Bigg Boss 8 Voting : నిఖిల్‌కి షాక్, మళ్లీ సింహాసనంపై నబిల్ .. సేఫ్ జోన్‌లోకి సమంత ఫ్రెండ్!
రెండ్రోజుల పాటు వాడి వేడిగా జరిగిన నామినేషన్స్ ప్రక్రియ ముగియడంతో ఇంటి సభ్యులు చిల్ అయ్యారు. ఆటపాటలు, ముచ్చట్లలో మునిగిపోయారు. ఎప్పటిలాగే ముక్కు అవినాష్, రోహిణిలు తమ పంచ్‌లతో సందడి చేశారు. నామినేషన్స్ సందర్భంగా చోటు చేసుకున్న వాగ్వాదాన్ని ఆమె స్పూఫ్ చేసి కడుపుబ్బా నవ్వించారు. అటు ఓటింగ్ లైన్స్ ఓపెన్ కావడంతో ఆడియన్స్ తమకు నచ్చిన కంటెస్టెంట్‌కి ఓట్లు గుద్దేస్తున్నారు. మరి ఈ వారం ఓటింగ్ ఎలా జరుగుతుంది? ఎవరు టాప్‌లో ఉన్నారు? ఎవరు డేంజర్ జోన్‌లో ఉన్నారో చూస్తే:
నామినేషన్స్ ముగిసిన తర్వాత విష్ణుప్రియ తన తండ్రి గురించి చెప్పి అందరినీ ఏడిపించేసింది. తర్వాత గంగవ్వ దగ్గరికెళ్లిన మణికంఠ.. అవ్వా నేను సేవ్ అయితే నీకు బంగారు ముక్కుపుడక చేయిస్తానని బేరం మొదలుపెట్టాడు. నాకు వడ్డాణం ఇస్తావా అని హరితేజ అడగ్గా.. బేగంబజారుకి తీసుకెళ్లి ఖచ్చితంగా ఇస్తానంటాడు. మరి నాకేం ఇస్తావ్ అని రోహిణి అడగ్గా.. ఓ ముద్దు ఇస్తానని చెప్పడంతో అంతా షాక్ అవుతారు. అవన్నీ కాదు నువ్వు రెండో వారం వెళ్లిపోతావ్ రా అంటూ గంగవ్వ జోస్యం చెబుతుంది.

తర్వాత ఎపిసోడ్‌లో 2050 నాటి పరిస్ధితులతో ఓ టాస్క్ చేయించాడు. గతంలో భూములు, ఆస్తుల కోసం గొడవలు జరిగేవని, కానీ ఈ యుగంలో మాత్రం ఛార్జింగ్ కోసం మనుషులు కొట్టుకుంటున్నారని చెబుతాడు. ఇంటిని రాయల్ క్లాన్, గార్డెన్ ఏరియాను ఓజీ క్లాన్ సభ్యులు తమ ఆధీనంలోకి తీసుకుంటారు. బ్యాటరీ ఛార్జింగ్ తగ్గిపోకుండా చూసుకోవాలి చివరి వరకు ఎవరి ఛార్జింగ్ నిలిచి ఉంటుందో వారే చీఫ్ కంటెండర్లు. టాస్క్ మొదలైందో లేదో నా వల్ల కాదంటూ మణికంఠ ఓపెన్ అయిపోయాడు. నాకు హెల్త్ ఇంపార్టెంట్ అని గాయాలతో ఇంటికి వెళ్లలేనని చెబుతాడు.
ఓజీ క్లాన్ సభ్యులు అదమరిచి ఉన్నప్పుడు ఛార్జింగ్ పెట్టుకోవడానికి ప్రయత్నిస్తాడు అవినాష్. కానీ ఏ ఒక్కసారి కూడా ఒక నిమిషం పూర్తి కాకపోవడంతో అది కౌంట్ కాలేదని బిగ్‌బాస్ షాకిచ్చాడు. మణికంఠ దగ్గరికి వెళ్లి బుర్రకథ మొదలెట్టిన హరితేజ.. ఛార్జింగ్ అడుక్కుంటుంది. ఆమె హరికథకు మెచ్చిన మణికంఠ.. ఒక నిమిషం ఛార్జింగ్ ఇచ్చేశాడు. యష్మి దగ్గర ఛార్జింగ్ కొట్టేయడానికి నయని ట్రై చేయగా అడ్డంగా బుక్కయ్యింది. వెంటనే ఓజీ క్లాన్ వచ్చి ఆమెను గట్టిగా పట్టుకోవడంతో నయనికి స్వల్ప గాయాలయ్యాయి. ఉత్కంఠభరితంగా సాగిన ఈ టాస్క్ మిగిలిన భాగం గురువారం కంటిన్యూ కానుంది.

కాగా.. ఏడో వారం ఏకంగా 9 మంది నామినేషన్స్‌లో ఉండటం విశేషం. వారు హరితేజ, ప్రేరణ, నిఖిల్, పృథ్వీరాజ్, గౌతమ్ కృష్ణ, యష్మి గౌడ, నబీల్ అఫ్రిది, టేస్టీ తేజా, నాగ మణికంఠ. సోషల్ మీడియాలో అనధికారికంగా జరుగుతున్న ఓటింగ్‌ను బట్టి ఎవరికెన్ని ఓట్లు పడ్డాయో పరిశీలిస్తే . వరుసగా రెండు రోజులు ఓటింగ్‌లో టాప్‌లో ఉన్న నిఖిల్‌ను నబిల్ అఫ్రిది వెనక్కి నెట్టాడు. నబిల్‌కు 21.37 శాతం ఓటింగ్ నమోదవ్వగా.. నిఖిల్ 20.16 శాతం ఓట్లతో నిలిచాడు.
నాగమణికంఠ (13.77 శాతం) ఓటింగ్‌తో మూడో స్థానంలో నిలిచాడు, ప్రేరణ (12 శాతం), పృథ్వీ (8.3 శాతం), యష్మి (8 శాతం) , హరితేజ (7 శాతం) ఓటింగ్‌తో సేఫ్ జోన్‌లో నిలిచారు. రెండ్రోజులుగా డేంజర్ జోన్‌లో ఉన్న హరితేజ తన ఓటింగ్ మెరుగుపరచుకుని సేఫ్ అయ్యారు. అయితే టేస్టీ తేజా (6.2 శాతం ) ఓటింగ్ పెరిగినా డేంజర్ జోన్‌లో ఉన్నాడు. నిన్నటి వరకు టాప్‌లో ఉన్న గౌతమ్ (5.7 శాతం ) అనూహ్యంగా ఓటింగ్‌లో అందరికంటే లీస్ట్‌లో నిలిచి షాకిచ్చాడు. అయితే ఓటింగ్ లైన్స్ క్లోజ్ అవ్వడానికి ఇంకా గడువు ఉండటంతో ఈలోపు ఎలాంటి ఏ ప్లేస్‌లో నిలుస్తారో చూడాలి.


Click it and Unblock the Notifications











