For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  హాట్ డోస్ పెంచిన సీరియల్ నటి: పెళ్లైన కొత్తలోనే ఇలా రెచ్చిపోయిందేంటబ్బా!

  |

  సాధారణంగా సినిమాల్లో నటించే వాళ్లకే ఎక్కువ మంది అభిమానులు ఉంటారు. అయితే, ఈ మధ్య కాలంలో మాత్రం సీరియళ్లలో నటించే నటీ, నటులకు కూడా చాలా మంచి ఫాలోయింగ్ కనిపిస్తోంది. మరీ ముఖ్యంగా కొన్ని డబ్బింగ్ సీరియళ్లలోని హీరోయిన్లకు భారీ ఫాలోయింగ్ ఏర్పడుతోంది. అలాంటి వారిలో నాగిన్ సీరియల్ ఫేం మౌనీ రాయ్ ఒకరు.

  హిందీ సీరియల్స్ ద్వారా ఎనలేని క్రేజ్‌ను సంపాదించుకున్న ఈ భామ.. సోషల్ మీడియా ద్వారా తన పాపులారిటీని మరింతగా పెంచుకుంటోంది. దీంతో రెట్టించిన ఉత్సాహంతో అందాల విందు చేస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా మౌనీ రాయ్ ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో కొన్ని హాట్ ఫొటోలను షేర్ చేసింది. ఇంకెందుకు ఆలస్యం? వాటిపై మీరూ లుక్కేయండి మరి!

  అలా పరిచయం... ఇలా పాపులర్

  అలా పరిచయం... ఇలా పాపులర్

  నటిగా పరిచయం అవడానికి ముందే మోడలింగ్ రంగంలో సత్తా చాటిన మౌనీ రాయ్.. 2004లో 'రన్' మూవీలో స్పెషల్ సాంగ్ ద్వారా తెరంగేట్రం చేసింది. ఆ తర్వాత 'క్యూకీ సాస్ బీ కబీ బహు తీ' అనే సీరియల్ ద్వారా బుల్లితెరపైకి వచ్చింది. ఇది హిట్ అవడంతో.. తర్వాత 'కసో నా యార్ హై', 'కస్తూరి', 'దో సహేలియాన్', 'దేవాన్ కే దేవ్ మహాదేవ్' వంటివి చేసింది.

  అరాచకమైన వీడియో షేర్ చేసిన శ్రీరెడ్డి: వాళ్ల కోసమే అంటూ మొత్తం చూపిస్తూ!

  ఆ సీరియల్‌తో నేషనల్ రేంజ్‌లో

  ఆ సీరియల్‌తో నేషనల్ రేంజ్‌లో

  సుదీర్ఘమైన కెరీర్లో మౌనీ రాయ్ కెరీర్‌లో ఎన్నో సీరియళ్లు చేసింది. అందులో 'నాగిన్' మాత్రం ప్రత్యేకంగా నిలిచింది. మూడు సీజన్ల పాటు ప్రసారం అయిన ఈ సీరియల్‌లో ఆమె లీడ్ రోల్‌ చేసింది. ఇది ఇండియాలోని చాలా భాషల్లో డబ్బింగ్ అయింది. ఇక, తెలుగులోనూ ఈ సీరియల్ సూపర్ హిట్ అయింది. ఇలా దీనితో నేషనల్ రేంజ్‌లో మౌనీ రాయ్‌ పాపులర్ అయిపోయింది.

  మూవీలే కాదు.. వాటిలో కనిపిస్తూ

  మూవీలే కాదు.. వాటిలో కనిపిస్తూ

  వరుస పెట్టి ఎన్నో సీరియళ్లలో నటించిన మౌనీ రాయ్.. తన ప్రయాణంలో పలు చిత్రాల్లోనూ నటించింది. 'హీరో హిట్లర్ లవ్' అనే పంజాబీ చిత్రంలో హీరోయిన్‌గా నటించింది. దీని తర్వాత 'గోల్డ్' అనే బాలీవుడ్ మూవీలోనూ చేసింది. అలాగే, 'రోమియో అక్బర్ వాల్టర్', 'మేడ్ ఇన్ చైనా' వంటి మూవీల్లో మెరిసింది. అలాగే, మ్యూజిక్ ఆల్బమ్‌లు, వెబ్ సిరీస్‌ల్లోనూ కనిపిస్తోంది.

