పబ్లిక్‌లో సీరియల్ హీరోయిన్ రొమాన్స్: అతడికి లిప్ కిస్ పెట్టేసి ఘోరంగా!

గతంలో ఎవరైనా నటీమణులు వరుసగా సినిమాలు చేయడం ద్వారానే గుర్తింపును సొంతం చేసుకునే వారు. తద్వారా దేశ వ్యాప్తంగా పాపులారినిటీ పెంచుకోవడంతో పాటు మరిన్ని అవకాశాలను అందుకునేవారు. అయితే, ఇప్పుడా పరిస్థితి పూర్తిగా మారిపోయింది. దీనికి కారణం సోషల్ మీడియా అందుబాటులోకి రావడమే. దీని పుణ్యమా అని ఎంతో మంది అమ్మాయిలు తమదైన వ్యవహార శైలితో ఫేమస్ అవుతున్నారు.

అలా కొంత కాలంగా ఇందులో హల్‌చల్ చేస్తోన్న వారిలో ప్రముఖ సీరియల్ నటి మౌనీ రాయ్ ఒకరు. కెరీర్ పరంగా ఎంతో క్రేజ్ తెచ్చుకున్న ఈ భామ.. సోషల్ మీడియాలో రెచ్చిపోతోంది. ఈ క్రమంలోనే తాజాగా మౌనీ తన భర్తతో కలిసున్న రొమాంటిక్ ఫొటోలను షేర్ చేసింది. వాటిని మీరు కూడా చూసేయండి!

అలా ఎంట్రీ.. ఇలా పాపులారిటీ

అలా ఎంట్రీ.. ఇలా పాపులారిటీ

మౌనీ రాయ్ ‘రన్' మూవీలో స్పెషల్ సాంగ్ చేయడం ద్వారా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత చాలా చిత్రాన్ని నటించిన తర్వాత ‘క్యూకీ సాస్ బీ కబీ బహు తీ' అనే సీరియల్ ద్వారా బుల్లితెరపైకి అడుగు పెట్టింది. ఈ క్రమంలోనే ‘కసో నా యార్ హై', ‘కస్తూరి', ‘దో సహేలియాన్', ‘దేవాన్ కే దేవ్ మహాదేవ్' వంటి సీరియళ్లు చేసి ఫుల్ పాపలర్ అయింది.

ఒక్క సీరియల్‌తో ఎనలేని క్రేజ్

ఒక్క సీరియల్‌తో ఎనలేని క్రేజ్


బుల్లితెరపై సత్తా చాటుతోన్న సమయంలోనే మౌనీ రాయ్.. ‘నాగిన్'‌ అనే సీరియల్‌లో నటించింది. దీంతో ఆమె కెరీర్‌ ఒక్కసారిగా మారిపోయింది. మూడు సీజన్ల పాటు ఈ సీరియల్‌లో ఆమె లీడ్ రోల్‌ చేసింది. ఇది ఇండియాలోని చాలా భాషల్లో డబ్బింగ్ అయింది. మరీ ముఖ్యంగా తెలుగులోనూ ప్రసారం అయింది. అన్ని చోట్లా సూపర్ హిట్ అవడంతో మౌనీకి ఎనలేని క్రేజ్ దక్కింది.

సినిమాల్లోనూ సత్తా.. భారీ మూవీ

సినిమాల్లోనూ సత్తా.. భారీ మూవీ


మౌనీ రాయ్ తన కెరీర్‌లో చాలా సినిమాల్లో నటించింది. అంతేకాదు, ‘హీరో హిట్లర్ లవ్' అనే పంజాబీ చిత్రంలో హీరోయిన్‌గానూ చేసింది. దీని తర్వాత ‘గోల్డ్' అనే బాలీవుడ్ మూవీలోనూ నటించింది. అలాగే, ‘రోమియో అక్బర్ వాల్టర్', ‘మేడ్ ఇన్ చైనా' వంటి మూవీల్లో కనిపించింది. ఇక, ఇప్పుడు మౌనీ భారీ ప్రాజెక్టు ‘బ్రహ్మాస్త్ర'లో అత్యంత కీలకమైన పాత్రను చేసింది.

