్రీ ఇచ్చిన భోలే షావలి ఎవరు.. ఆయన గురించి కొన్ని ఆసక్తికరమైన అంశాలు తెలుసుకుందాం.

భోలే షావలి గురించి చాలా మందికి తెలియదు. ఆయన సంగీత దర్శకుడు అంతే కాదు సాంగ్ రైటర్, సింగర్. తెలుగులో ఎన్నో సినిమాలకు సంగీతం అందించారు. భోలే షావలి ఫిబ్రవరి 1, 1982న తెలంగాణ రాష్ట్రంలోని మహబూబాబాద్ జిల్లా, పెనుగొండ గ్రామంలో జన్మించారు. సంగీతంపై ఆసక్తిపై ఈ రంగంలోకి అడుగుపెట్టారు. వరంగల్‌లోని ప్రతిష్టాత్మకమైన కాకతీయ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ సైన్స్ లో విద్యాభ్యాసం పూర్తి చేశారు.

Music Composer, Singer Bhole Shavali into Bigg Boss 7 Telugu 2.O: Here are the personal,Professional Details

భోలే షావలి... మొదటిసారిగా హైదరాబాద్‌కు వచ్చినప్పుడు ప్రఖ్యాత సంగీత దర్శకుడు చక్రి వద్ద శిష్యరికం చేశారు. చక్రీ వద్ద ఎన్నో నైపుణ్యాలను నేర్చుకుననారు. భోలేకు హిందీ, జానపద సంగీతంపై ఉన్న మక్కువ సంగీతకారుడిగా చేసింది. ఆ నమ్మకంతోనే ముంబైకి వెళ్లి... సంగీత కంపోజిషన్‌లో శిక్షణ తీసుకున్నారు.

ప్లేబ్యాక్ సింగర్ గా కూడా ఎన్నో పాటలు పాడారు. "పిల్ల దొరికితే," "4 బాయ్స్," "ఇకా సే లవ్," "ది బెల్స్," "కిక్ 2," వంటి చిత్రాలలో పాటలు పాడారు. ఆయన గానం, భావోద్వేగంతో ప్రేక్షకులను ఆకర్షించారు. భోలే.. లిరిక్ రైటర్ గా కూడా మారారు. అతను "యమహో యమ," "బంతి పూల జానకి," "ధనలక్ష్మి తలుపు తడితే" వంటి పాటలకు సాహిత్యం కూడా రాశారు.

Music Composer, Singer Bhole Shavali into Bigg Boss 7 Telugu 2.O: Here are the personal,Professional Details

బోనాలు, బతుకమ్మ వంటి పండుగల సారాన్ని సంగ్రహించి పాటలు రాయడానికి భోలే తన కళాత్మక ప్రతిభను ఉపయోగించేవారు. అతని సంగీతం ఆనందంతో ముడిపడి ఉంటుంది. భోలే షావలికి ఓ య్యూటుబ్ ఛానెల్ కూడా ఉంది. "భోలే అఫీషియల్" పేరుతో ఉంటుంది. ఇది సంగీత ప్రియుల అలరించడంలో ముందుంటుంది. భోలే షావలి మ్యూజిక్ డైరెక్టర్ గా ... "మిస్టర్ హోమానంద్," "కృష్ణారావు హైపర్ మార్కెట్," "క్రేజీ అంకుల్స్" వంటి చిత్రాలకు పని చేశారు.

ఇప్పుడు ఈ సంగీత దర్శకుడు, లిరిక్ రైటర్, సింగర్ బిగ్ బాస్ లోకి అడుగుపెట్టారు. తన పాటలతో ఆలరించే బోలే షావలి బిగ్‌బాస్ మనసు దోచుకొన్నారు. దాంతో అతనికి బిగ్‌బాస్‌ తెలుగు 7 సీజన్‌లో పాల్గొనే ఆఫర్ లభించింది. తెలుగు ఫిల్మి బీట్ నుంచి భోలే షావలికి ఆల్ ది బెస్ట్.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X