పెళ్లికూతురైన నాగిని.. హల్దీ, మెహందీ వేడుకల్లో ముద్దులు, మురిపాలు.. ట్రెండింగ్‌గా ఫోటోలు
టెలివిజన్ నటి, నాగిని సీరియల్ ఫేమ్, బాలీవుడ్ హీరోయిన్ మౌనీ రాయ్ పెళ్లికూతురైంది. ఆమె పెళ్లికి సంబంధించిన వేడుకలు మీడియాలో వైరల్ అవుతున్నాయి. పెళ్లి వేడుకలో భాగంగా జరిగే హల్దీ, మెహందీ, సంగీత్‌కు సంబంధించిన వేడుకలు ఘనంగా మొదలయ్యాయి. ఈ వేడుకలకు బాలీవుడ్ ప్రముఖులతోపాటు స్నేహితుల, సన్నిహితులు, వ్యాపార, రాజకీయ వర్గాలు హాజరవుతున్నారు. ఈ వేడుకలకు సంబంధించిన వివరాల్లోకి వెళితే..

నాగిన్ సీరియల్‌తో పాపులారిటీ
మౌనీ రాయ్ వ్యక్తిగత, ప్రొఫెషనల్ విషయానికి వస్తే.. రన్ చిత్రం ద్వారా బాలీవుడ్‌లోకి ప్రవేశించింది. ఆ తర్వాత గోల్డ్, కేజీఎఫ్: చాప్టర్ 1, లండన్ కాన్ఫిడెన్షియల్ చిత్రాల్లో నటించింది. ఇక టెలివిజన్ రంగంలో క్యోంకి సాస్ బీ కబీ బహుతీ, నాగిన్, నాగిన్ 2 సీరియల్స్‌తో మంచి పాపులారిటిని సంపాదించింది.

స్నేహితుడు సూరజ్‌తో అఫైర్
మౌనీ రాయ్ అఫైర్ విషయానికి వస్తే.. కొద్దికాలంగా తన స్నేహితుడు సూరజ్ నంబియార్‌తో డేటింగ్ చేస్తున్నారు. ఇటీవలే తన అఫైర్ గురించి మీడియాకు బహిరంగంగా వెల్లడించింది. దాంతో అప్పటి వరకు వస్తున్న రూమర్లకు బ్రేక్ పడింది. అయితే తాము త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నామని మీడియాకు చెప్పడం క్రేజీగా మారింది. మౌనీ రాయ్, సూరజ్ కుటుంబంలోని ఇరు పక్షాలను ఒప్పించడంతో వారి పెళ్లికి గ్రీన్ సిగ్నల్ పడింది.

గోవాలో జనవరి 27న పెళ్లి
మౌనీ రాయ్, సూరజ్ నంబియార్ పెళ్లి వేడుకకు గోవా వేదికగా మారింది. జనవరి 27న మౌనీ రాయ్ పెళ్లి ఓ ప్రైవేట్ రిసార్టులో జరుగనున్నది. ఈ పెళ్లి వేడుకను ప్రైవేట్ కార్యక్రమంగా మార్చడంతో కొద్ది మంది సన్నిహితులు, కుటుంబ సభ్యులు కోవిడ్ ప్రోటోకాల్స్‌ను పాటిస్తూ హాజరవుతున్నారు. గోవాకు పెళ్లి కోసం వెళ్లుండగా వారిద్దరూ ముంబై ఎయిర్‌పోర్టులో మీడియాకు కలిసి కనిపించడంతో వారి పెళ్లి వార్తకు బలం చేకూరింది.

పుష్పలోని శ్రీవల్లి పాటకు స్టెప్పులు
పెళ్లి కార్యక్రమంలో భాగంగా జరిగిన హల్దీ వేడుకలో పసుపు పచ్చ లహెంగా ధరించి మరింత ఆకర్షణీయంగా కనిపించింది. ఈ వేడుకలో అల్లు అర్జున్ నటించిన పుష్ప చిత్రంలోని శ్రీవల్లి పాటకు అతిథులతో కలిసి మౌనీరాయ్, సూరజ్ కలిసి స్టెప్పులు వేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా మారింది.

హల్దీ, మెహందీ వేడుకల్లో
పెళ్లి వేడుకలో మౌనీ రాయ్, సూరజ్ జంట ప్రత్యేక ఆకర్షణగా మారింది. పెళ్లి వేడుకల్లో మౌనీ రాయ్ చెంపపై ముద్దు పెట్టిన ఫోటో ఇప్పుడు మీడియాలో విస్తృతంగా చక్కర్లు కొడుతున్నది. హల్దీ, మెహందీకి సంబంధించిన ఫోటోలను తమ స్నేహితులు ప్రతీక్, రాహుల్ శెట్టి షేర్ చేశారు. ఈ వేడుకల్లో నటి మందిరా బేడీ కూడా పాల్గొన్నారు. నూతన వధూవరులకు శుభాకాంక్షలు అందిస్తూ కనిపించారు.

హిల్టన్ రిసార్టు వేదికగా
ఇక జనవరి 27వ తేదీన జరగనున్న మౌనీ రాయ్ పెళ్లి కోసం గోవాలోని హిల్టన్ రిసార్ట్ ముస్తాబైంది. కండోలియంకు సమీపంలోని సైపెమ్ హిల్స్‌లోని హోటల్‌లో టెర్రస్‌ను అందంగా తీర్చిదిద్దారు. నెరుల్ నది పక్కనే ఉన్న జలపాతాలు, సరస్సుల మధ్య పెళ్లి మంటపం ఆహ్లాదకరంగా కనిపించింది.
Recommended Video

మలయాళ, బెంగాళీ పెళ్లి సంప్రదాయం ప్రకారం..
మౌనీ రాయ్, సూరజ్ నంబియార్ పెళ్లి వేడుకలు మలయాళీ, బెంగాళీ మత సంప్రదాయల ప్రకారం జరుగున్నాయి. జనవరి 27న ఉదయం మలయాళీ మత సంప్రదాయం ప్రకారం.. సాయంత్రం బెంగాళీ సంప్రదాయం ప్రకారం వివాహం జరిపించనున్నారు. జనవరి 26 తేదీ రాత్రి బీచ్ పార్టీ ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఈ పెళ్లి హంగామాకు సంబంధించిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం బ్రహ్మాస్త్ర చిత్రంలో నటించారు.


Click it and Unblock the Notifications











