టీవీ నటిని బాత్రూంలోకి ఈడ్చుకెళ్లి హింసించిన భర్త.. పోలిసుల చేతికి వీడియో!
నటి అదితి గోవిత్రికర్ నటించిన ఏకైక తెలుగు చిత్రం తమ్ముడు. ఈ చిత్రం తర్వాత అదితి మరో తెలుగు సినిమాలో నటించలేదు. తాజాగా అదితి సోదరి అర్జూ గోవిత్రికర్ వార్తల్లో నిలిచింది. నాగిన్ లాంటి పలు టివి సీరియల్స్ తో అర్జూ బుల్లితెర నటిగా గుర్తింపు తెచ్చుకుంది. తాజా అర్జూ తన సోదరి అదితి గోవిత్రికర్ తో కలసి వెళ్లి పోలీస్ స్టేషన్ లో తన భర్తపై గృహహింస కేసు నమోదు చేసింది. తన భర్త సిద్దార్థ్ సబర్వాల్ పై అర్జూ సాక్ష్యాధారాలతో సహా ముంబైలోని వర్లీ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది.

ఎనిమిదేళ్లుగా
తన భర్త సిద్ధార్థ్ గత ఎనిమిదేళ్లుగా మద్యం సేవించి వచ్చి తనని హింసకు గురి చేస్తున్నట్లు అర్జూ తన కంప్లైంట్ లో పేర్కొంది. ఐదేళ్ల నుంచి భర్తకు దూరంగా వర్లీలోని ఓ అపార్ట్మెంట్ లో ఉంటున్నట్లు తెలిపింది. కానీ సిద్దార్థ్ తరచుగా వస్తూ తన కుమారుడిని తీసుకెళ్ళిపోతున్నాడని, ఈ క్రమంలో శారీరక దాడికి పాల్పడుతున్నట్లు అర్జూ పేర్కొంది. ఓ సందర్భంలో తన భర్త తనపై దాడి చేసిన వీడియోని కూడా అర్జూ పోలీసులకు ఇచ్చింది.

బాత్రూంలోకి ఈడ్చుకెళుతూ
ఇది సిసి టివిలో రికార్డ్ అయిన వీడియో. అర్జూ పోలీసులకు అందించిన సిసి టివి వీడియో అంత క్లియర్ గా లేదు. కానీ అర్జూని ఆమె భర్త చెంపదెబ్బ కొట్టి బాత్రూంలోకి ఈడ్చుకెళుతున్న దృశ్యాలు ఉన్నట్లు పోలీసులు వివరించారు. ఈ ఘటన ఫిబ్రవరి 15న జరిగినట్లు అర్జూ తన ఫిర్యాదులో పేర్కొంది. ఈ ఘటన తెల్లవారుజామున 4 గంటలకు జరిగిందని.. ఆ సమయంలో సిద్దార్థ్ మద్యం సేవించి ఉన్నాడని పేర్కొంది.

టీవీ షో కోసం
ఈ వీడియో గురించి సిద్దార్థ్ నమ్మశక్యంగా లేని వాదన వినిపిస్తున్నాడు. ఆ రోజు అర్జూ టివి షో కోసం రిహార్సల్స్ చేస్తోందని,ఆ అందులో భాగంగానే ఆమె కొట్టమంటేనే చెంపదెబ్బ కొట్టినట్లు సిద్ధార్థ్ చెబుతున్నాడు. తన ఐదేళ్ల కొడుకుని నా నుంచి దూరం చేసేందుకు కిడ్నాప్ కి కూడా ప్రయత్నిస్తున్నాడని అర్జూ ఆరోపించింది. తన కుటుంబాన్ని మొత్తాన్ని చంపుతానని బెదిరింపులకు దిగుతున్నట్లు కూడా అర్జూ పేర్కొంది.

కేసు నమోదు
దీనితో అర్జూ ఇచ్చిన ఫిర్యాదు మేరకు సెక్షన్ 498 ఏ, 323, 504 కింద కేసు నమోదు చేశారు. పూర్తి స్థాయిలో సిద్దార్థ్ ని విచారించేందుకు రంగంలోకి దిగుతున్నారు. తన సోదరి అదితి గోవిత్రికర్, సహ నటుడు ఆశిష్ చౌదరితో కలసి ఫిర్యాదు చేసిన అనంతరం అర్జూ మీడియాతో మాట్లాడేందుకు ఇష్టపడలేదు. మేరె బాప్ పీలే ఆప్, నాగిన్ లాంటి టివి షోలలో అర్జూ గోవిత్రికర్ నటించింది. మోడలింగ్ లో కూడా రాణించింది.


Click it and Unblock the Notifications











