పబ్లిక్‌ ప్లేస్‌లో సీరియల్ హీరోయిన్ రొమాన్స్: ఫ్యాన్స్ తట్టుకోనంత దారుణంగా!

ఇండియా వ్యాప్తంగా చాలా భాషల్లో వచ్చే సీరియళ్లకు భారీ ఆదరణ దక్కుతూ ఉంటుంది. అంతేకాదు, అందులో నటించే వాళ్లకు అభిమానులు కూడా భారీ స్థాయిలోనే ఉంటుంటారు. అలా చాలా కాలం క్రితమే నేషనల్ రేంజ్‌లో పాపులర్ అయిన సీరియల్ హీరోయిన్లలో మౌనీ రాయ్ ఒకరు. డబ్బింగ్ సీరియళ్ల ద్వారా దక్షిణాదిలోనూ పేరు సంపాదించుకున్న ఈ భామ.. వరుస ఆఫర్లతో సత్తా చాటుకుంది. దీంతో రెట్టించిన ఉత్సాహంతో ప్రాజెక్టులను పట్టాలెక్కిస్తోంది. అదే సమయంలో సోషల్ మీడియాలోనూ సందడి చేస్తోంది. ఇందులో భాగంగానే తాజాగా తన భర్తతో మౌనీ రాయ్ రొమాంటిక్‌గా తీసుకున్న కొన్ని ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసింది. ఇంకెందుకు ఆలస్యం? వాటిపై మీరూ లుక్కేయండి మరి!

Recommended Video

Ante Sundaraniki Movie Genuine Review *Reviews | Telugu Filmibeat
సినిమా ఎంట్రీ.. సీరియళ్లతో క్రేజ్

సినిమా ఎంట్రీ.. సీరియళ్లతో క్రేజ్

మోడల్‌గా ఓ వెలుగు వెలుగుతోన్న సమయంలోనే మౌనీ రాయ్.. 2004లో 'రన్' అనే మూవీలో స్పెషల్ సాంగ్ చేయడం ద్వారా తెరంగేట్రం చేసింది. ఆ తర్వాత 'క్యూకీ సాస్ బీ కబీ బహు తీ' అనే సీరియల్‌తో బుల్లితెరపైకి వచ్చింది. ఇది హిట్ అవడంతో.. తర్వాత 'కసో నా యార్ హై', 'కస్తూరి', 'దో సహేలియాన్', 'దేవాన్ కే దేవ్ మహాదేవ్' వంటి వాటితో క్రేజ్ పొందింది.

మౌనీ జీవితాన్నే మార్చిన నాగిన్

మౌనీ జీవితాన్నే మార్చిన నాగిన్

తన నటనా ప్రయాణంలో మౌనీ రాయ్ ఎన్నో సీరియళ్లు చేసింది. అందులో 'నాగిన్' మాత్రం ప్రత్యేకంగా నిలిచింది. మూడు సీజన్ల పాటు ప్రసారం అయిన ఈ సీరియల్‌లో ఆమె లీడ్ రోల్‌ చేసింది. ఇది ఇండియాలోని చాలా భాషల్లో డబ్బింగ్ అయింది. ఇక, తెలుగులోనూ ఈ సీరియల్ సూపర్ హిట్ అయింది. ఇలా దీనితో నేషనల్ రేంజ్‌లో మౌనీ రాయ్‌ గుర్తింపు దక్కించుకుంది.

సినిమాలే కాదు... వాటిలో కూడా

సినిమాలే కాదు... వాటిలో కూడా


సీరియల్ నటిగా ఎనలేని గుర్తింపును అందుకున్న మౌనీ రాయ్.. తన ప్రయాణంలో పలు చిత్రాల్లోనూ నటించింది. 'హీరో హిట్లర్ లవ్' అనే చిత్రంలో హీరోయిన్‌గా నటించింది. దీని తర్వాత 'గోల్డ్' అనే హిందీ మూవీలోనూ చేసింది. అలాగే, 'రోమియో అక్బర్ వాల్టర్', 'మేడ్ ఇన్ చైనా' వంటి మూవీల్లో మెరిసింది. అలాగే, మ్యూజిక్ ఆల్బమ్‌లు, వెబ్ సిరీస్‌లతో ఫేమస్ అయింది.

