Bigg Boss Voting : ఓటింగ్‌లో నబీల్ ఊచకోత ..దరిదాపుల్లో లేని K బ్యాచ్, డేంజర్ జోన్‌లో ఎవరంటే?

బిగ్‌బాస్ తెలుగు 8 విజయవంతంగా 11 వారాలు పూర్తి చేసుకుని 12వ వారంలోకి అడుగుపెట్టింది. మరి రెండు మూడు వారాల్లో బిగ్‌బాస్ 8వ సీజన్‌కు ఎండ్ కార్డ్ పడనుంది. గత వారం హౌస్‌లో ఎవరూ ఎలిమినేట్ కాకపోవడంతో 12వ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారన్నది ఉత్కంఠగా మారింది. ఈ వీక్ డబుల్ ఎలిమినేషన్ కూడా ఉండే అవకాశాలు ఉన్నాయని సోషల్ మీడియాలో వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. ఈ వివరాల్లోకి వెళితే..

బిగ్‌బాస్ తెలుగు 8లో ఇప్పటి వరకు బెజవాడ బేబక్క, ఆర్జే శేఖర్ భాషా, అభయ్ నవీన్, సోనియా ఆకుల, ఆదిత్య ఓం, నైనిక, కిర్రాక్ సీత, నాగ మణికంఠ, మెహబూబ్, నయని పావని, గంగవ్వ, హరితేజలు ఎలిమినేట్ అయిన సంగతి తెలిసిందే. పాత ఓజీ క్లాన్‌లో నిఖిల్, యష్మిగౌడ, పృథ్వీరాజ్, నబీల్, విష్ణుప్రియ, ప్రేరణ ఉండగా.. రాయల్ క్లాన్‌లో అవినాష్, గౌతమ్, రోహిణి, టేస్టీ తేజ మిగిలారు.

nabeel afridi place top in 12th week voting of bigg boss telugu 8

ఇక సోమవారం నాటి నామినేషన్స్ విషయానికి వెళ్తే.. మెగా చీఫ్ అయిన కారణంగా అవినాష్‌ను ఎవరూ నామినేట్ చేయడానికి వీల్లేదని తెలిపారు బిగ్‌బాస్. ఇక ఏ సీజన్‌లోనూ లేని విధంగా 12వ వారం నామినేషన్స్‌కు శ్రీకారం చుట్టారు. దీనిలో భాగంగా ఈ సీజన్‌లో ఇప్పటి వరకు ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్స్‌ని పిలిచి ప్రతి ఒక్కరూ ఇద్దరు ఇంటి సభ్యులను నామినేట్ చేయాలని బిగ్‌బాస్ చెప్పారు.

తొలుత సోనియా ఆకుల .. నిఖిల్, ప్రేరణలను నామినేట్ చేసింది. ఆర్జే శేఖర్ భాషా.. ప్రేరణ, యష్మీలను, బెజవాడ బేబక్క.. పృథ్వీ, నిఖిల్‌లని నామినేట్ చేశారు. తొలిరోజు ముగ్గురితో ముగించిన బిగ్‌బాస్ మంగళవారం నాడు నాగ మణికంఠ, కిర్రాక్ సీత, నైనిక, ఆదిత్య ఓంలను హౌస్‌లోకి తీసుకురానున్నాడు. నబీల్, నిఖిల్‌లను నాగ మణికంఠ నామినేట్ చేయగా.. యష్మి, ప్రేరణలను సీత.. నబీల్, యష్మిలను నైనిక నామినేట్ చేసింది.

నామినేషన్స్ మంగళవారం కూడా కొనసాగే అవకాశం ఉండటంతో 12వ వారం నామినేషన్స్‌లో ఎవరెవరు ఉన్నారంటూ ప్రేక్షకులు చర్చించుకుంటున్నారు. సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని బట్టి ఈ వారం నామినేషన్స్‌లో ఐదుగురు ఉన్నారట. వారు నబీల్, యష్మి, పృథ్వీరాజ్, నిఖిల్, ప్రేరణ. ఆన్‌లైన్‌లో అనధికారిక ఓటింగ్ ప్రకారం.. నబీల్ దాదాపు 34 శాతం ఓటింగ్‌తో టాప్‌లో ఉన్నాడు. గడిచిన కొద్దివారాలుగా ఓటింగ్‌లో వెనుకబడుతున్న నిఖిల్ ఈసారి కూడా 27 శాతం ఓటింగ్‌తో సెకండ్ ప్లేస్‌లో నిలిచాడు. తర్వాత ప్రేరణ 16 శాతం, పృథ్వీరాజ్ 14 శాతం, యష్మి 11 శాతం ఓటింగ్‌తో నిలిచారు. మంగళవారం ఎపిసోడ్‌తో నామినేషన్స్‌లో ఎవరున్నది తేలిపోనుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X