జబర్దస్త్ ప్రోగ్రామ్ నాది.. ‘ఎక్స్‌ట్రా’కు నేనూ ఓ కారణం.. నాగబాబు షాకింగ్ కామెంట్స్

బుల్లితెరపై జబర్దస్త్ కామెడీ షో ఎంతటి సంచలనం సృష్టించిందో.. ప్రస్తుతం అంతకుమించి సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. ఇన్ని రోజులు జడ్జిగా వ్యవహరించిన నాగబాబు దీనంతటకి కారణం. జబర్దస్త్‌ను నాగబాబు వీడడంతో మొదలైన ఈ చర్చ.. నేటికీ కొనసాగుతూ ఉంది. వేరే చానెల్‌లో కొత్త కొత్త ప్రోగ్రామ్‌లను ప్రారంభించేశాడు. అక్కడి వరకు బాగానే ఉన్నా.. అక్కడి నుంచి వచ్చిన నాగబాబు.. దానిపైనే ఇంకా మాట్లాడుతూ ఉండటంపై నెటిజన్లు ఫైర్ అవుతున్నారు.

యూట్యూబ్ చానెల్‌లో వీడియోలు..

యూట్యూబ్ చానెల్‌లో వీడియోలు..

జబర్దస్త్‌ను వీడిపోతున్నట్లు వస్తోన్న వార్తలపై ఓ క్లారిటీ ఇచ్చేందుకు తన యూట్యూబ్ చానెల్ ద్వారా అభిమానుల ముందుకు వచ్చాడు. బయట వస్తోన్న రూమార్లపై స్పందిస్తూ.. ఆ వీడియోలో అన్నింటికి సమాధానిమిచ్చాడు. అదంతా బాగానే ఉన్నా.. మళ్లీ అదే విషయాన్ని తవ్వుతూ పాత విషయాలన్నింటిని నెమరు వేసుకుంటూ విడతల వారిగా వీడియోలు రిలీజ్ చేస్తుండటంపై నెటిజన్లు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.

జబర్దస్త్ పుట్టుకనుంచి చెప్పుకుంటూ..

జబర్దస్త్ పుట్టుకనుంచి చెప్పుకుంటూ..

జబర్దస్త్ షో పుట్టుకు గురించి, తాను ఆ షోలో భాగస్వామ్యం అయిన తీరు, మొదట్లో షో ఉన్న తీరు, అనుకున్న షెడ్యూల్ ఇలా నాటి విషయాలన్నింటి గురించి పూస గుచ్చినట్టు వివరించాడు. మొదట్లో కేవలం 25 ఎపిసోడ్‌లు మాత్రమే అనుకున్న ఈ షో.. ఇన్నేళ్లుగా కొనసాగుతూ వచ్చిందని, తాను మధ్యలో ఇలా బయటకు వచ్చేస్తానని ఎన్నడూ అనుకోలేదని ఓ వీడియోను రిలీజ్ చేశాడు.

ఐడియాలజీ కారణంగానే..

ఐడియాలజీ కారణంగానే..

క్రియేటివ్ ఐడియాలజీ కారణంగానే బయటకు వచ్చేశానని, బయట వస్తోన్న రూమర్లు నిజం కాదని, ఏనాడూ రెమ్యూనరేషన్ సమస్య రాలేదని క్లారిటీగా చెప్పేశాడు. అయితే జబర్దస్త్ కంటెస్టెంట్లు, టీమ్ లీడర్లు అప్పటి పరిస్థితులు చెప్పుకుంటూ వస్తూ రచ్చ రవికి ఓ ప్రమాదం జరిగిందని చెప్పుకుంటూ మొదటి వీడియోను ముగించేశాడు. తాజాగా దానికి కొనసాగింపుగా రెండో వీడియోను విడుదల చేశాడు.

జబర్దస్త్ షో నాదే..

జబర్దస్త్ షో నాదే..

ఈ షోకు నిర్మాత శ్యామ్ ప్రసాద్ రెడ్డి అయినా, మల్లెమాల షో అని అన్నా, ఈటీవీ షో అని అన్నా తానెప్పుడు అలా ఫీల్ కాలేదని చెప్పుకొచ్చాడు. ఇది తన షో అని అనుకున్నట్లు తెలిపాడు. ఒకానొక సమయంలో రచ్చ రవికి ప్రమాదం జరిగిందని, తాను, మిగతా కంటెస్టెంట్లు అందరూ సహాయం చేశారని అన్నాడు. ఇలా అంతా ఓ కుటుంబంలా కలిసి మెలిసి ఉండేవారమంటూ చెప్పుకొచ్చాడు.

ఎక్స్‌ట్రా జబర్దస్త్‌ పుట్టుకు అలా జరిగింది..

ఎక్స్‌ట్రా జబర్దస్త్‌ పుట్టుకు అలా జరిగింది..

జబర్దస్త్ లాంటి మరో షో చేద్దామని చానెల్, నిర్మాత నిర్ణయించుకున్నారు.. అప్పట్లో దర్శకుడు సంజీవ్‌తో పాటు అందరికీ కాసింత అనుమానం ఉండేదని తెలిపాడు. అయితే తనకేమాత్రం అనుమానం లేదని, ఒకమనిషి ఒకసారి వచ్చి నవ్వించినా నవ్వుతామని, రెండో సారి వచ్చి నవ్వించినా నవ్వుతామనే లాజిక్ చెప్పానని అలా ఎక్స్‌ట్రా జబర్దస్త్ కూడా సూపర్ హిట్ అయిందని చెప్పుకొచ్చాడు.

కెమెరామెన్, ఆర్ట్ డైరెక్టర్‌ల గురించి..

కెమెరామెన్, ఆర్ట్ డైరెక్టర్‌ల గురించి..

ఈ షోలు ఇంతటి సక్సెస్ కావడానికి ముఖ్య కారణం దర్శకులు సంజీవ్, నితిన్, భరత్ అంటూ జబర్దస్త్‌కు పనిచేసిన కెమెరామెన్, ఎడిటర్, ఆర్ట్ డైరెక్టర్‌ల గురించి కూడా చెప్పుకొచ్చాడు. తమకు ఎలాంటి సెట్ కావాలన్నా క్షణాల్లో సెట్ వేసేవాడంటూ ఆర్ట్ డైరెక్టర్ రమేష్ గురించి వివరించాడు.

Recommended Video

#CineBox : RGV Changed 'Kamma Rajyamlo Kadapa Redlu' Movie Title !
మూడో వీడియోలో వేణు వండర్స్..

మూడో వీడియోలో వేణు వండర్స్..

ఇక తదుపరి వీడియోలో వేణు వండర్స్ ఎపిసోడ్ గురించి చెప్పబోతోన్నట్లు తెలుస్తోంది. ఒక వర్గాన్ని కించపరిచినట్లు అప్పట్లో ఓ స్కిట్ చేసిన సంగతి తెలిసిందే. ఆ కారణంగా వేణుపై దాడి చేసిన విషయం అందరికీ తెలిసిందే. ఈ ఘటన గురించి నాగబాబు తన తరువాతి వీడియో మాట్లాడబోతోన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X