Bigg Boss Telugu 8: బిగ్ బాస్‌కే షాకిచ్చిన ఆడియెన్స్.. అతడికి 40 ఆమెకు 8 మాత్రమే!
ఉత్తరాది నుంచి పరిచయం అయినప్పటికీ.. తెలుగు బుల్లితెర చరిత్రలోనే మరే షోకూ దక్కని రెస్పాన్స్‌ను అందుకుంటూ దూసుకుపోతోంది బిగ్ బాస్. అందుకే ఇది ఎన్నో సీజన్లను విజయవంతంగా పూర్తి చేసుకోగలిగింది. ఇక, ఈ మధ్యనే ఎనిమిదో సీజన్‌ను సైతం నిర్వహకులు మొదలెట్టారు. ఎన్నో అంచనాల నడుమ మొదలైన దీనికి సైతం మంచి స్పందనే వస్తోంది. ముఖ్యంగా ఇందులో ఓటింగ్ గతంలో కంటే విభిన్నంగా సాగుతోంది. ఈ నేపథ్యంలో 4వ వారంలో ఎవరికి ఎక్కువ, ఎవరికి తక్కువ ఓట్లు వస్తున్నాయో మీరు కూడా చూసేయండి మరి!
సరికొత్త కంటెంట్‌తో రచ్చ
ఒకే రకమైన టాస్కులు, వైల్డ్ కార్డ్ ఎంట్రీలు, లవ్ ట్రాకులు, ఫైటింగ్‌లు ఇలా గత సీజన్లు మొత్తం ఒకే తరహాలో నడిచాయి. దీంతో ఉల్టా పుల్టా ఏడో సీజన్‌తో వచ్చారు. దీని ద్వారా వినోదాన్ని బాగానే పంచారు. ఇప్పుడు అదే పంథాను ఫాలో అవుతూ అన్‌లిమిటెడ్ కాన్సెప్టుతో ఎనిమిదో సీజన్ తెచ్చారు. ఇందులో కొత్త కంటెంట్‌ను చూపిస్తూ ప్రేక్షకులకు ఎంటర్‌టైన్‌మెంట్ ఇస్తున్నారు.

ఆ ముగ్గురు ఎలిమినేషన్
ఎనిమిదో సీజన్‌లోకి ప్రేరణ కంభం, యష్మి గౌడ, బెజవాడ బేబక్క, కిర్రాక్ సీత, ఢీ ఫేం నైనిక, విష్ణుప్రియ భీమనేని, సోనియా ఆకుల, పృథ్వీరాజ్, నిఖిల్, నబీల్ అఫ్రిది, ఆదిత్య ఓం, శేఖర్ భాష, నాగ మణికంఠ, అభయ్ నవీన్‌లు కంటెస్టెంట్లుగా ఎంటర్ అయ్యారు. వీళ్లలో తొలి వారం బెజవాడ బేబక్క, రెండో వారంలో శేఖర్ బాషా, మూడో వారంలో అభయ్ షో నుంచి ఎలిమినేట్ అయ్యారు.
నాలుగో వారంలో వీళ్లంతా
ఆరంభం నుంచే రంజుగా సాగుతోన్న ఎనిమిదో సీజన్‌లో నాలుగో వారంలో కూడా నామినేషన్స్ ఉత్కంఠగానే సాగాయి. ఇందులో మొత్తంగా నబీల్, సోనియా ఆకుల, నాగ మణికంఠ, పృథ్వీరాజ్ శెట్టి, ఆదిత్య ఓం, ప్రేరణ, నైనికలు నామినేట్ అయ్యారు. అయితే, చీఫ్ నిఖిల్‌కు బిగ్ బాస్ ఇచ్చిన స్పెషల్ పవర్‌తో నైనికను సేవ్ చేశాడు. దీంతో ఓటింగ్‌కు ఆరుగురు మాత్రం మిగిలారు.
బిగ్ బాస్‌కు షాకిచ్చేలానే
బిగ్ బాస్ ఎనిమిదో సీజన్‌లో నాలుగో వారానికి సంబంధించిన ఓటింగ్ ప్రాసెస్ సోమవారం రాత్రి నుంచే ప్రారంభం అయింది. ఇది ఎవరూ ఊహించని విధంగా సాగుతోంది. మరీ ముఖ్యంగా నబీల్ అఫ్రిదీ ఒక్కడే దాదాపు 40 శాతం వరకూ ఓటింగ్ సాధిస్తున్నట్లు తెలిసింది. బిగ్ బాస్ నిర్వహకులే షాకయ్యే విధంగా అతడు ఒక్కడికే ఓటింగ్ గణనీయంగా పెరుగుతుందని సమాచారం.

వాళ్లు సేఫ్ అయ్యే ఛాన్స్
నాలుగో వారంలోని ఓటింగ్‌లో నబీల్ హవాను చూపిస్తున్నాడు. అతడి తర్వాత నాగ మణికంఠకు అత్యధిక ఓట్లు వచ్చాయి. కానీ, ఒక్కసారిగా ఓటింగ్ మారిపోయింది. ఫలితంగా ప్రేరణ రెండో స్థానానికి ఎగబాకింది. ఆమె తర్వాత అంటే మూడో స్థానంలో ఆదిత్య ఓం కొనసాగుతున్నాడు. దీంతో మణికంట నాలుగో స్థానంలో ఉన్నాడు. వీళ్లు దాదాపుగా సేఫ్ అయ్యే ఛాన్స్ ఉంది.
ఆమెకు 8 శాతం మాత్రమే
ఎనిమిదో నాలుగో వారం ఓటింగ్‌లో ప్రస్తుతం ఐదో స్థానాలో పృథ్వీరాజ్ శెట్టి ఉన్నాడు. అలాగే అందరి కంటే చివర్లో అంటే ఆరో స్థానంలో సోనియా ఆకుల ఉంది. ఈమెకు కేవలం 8 శాతం ఓటింగ్ మాత్రమే నమోదు అవుతున్నట్లు తెలిసింది. ఇదే కంటిన్యూ అయితే సోనియా ఈ వారం హౌస్ నుంచి బయటకు వెళ్లిపోయే అవకాశం ఉంటుందని విశ్లేషకులు చెబుతున్నారు.


Click it and Unblock the Notifications











