For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  ఆది, సుధీర్‌ను తీసేద్దామనుకున్నారు.. జబర్దస్త్‌లోని రాజకీయాలు తెలుసు.. నాగబాబు కామెంట్స్

  |

  జబర్దస్త్ షో ఎంత ఫేమస్సో.. అందులో నాగబాబు నవ్వులు, పంచ్‌లు, జడ్జిమెంట్ అంత ఫేమస్. టవర్ స్టార్, నవ్వుల నాగబాబుగా జబర్దస్త్ సక్సెస్‌లో ముఖ్య పాత్రను పోషించాడు. జబర్దస్త్ నుంచి నాగబాబు బయటకు రావడంతో గత కొన్ని రోజులుగా వీటికి సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. షో నుంచి బయటకు వచ్చిన నాగబాబు తన యూట్యూబ్ చానెల్ ద్వారా వరుసగా వీడియోలు పోస్ట్ చేస్తూ సంచలన నిజాలు బయట పెడుతున్నారు.

   వారి కోసం వచ్చేశా..

  వారి కోసం వచ్చేశా..

  తాజాగా ఓ వీడియోను పోస్ట్ చేస్తూ.. జబర్దస్త్‌ను వీడటానికి గల కారణాలను చెప్పుకొచ్చాడు. ఆ షో అంతలా సక్సెస్ కావడానికి కారణమైన దర్శకులు నితిన్-భరత్‌ బయటకు వెళ్లడమేనని చెబుతూ అనేక విషయాలను వెల్లడించాడు. వారిని తొక్కేయాలని ప్రయత్నించారని, నడిరోడ్డు మీద నిలబడ్డారని, అంత ప్రతిభ ఉన్న వారు అలా ఉండటం తనకు నచ్చలేదని అన్నారు. వారికి తోడుగా ఉంటానని చెప్పి, ఏదైనా కొత్త షో ప్లాన్ చేయండి, మీ వెంట నడుస్తానని చెప్పి.. జబర్దస్త్ నుంచి బయటకు వచ్చానని తెలిపాడు.

  #CineBox : Ileana D'Cruz Missed Out 2 Golden Chances With Salman Khan In These Two Films !
  తనతో పాటు మరికొంత మంది..

  తనతో పాటు మరికొంత మంది..

  ఆ షో నుంచి తనతో పాటు మరికొంత మంది కూడా వచ్చేందుకు సిద్దపడ్డారని తెలిపాడు. కిరాక్ ఆర్పీ, చమ్మక్ చంద్ర లాంటి వారు బయటకు వచ్చారని, మరికొంత మంది అక్కడే ఉండిపోయారని, యాంకర్ రవి కూడా తమతో పాటు కొత్త షోలో పాల్గొన్నాడని చెప్పుకొచ్చాడు. అనసూయ మాకు కూడా సపోర్ట్ చేస్తోందని, ఆమె అక్కడా, ఇక్కడా షోలు చేస్తోందని తెలిపాడు.

   అలా బుల్లెట్ భాస్కర్‌ను తీసేద్దామనుకున్నారు..

  అలా బుల్లెట్ భాస్కర్‌ను తీసేద్దామనుకున్నారు..

  ఒకానొక సమయంలో ఓ రాజకీయ నాయకుడిని ఇమిటేట్ చేయడంతో బుల్లెట్ భాస్కర్‌ను జబర్దస్త్ నుంచి తీసేశారని చెప్పుకొచ్చాడు. అది తనకు నచ్చలేదని, అలా ఎందుకు చేశారని అడగానని, ఒకవేళ అతన్ని మళ్లీ తీసుకోకుంటే.. తాను కూడా వెళ్లిపోతానని యాజమాన్యానికి చెప్పినట్టు తెలిపాడు. దీంతో బుల్లెట్ భాస్కర్‌ను తీసుకున్నారని తెలిపాడు.

  ఆది, సుధీర్‌లను కూడా..

  ఆది, సుధీర్‌లను కూడా..

  ఆ సంఘటన జరిగిన కొద్ది రోజుల తరువాత.. మళ్లీ ఆది, సుధీర్‌లను కూడా తీసేస్తున్నట్లు తన వద్ద ప్రస్తావించారని అన్నాడు. అలా ఎందుకు చేస్తున్నారని ప్రశ్నించగా.. వారు వేరే చానెల్‌లో కూడా షోలు చేస్తున్నారని అందుకే వారు ఆ నిర్ణయానికి వచ్చారని తెలిపాడు. జబర్దస్త్ లాంటి షోనే చేస్తే..మందలించాలి కానీ వేరే చానెల్‌లో వేరే షోలు చేసుకుంటే అలా తీసేయడం కరెక్ట్ కాదని తాను చెప్పినట్లు పేర్కొన్నాడు.

  వారు రాకుండా అడ్డుకట్ట..

  వారు రాకుండా అడ్డుకట్ట..

  తాను షో నుంచి బయటకు వచ్చాక మరికొంత మంది కూడా తనతో పాటు వచ్చేందుకు సిద్దమయ్యారని నాగబాబు తెలిపాడు. అయితే హైపర్ ఆది, సుడిగాలి సుధీర్ లాంటి వారు కూడా బయటకు వచ్చేందుకు ఆసక్తి చూపారని అయితే వారిని అగ్రిమెంట్ పేరుతో అక్కడే ఉండేలా చేశారని.. అందులో జరిగే రాజకీయాలు కూడా తనకు తెలుసునని అన్నాడు. ప్రతిభను అలా బంధించకూడదని, ఈటీవీ, మల్లెమాలలో షోలు చేస్తూనే బయట కూడా చేసుకోండని, ఆ స్కోప్ క్రియేట్ చేసుకోండని వారికెప్పుడూ సలహాలు ఇస్తానని పేర్కొన్నాడు.

  మా కొత్త షో, జబర్దస్త్ రెండూ బాగా నడవాలి..

  మా కొత్త షో, జబర్దస్త్ రెండూ బాగా నడవాలి..

  మేమంతా కలిసి లోకల్ గ్యాంగ్స్ అనే కొత్త షోను ప్రారంభించాము.. ఆ షోను విజయవంతం చేయగల సత్తా నితిన్-భరత్‌లకు ఉందని, దానికి ప్రేక్షకుల సపోర్ట్ కావాలని అన్నాడు. జబర్దస్త్ షో కూడా బాగా నడవాలని కోరుకున్నాడు. తనకు మల్లెమాల పట్ల, శ్యామ్ ప్రసాద్ రెడ్డి పట్ల ఎటువంటి కోపమూ లేదని తెలిపాడు.

  English summary
  Naga Babu Revealed Facts About Quitting Jabardasth. Anasuya, Kirak RP Also Comes Out From Jabardasth. Remaining Some Team Leaers ALso May Leaves Jabardasth And Enters Into Starts Local Gangs Show. Roja Emotional Block mail And Naga Babu Sweet Warning To Team Leaders.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more
  X