Bigg Boss Telugu 8: ఆస్పత్రిలో చేరిన బిగ్ బాస్ కంటెస్టెంట్.. అతడి ప్లేస్‌లో షోలోకి వచ్చింది ఎవరంటే!

కొంత కాలంగా తెలుగు బుల్లితెరపై రకరకాల కాన్సెప్టులతో షోలు వస్తున్నాయి. కానీ, అందులో కొన్ని మాత్రమే ప్రేక్షకుల హృదయాలను దోచుకుని సూపర్ సక్సెస్ అవుతున్నాయి. అలాంటి వాటిలో రియాలిటీ ఆధారంగా నడుస్తోన్న బిగ్ బాస్ ఒకటి. ఈ కార్యక్రమం మిగిలిన భాషల కంటే తెలుగులోనే భారీ విజయవంతం అయింది. దీంతో నిర్వహకులు సీజన్ల మీద సీజన్లు పూర్తి చేశారు. ఇలా ఇప్పుడు ఎనిమిదో సీజన్‌ను మొదలు పెట్టేశారు. ఇందులోకి ఓ కంటెస్టెంట్ అనుకోకుండా వచ్చినట్లు తాజాగా న్యూస్ బయటకు వచ్చింది. ఆ వివరాలను మీరే చూసేయండి!

అంతులేకుండా ఇచ్చే సీజన్
తెలుగులో మాత్రమే బిగ్ బాస్ ఎప్పుడు ప్రసారం అయినా భారీ రెస్పాన్స్‌ను అందుకుంటోంది. అందుకే నిర్వహకులు ఎప్పటికప్పుడు కొత్త కొత్త కాన్సెప్టులతో సీజన్లను తీసుకు వస్తున్నారు. ఇలా ఇప్పుడు ఎనిమిదో దాన్ని 'అన్‌లిమిటెడ్ ఎంటర్‌టైన్‌మెంట్' అనే కాన్సెప్టుతో తీసుకు వచ్చారు. ఇందులో గతంలో కంటే విభిన్నమైన కంటెంట్‌ను చూపించి మజాను పంచబోతున్నారు.

Nabeel Afridi Replace Parameshwar Hivrale for Bigg Boss Telugu 8 Show

14 మందే.. వచ్చింది ఎవరు?

బిగ్ బాస్ ఎనిమిదో సీజన్‌ కోసం దాదాపు 50 మంది వరకూ సెలెబ్రిటీలతో నిర్వహకులు చర్చలు జరిపారు. కానీ, అందులో 14 మంది అంటే కిర్రాక్ సీత, ఢీ ఫేం నైనిక, విష్ణుప్రియ భీమనేని, సోనియా ఆకుల, పృథ్వీరాజ్, నిఖిల్, నబీల్ అఫ్రిది, ఆదిత్య ఓం, శేఖర్ బాషా, ప్రేరణ కంభం, యష్మి గౌడ, బెజవాడ బేబక్క, నాగ మణికంఠ, అభయ్ నవీన్‌లు కంటెస్టెంట్లుగా తీసుకు వచ్చారు.

ఐదో వారంలో మరికొందరు
వాస్తవానికి ప్రతి సీజన్‌లో దాదాపు 20 మంది వరకూ కంటెస్టెంట్లు వస్తుంటారు. కానీ, ఎనిమిదో సీజన్‌లో మాత్రం 14 మందినే హౌస్‌లోకి తీసుకు వచ్చారు. దీనికి కారణం గత ఉల్టా పుల్టా సీజన్ మాదిరిగానే ఇప్పుడు కూడా 2.0 సీజన్ అంటూ ఐదు వారాల తర్వాత మరికొందరిని హౌస్‌లోకి తీసుకు రాబోతున్నారు. అందులో ఎక్కువ శాతం మాజీ కంటెస్టెంట్లే ఎంట్రీ ఇవ్వబోతున్నారు.

ఛాన్స్ మిస్ చేసుకున్నాడు

బిగ్ బాస్ ఎనిమిదో సీజన్ మొదలయ్యే ముందు ఎంతో మంది సెలెబ్రిటీల పేర్లు తెరపైకి వచ్చాయి. కానీ, నిర్వహకులు మాత్రం 14 మందినే ఫైనల్ చేశారు. అయితే, ఇప్పుడు అందులో ఒకరు మిస్ అయ్యారు. ఆ సెలెబ్రిటీనే పరమేశ్వర్ హిర్వాలే. టాలీవుడ్‌లో నటుడిగా, డైరెక్టర్‌గా సుపరిచితుడు అయిన అతడు.. చివరి నిమిషంలో షో నుంచి తప్పుకున్నట్లు తాజాగా న్యూస్ లీకైంది.

Nabeel Afridi Replace Parameshwar Hivrale for Bigg Boss Telugu 8 Show

ఆస్పత్రిలో చేరిన హిర్వాలే
పరమేశ్వర్ హిర్వాలేను బిగ్ బాస్ నిర్వహకులు ఫైనల్ చేసిన విషయం వాస్తవమే. అంతేకాదు, అతడు షోకు రెండు రోజుల ముందు కూడా టచ్‌లో ఉన్నాడు. అయితే, ఒక్కసారిగా అతడు అనారోగ్యానికి గురయ్యాడు. అలాగే, ఆస్పత్రిలో సైతం చేరాల్సి వచ్చింది. అప్పుడు వైద్యులు అతడికి కొద్ది రోజులు రెస్ట్ సూచించారట. ఈ కారణంగానే పరమేశ్వర్ షోలోకి ఎంట్రీ ఇవ్వలేదు.

అతడి స్థానంలో ఎవరంటే

ఎనిమిదో సీజన్ ప్రారంభానికి ముందే పరమేశ్వర్ హిర్వాలే తప్పుకోవడంతో బిగ్ బాస్ నిర్వహకులు యూట్యూబర్ నబీల్ అఫ్రిదీతో చర్చలు జరిపారని తెలిసింది. ఈ క్రమంలోనే అతడిని వెంటనే ఎంపిక చేసుకున్నారని సమాచారం. అలా పరమేశ్వర్ స్థానంలో నబీల్ షోలోకి ఎంట్రీ ఇచ్చాడు. అయితే, రాబోయే రోజుల్లో అతడిని తీసుకు వస్తారా లేదా అన్నది చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X