ప్రేమ పెళ్లి... భర్తతో కలిసి రచ్చ

ప్రేమ పెళ్లి... భర్తతో కలిసి రచ్చ

సుదీర్ఘమైన సినీ, బుల్లితెర ప్రయాణంలో మౌనీ రాయ్ లవ్ ఎఫైర్ల గురించి ఎన్నో రకాల వార్తలు వచ్చాయి. అయితే, ఇటీవలే ఆమె సూరజ్ నంబియార్ అనే వ్యక్తితో డేటింగ్ చేసింది. ఈ క్రమంలోనే ఇటీవలే అతడిని పెళ్లి చేసుకుంది. సూరజ్‌తో ఏడడుగులు నడిచిన తర్వాత మౌనీ మరింత ఉత్సాహంగా కనిపిస్తోంది. తరచూ భర్తతో కలిసి వెకేషన్లకు వెళ్తూ తెగ ఎంజాయ్ చేస్తోంది.

సోషల్ మీడియాలో యమ బిజీ

సోషల్ మీడియాలో యమ బిజీ

వరుస పెట్టి సీరియళ్లు, సినిమాలు, షోలు, వెబ్ సిరీస్‌లు చేస్తూ కెరీర్ పరంగా ఫుల్ బిజీగా గడుపుతోన్నప్పటికీ.. మౌనీ రాయ్ సోషల్ మీడియా ద్వారా ఫ్యాన్స్‌తో నిత్యం టచ్‌లోనే ఉంటోంది. ఇందులో భాగంగానే ఎప్పుడూ ఏదో ఒక అప్‌డేట్ ఇస్తోంది. మరీ ముఖ్యంగా తనకు, తన కెరీర్‌కు సంబంధించిన ఎన్నో విషయాలను ఫాలోవర్లతో పంచుకుంటూ తెగ సందడి చేసేస్తోంది.

అందాలను ఆరబోస్తోన్న మౌనీ

అందాలను ఆరబోస్తోన్న మౌనీ

ఎన్నో ఏళ్లుగా సోషల్ మీడియాలో సందడి చేస్తోన్న మౌనీ రాయ్.. ఎక్కువగా ఇందులో అందాలను ఆరబోస్తోంది. మరీ ముఖ్యంగా హాట్ హాట్ వీడియోలు, ఫొటోలు షేర్ చేస్తోంది. దీంతో ఈ అమ్మడు నిత్యం హైలైట్ అవుతోంది. ఫలితంగా మౌనీ రాయ్ దేశ వ్యాప్తంగా ఫేమస్ అయిపోతోంది. అలాగే, ఈ మధ్య కాలంలో ఈ బ్యూటీ తన గ్లామర్‌తో ఇంటర్నెట్‌ను షేక్ చేసి పడేస్తోంది.

రొమాంటిక్ ఫొటోలు వదిలింది

రొమాంటిక్ ఫొటోలు వదిలింది


మౌనీ రాయ్ తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో కొన్ని హాట్ ఫొటోలను షేర్ చేసింది. వీటిలో ఆమె ఎద అందాలు కనిపించేలా డ్రెస్ వేసుకుని ఉంది. పైగా పక్కనే ఉన్న భర్తతో పబ్లిక్ ప్లేస్‌లోనే రొమాన్స్ చేసేస్తోంది. దీంతో మౌనీ రాయ్ షేర్ చేసిన ఈ ఫోటోలకు నెటిజన్ల నుంచి భారీ స్థాయిలో స్పందన దక్కుతోంది. ఫలితంగా ఇవన్నీ తక్కువ సమయంలోనే వైరల్ అయిపోయాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X