Don't Miss!
- News Lok Sabha Election 2024: నేడే తొలి దశ పోలింగ్, 102 స్థానాల్లో ఎన్నికలకు సర్వం సిద్ధం
- Sports PBKS vs MI: అతను అసాధారణ బ్యాటింగ్‌తో భయపెట్టాడు: హార్దిక్ పాండ్యా
- Lifestyle గుడ్‌నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Technology 40 గంటలకు పైగా బ్యాటరీ బ్యాకప్, ChatGPT వాయిస్ AI సపోర్టుతో నథింగ్ ఇయర్‌బడ్స్ విడుదల.. సేల్ వివరాలు!
- Automobiles గొప్ప మనసు చాటుకున్న రాఘవ లారెన్స్.. దివ్యాంగులకు టీవీఎస్ స్కూటర్ల పంపిణీ
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
బూతు, నీచమైన షోలు ఎన్నో... చమ్మక్ చంద్రే ఇలాంటివి చేస్తాడు: జబర్దస్త్‌పై నాగబాబు
జబర్దస్త్ కామెడీ షోకు ఎంత ఆదరణ ఉందో అదే స్థాయిలో విమర్శలు ఉన్నాయి. డబుల్ మీనింగ్ డైలాగులు, పక్కింటి ఆయన భార్యను ఈ ఇంటి వాడు ట్రాప్ చేయడం, ఎదురింటావిడను వీళ్లు గొకడం లాంటి స్కిట్లు చేస్తుంటే మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన నాగబాబు జడ్జిగా ఉండటం ఏమిటి? అని కొందరు విమర్శిస్తున్నారు.
తాజాగా ఓ టీవీ ఛానల్ ఇంటర్వ్యూలో నాగబాబుకు ఇలాంటి ప్రశ్నే ఎదురైంది. అయితే ఈ విమర్శలపై మెగాబ్రదర్ తనదైన శైలిలో వివరణ ఇవ్వడంతో పాటు.. తమ షోలో అసభ్యత ఏమీ లేదని సమర్థించుకున్నారు.
చమ్మక్ చంద్ర స్కిట్లలో...
జబర్దస్త్‌లో చమ్మక్ చంద్ర చేసే కొన్ని స్కిట్లు మాత్రమే అలా ఉన్నాయి. మిగతా వారి స్కిట్లు అలా లేవు. రాఘవ, రాకేష్, అభి, సుధీర్, ఆది అంతా బాగా చేస్తారు. ఒక్కొక్కరిదీ ఒక్కో స్టైల్. చంద్ర స్టైల్ అది. అయితే అందులో పెద్దగా వల్గారిటీ ఏమీ ఉండదు, ఒక చిన్న అడల్ట్ కామెడీ ఉంటుందని నాగబాబు తెలిపారు.
బూతు మూవీస్, నీచమైన షోలు ఎన్నో...
కామెడీ షో అంటే అన్నిరకాల కామెడీ ఉంటుంది. మాది అంతగా చూడలేనంత భయంకరమైన షో కాదు. సినిమా థియేటర్లలో ఇంతకంటే భయంకరమైన బూతు సినిమాలు వస్తున్నాయి. ఇంతకంటే నీచమైన కార్యక్రమాలు ఉన్నాయి. వాటితో పోలిస్తే మేము చూపించేది నథింగ్... అని నాగబాబు అన్నారు.
సీరియస్ కంటెంటే కానీ..
‘నా ఛానల్ నా ఇష్టం' ద్వారా నేను చేస్తున్న వీడియోల్లో కంటెంట్ సీరియస్సే.. కాకపోతే దానిపై హ్యూమర్ అనే షుగర్ కోటింగ్ వేస్తాను. అలా చేస్తే ఎక్కువ మందికి రీచ్ అవుతుందని అలా చేయడం జరుగుతోందని తెలిపారు.
మా ఇంట్లో అందరికంటే షార్ట్ టెంపర్ నేనే
నేను చాలా ఆవేశంగా కూడా మాట్లాడగలను. ఒక విషయాన్ని హ్యూమర్‌గా మలిచి జనాల్లోకి తీసుకెళ్లడం కంటే అవేశంగానే మాట్లాడం నాకు ఈజీ. మా ఇంట్లో అందరికంటే ఎక్కువ ఆవేశం, షార్ట్ టెంపర్ నేనే. కాకపోతే బయట నా ప్రవర్తన అలా ఉండదని నాగబాబు తెలిపారు.