  F3 హీరోయిన్ ఎద అందాల విందు: ఈ డ్రెస్‌లో ఆమెనిలా చూశారంటే తట్టుకోలేరు!

  లవ్ మ్యారేజ్.. హనీమూన్‌లోనూ

  లవ్ మ్యారేజ్.. హనీమూన్‌లోనూ

  తన సినీ కెరీర్‌లో మౌనీ రాయ్ చాలా మందితో ప్రేమాయణం సాగించినట్లు వార్తలు వచ్చాయి. అయితే, ఈ కొంత కాలం పాటు సూరజ్ నంబియార్ అనే వ్యక్తితో డేటింగ్ చేసింది. ఈ క్రమంలోనే ఇటీవలే అతడిని వివాహం చేసుకుంది. అంగరంగ వైభవంగా జరిగిన వీళ్ల వివాహానికి పలువురు సెలెబ్రిటీలు కూడా వచ్చారు. ఆ తర్వాత హనీమూన్‌ కోసం వెళ్లి అక్కడ తెగ ఎంజాయ్ చేసింది.

  అందులో మాత్రం ఫుల్ బిజీగా

  అందులో మాత్రం ఫుల్ బిజీగా

  సీరియళ్లు, సినిమాలు, షోలు, వెబ్ సిరీస్‌లు చేస్తూ కెరీర్ పరంగా ఫుల్ బిజీగా గడుపుతోన్నప్పటికీ.. మౌనీ రాయ్ సోషల్ మీడియా ద్వారా ఫ్యాన్స్‌తో నిత్యం టచ్‌లోనే ఉంటోంది. ఇందులో భాగంగానే ఎప్పుడూ ఏదో ఒక అప్‌డేట్ ఇస్తోంది. మరీ ముఖ్యంగా తనకు, తన కెరీర్‌కు సంబంధించిన ఎన్నో విషయాలను ఫాలోవర్లతో పంచుకుంటోంది. ఇలా తెగ సందడి చేసేస్తోంది.

  మసాజ్ వీడియో షేర్ చేసిన హీరోయిన్: ఒంటిపై నూలుపోగు లేకుండా ఘోరంగా!

  హాట్ ట్రీట్‌తో మౌనీ సందడిగా

  హాట్ ట్రీట్‌తో మౌనీ సందడిగా

  సోషల్ మీడియాలో సుదీర్ఘ కాలంగా సందడి చేస్తోన్న మౌనీ రాయ్.. ఎక్కువగా ఇందులో అందాలను ఆరబోస్తోంది. మరీ ముఖ్యంగా హాట్ హాట్ వీడియోలు, ఫొటోలు షేర్ చేస్తోంది. దీంతో ఈ అమ్మడు నిత్యం హైలైట్ అవుతోంది. ఫలితంగా మౌనీ రాయ్ దేశ వ్యాప్తంగా ఫేమస్ అయిపోతోంది. అలాగే, ఈ మధ్య కాలంలో ఈ బ్యూటీ తన గ్లామర్‌తో ఇంటర్నెట్‌ను తెగ ఊపేస్తోంది.

  ఘాటు ఫొటోలు వదిలిన భామ

  ఘాటు ఫొటోలు వదిలిన భామ

  తాజాగా మౌనీ రాయ్ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో కొన్ని హాట్ ఫొటోలను షేర్ చేసింది. వీటిలో ఆమె బ్లూ కలర్ టైట్ డ్రెస్ ధరించి ఉంది. తద్వారా తన బాడీలోని అందాలు అన్నింటినీ చూపిస్తూ ఘాటు ఫోజులు కూడా ఇచ్చింది. మరీ ముఖ్యంగా ఈ పిక్‌లలో ఆమె ఎద అందాలు హైలైట్ అవుతున్నాయి. దీంతో మౌనీ రాయ్ షేర్ చేసిన ఈ ఫోటోలు విపరీతంగా వైరల్ అయిపోతున్నాయి.

  English summary
  Television actress and a former model Mouni Roy Full Active In Social Media. Now She Shared Sizzling Photos in her Instagram.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X