రోహిణిపై ఎదురుదాడి.. పృథ్వీతో నబీల్ మైండ్ గేమ్.. కన్నడ బ్యాచ్ జాగ్రత్త అంటూ నెటిజన్లు కామెంట్
బిగ్‌బాస్ తెలుగు 8 రియాలిటీ షో సక్సెస్‌ఫుల్‌గా 10వ వారంలోకి ప్రవేశించింది. 65వ రోజున ఎప్పటి లాగానే కంటెస్టెంట్లకు టిస్టు ఇచ్చి అదరగొట్టాడు. అయితే నామినేషన్ల తర్వాత మెగా ఛీఫ్ కంటెండర్ టాస్క్‌లో భాగంగా కంటెస్టెంట్లందరికి ఓ పరీక్ష పెట్టగా అందులో రోహిణి, పృథ్వీ, నబీల్ తీసుకొన్న ఛాన్స్ వారికి పాజిటివ్‌గా మారింది. మెగా ఛీఫ్ కంటెండర్ టాస్క్ ఏమిటి? బిగ్‌బాస్ ఇచ్చిన ట్విస్ట్ ఏమిటి? అనే వివరాల్లోకి వెళితే..
ఇంటి సభ్యుల ముందు మూడు సూట్‌కేసులు పెట్టారు. వాటిని పట్టుకోవడానికి కొందరు తటపటాయించారు. అయితే నబీల్, పృథ్వీ, రోహిణి ముగ్గురు ఆ సూట్‌కేసులను తీసుకొన్నారు. అయితే నబీల్ సూట్‌కేస్ తీసుకోవడంతో గంగవ్వ స్పందించి.. అంత అత్యాశ అవసరం లేదు అని కామెంట్ చేసింది. ఏదైనా ఉండనివ్వండి.. దానికి సిద్దంగా ఉన్నాను అని నబీల్ అన్నాడు.

అయితే సూట్ కేసులు పట్టుకోవడంపై బిగ్‌బాస్ స్పందిస్తూ.. మీరు చేసిన ధైర్యానికి ఏమిచ్చిందని అనుకొంటున్నారు అని అంటే.. నేను మంచిని కోరుకొన్నాను. నేను మంచే జరుగుతుందని అనుకొంటున్నాను అని అన్నారు. దాంతో మీరు సూట్‌కేసులు పట్టుకోవడం వల్ల అంతా మంచే జరిగింది. మీ ముగ్గురు సూట్ కేసులు పట్టుకొన్న కారణంగా మీరు ఈ వారం మెగా ఛీప్ కంటెండర్ షిఫ్ చాన్స్ పొందారు అని బిగ్ బాస్ అన్నారు.
అయితే చీఫ్ కంటెండర్‌గా కావాలంటే కొన్ని ఛాలెంజెస్ ఎదుర్కోవాల్సి ఉంటుంది అంటూ ఓ గేమ్‌ను పెట్టారు. ఆ గేమ్‌కు లకిడీ కా పూల్ అనే పేరు పెట్టారు. ఆ గేమ్‌లో ముగ్గురిని ఆడించగా.. రోహిణి గెలిచినట్టు కనిపించింది. అయితే ఈ గేమ్‌లో హరితేజ కూడా రావడం ఓ ట్విస్టుగా కనిపించింది. ఇలా జరుగుతుందని మేము ఊహించలేదని ఇంటి సభ్యులు కామెంట్ చేస్తూ ఉన్నారు.
ఇదిలా ఉండగా, నబీల్, పృథ్వీతో మైండ్ గేమ్ ఆడేందుకు సిద్దమయ్యారు. మనమే ఆడి మనమే గెలిచే విధంగా ప్లాన్ చేద్దాం. మన చేతిలోనే పవర్ ఉండేలా ఆడుదాం. గేమ్‌లో నేను బయట ఉంటే నిన్ను.. నువ్వు గేమ్‌లో బయట ఉంటే నేను సపోర్ట్ చేస్తాను అని పృథ్వీతో నబీల్ అనడం కనిపించింది.
అయితే నబీల్ అత్యుత్సాహం, మైండ్ గేమ్‌ను నెటిజన్లు ఏకి పారేస్తున్నారు. కన్నడ బ్యాచ్‌తో పెట్టుకోకు నబీల్.. వాళ్లు నిన్ను టిష్యూ పేపర్‌లా వాడిపాడేస్తారు. నిన్ను అదను చూసి ముంచేస్తారు అని కామెంట్ చేస్తున్నాడు. అయితే కన్నడ గ్రూప్‌కు ఎంత దూరం ఉంటే అంత మంచిందని జాగ్రత్తలు చెబుతున్నాడు. అయితే నబిల్ ప్లాన్ ఏంటో.. అతడికి పాజిటివ్ అవుతుందా? లేదా నెగిటివ్ అవుతుందా అనే వేచి చూడాల్సిందే.


Click it and Unblock the Notifications











