Bigg Boss Voting : దూసుకొస్తున్న నిఖిల్ .. కాస్కో నబీల్ , కన్నడ బ్యాచ్‌కి షాకిచ్చేలా ఓటింగ్?

బిగ్‌బాస్ తెలుగు 8 విజయవంతంగా 11 వారాలు పూర్తి చేసుకుని 12వ వారంలోకి అడుగుపెట్టింది. గత వారం నామినేషన్స్‌లో ఉన్న అవినాష్, టేస్టీ తేజలను సేవ్ చేయడంతో ఈ వారం ఉత్కంఠగా మారింది. గత సీజన్‌లలో ఎన్నడూ లేని విధంగా ఈ సీజన్‌లో ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్స్‌తో నామినేషన్స్ చేయించాడు బిగ్‌బాస్. ఈ వీక్ నామినేషన్స్ ప్రక్రియ వినూత్నంగా ఉండగా.. నామినేట్ అయిన వారిలో ఓటింగ్‌లో ఎవరు టాప్‌లో ఉన్నారు? ఎవరు లీస్ట్‌లో ఉన్నారో చూస్తే :

బిగ్‌బాస్ ఆదేశాల మేరకు సోమవారం తొలుత సోనియా ఆకుల .. నిఖిల్, ప్రేరణలను నామినేట్ చేసింది. ఆర్జే శేఖర్ భాషా.. ప్రేరణ, యష్మీలను, బెజవాడ బేబక్క.. పృథ్వీ, నిఖిల్‌లని నామినేట్ చేశారు. తొలిరోజు ముగ్గురితో ముగించిన బిగ్‌బాస్ మంగళవారం నాడు నాగ మణికంఠ, కిర్రాక్ సీత, నైనిక, ఆదిత్య ఓంలను హౌస్‌లోకి తీసుకొచ్చాడు. నబీల్, నిఖిల్‌లను నాగ మణికంఠ నామినేట్ చేయగా.. యష్మి, ప్రేరణలను సీత.. నబీల్, యష్మిలను నైనిక నామినేట్ చేసింది.

nabeel afridi got top place in 12th week voting of bigg boss telugu 8

ఇక ఆదిత్య ఓం ఎంట్రీ ఇవ్వగానే కంటెస్టెంట్స్ అంతా వెళ్లి ఆయనను విష్ చేశారు. విష్ణుప్రియ అయితే కాళ్లకు దండాలు పెట్టేసింది. కర్మ ఈజ్ బ్యాక్ అనే డైలాగ్‌ కొట్టి నామినేషన్స్ ప్రారంభించిన ఆదిత్య ఓం.. యష్మి, ప్రేరణలను నామినేట్ చేశారు. ఆదిత్య తనను నామినేట్ చేయడంతో ప్రేరణ కంటతడి పెట్టింది. నిఖిల్, అవినాష్‌లు ఆమెను ఓదార్చడానికి ట్రై చేసినా తనను ఒంటరిగా వదిలేయ్యాలని చెప్పి బాధపడింది.

కాసేపటికి నైనిక ఎంట్రీ ఇచ్చి నిఖిల్‌కి హగ్ ఇచ్చింది. ఆమె నబీల్‌, యష్మిలను నామినేట్ చేసింది. తర్వాత నాగ మణికంఠ హౌస్‌లో అడుగుపెట్టి అందరి మాదిరిగానే నిఖిల్‌ను టార్గెట్ చేశారు. ఏంటో మరి ఈ వారం నిఖిల్‌కు అంతా స్ట్రోక్స్ ఇస్తున్నారు. తర్వాత నబీల్‌ను నామినేట్ చేసిన నాగ మణికంఠ.. నువ్వే విన్నర్‌వి కావాలని కోరుకుంటున్నానని చెప్పాడు. త్యాగాలు చేసి గేమ్‌ని పక్కనపెట్టొద్దు అని నబీల్‌ను మోటివేట్ చేశాడు. కాసేపటికి కిర్రాక్ సీత ఎంట్రీ ఇచ్చి .. ప్రేరణ, యష్మిలను నామినేట్ చేసింది. నిఖిల్ ట్రాప్‌లో పడొద్దని యష్మిని హెచ్చరించడంతో ఈ వీక్ నామినేషన్స్ ముగిశాయి.

మొత్తంగా 12వ వారం నామినేషన్స్‌లో ఐదుగురు ఉన్నారు. వారు నబీల్, యష్మి, పృథ్వీరాజ్, నిఖిల్, ప్రేరణ. ఆన్‌లైన్‌లో జరుగుతున్న అనధికారిక ఓటింగ్ ప్రకారం.. నబీల్ దాదాపు 36 శాతం ఓటింగ్‌తో టాప్‌లో కొనసాగుతున్నాడు. గడిచిన కొద్దివారాలుగా ఓటింగ్‌లో వెనుకబడుతున్న నిఖిల్ 12వ వారం కూడా తన మార్క్ చూపించలేకపోతున్నాడు. 29 శాతం ఓటింగ్‌తో సెకండ్ ప్లేస్‌లో నిలిచాడు. అయితే నిన్నటితో పోల్చితే నిఖిల్ తర్వాత ప్రేరణ 13 శాతం, పృథ్వీరాజ్ 12 శాతం, యష్మి 10 శాతం ఓటింగ్‌తో నిలిచారు. ఓటింగ్ లైన్స్ క్లోజ్ కావడానికి కొద్దిరోజులు సమయం ఉండటంతో ర్యాంకింగ్స్ మారే అవకాశం ఉంది. చూద్దాం మరి ఏం జరుగుతుందో?

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X