ప్రేమ వివాహం.. ఫుల్ ఎంజాయ్

ప్రేమ వివాహం.. ఫుల్ ఎంజాయ్


వరుసగా సినిమాలు, సీరియళ్లు చేస్తూ కెరీర్ పరంగా ఎంతో విజయవంతం అయిన మౌనీ రాయ్.. పర్సనల్ లైఫ్‌లో మాత్రం కొన్ని ఫెయిల్యూర్ లవ్ స్టోరీ కారణంగా ఇబ్బందులు పడింది. ఈ క్రమంలోనే సూరజ్ నంబియార్ అనే వ్యక్తితో ఆమె చాలా కాలం డేటింగ్ చేసి, ఇటీవలే అతడిని పెళ్లాడింది. ఇక, పెళ్లి తర్వాత మౌనీ తన భర్తతో కలిసి తెగ ఎంజాయ్ చేస్తూ సంతోషంగా ఉంది.

సోషల్ మీడియాలో యాక్టివ్‌గానే

సోషల్ మీడియాలో యాక్టివ్‌గానే


ఒకవైపు సీరియళ్లు, మరోవైపు సినిమాలు, ఇంకోవైపు టీవీ షోలు, వెబ్ సిరీస్‌లు చేస్తూ కెరీర్ పరంగా ఫుల్ బిజీగా గడుపుతోన్నప్పటికీ.. సోషల్ మీడియాలోనూ మౌనీ రాయ్ యమ యాక్టివ్‌గా ఉంటోంది. ఇందులో భాగంగానే ఎప్పుడూ అప్‌డేట్లు ఇస్తూనే ఉంటోంది. మరీ ముఖ్యంగా తనకు, తన కెరీర్‌కు సంబంధించిన ఎన్నో విషయాలను ఫాలోవర్లతో పంచుకుంటూ రచ్చ చేస్తోంది.

అవీ.. ఇవీ వదులుతోన్న బ్యూటీ

అవీ.. ఇవీ వదులుతోన్న బ్యూటీ


చాలా కాలంగా సోషల్ మీడియాలో యమ బిజీగా ఉంటోన్న మౌనీ రాయ్.. అప్పుడప్పుడూ అందాలను ఆరబోస్తూ దిగిన ఫొటోలు, వీడియోలను సైతం షేర్ చేస్తోంది. అదే సమయంలో తన భర్తతో కలిసి తీసుకున్న ఫొటోలు, వీడియోలను కూడా వదులుతోంది. ఇలా తరచూ ఏదో ఒక ఫొటోనో, వీడియోనో షేర్ చేస్తూనే ఉంటోంది. తద్వారా యమా హైలైట్ అవుతూ క్రేజ్ పెంచుకుంటోంది.

Recommended Video

Bumper Offer జస్ట్ నిద్రపొతే బోలెడంత జీతం... పోటీపడి దరఖాస్తులు *Trending | Telugu OneIndia
పబ్లిక్ ప్లేస్‌లోనే భర్తతో రొమాన్స్

పబ్లిక్ ప్లేస్‌లోనే భర్తతో రొమాన్స్


తాజాగా మౌనీ రాయ్ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో కొన్ని రొమాంటిక్ ఫొటోలను షేర్ చేసింది. వీటిలో ఆమె పక్కనే ఉన్న భర్తతో పబ్లిక్ ప్లేస్‌లోనే రొమాన్స్ చేసేస్తోంది. మరీ ముఖ్యంగా అతడికి లిప్ కిస్ కూడా ఇచ్చేసింది. దీంతో మౌనీ రాయ్ షేర్ చేసిన ఈ ఫోటోలకు నెటిజన్ల నుంచి భారీ స్థాయిలో స్పందన దక్కుతోంది. ఫలితంగా ఇవన్నీ తక్కువ సమయంలోనే వైరల్ అయ్యాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X