twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    బూతు, నీచమైన షోలు ఎన్నో... చమ్మక్ చంద్రే ఇలాంటివి చేస్తాడు: జబర్దస్త్‌పై నాగబాబు

    |

    జబర్దస్త్ కామెడీ షోకు ఎంత ఆదరణ ఉందో అదే స్థాయిలో విమర్శలు ఉన్నాయి. డబుల్ మీనింగ్ డైలాగులు, పక్కింటి ఆయన భార్యను ఈ ఇంటి వాడు ట్రాప్ చేయడం, ఎదురింటావిడను వీళ్లు గొకడం లాంటి స్కిట్లు చేస్తుంటే మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన నాగబాబు జడ్జిగా ఉండటం ఏమిటి? అని కొందరు విమర్శిస్తున్నారు.

    తాజాగా ఓ టీవీ ఛానల్ ఇంటర్వ్యూలో నాగబాబుకు ఇలాంటి ప్రశ్నే ఎదురైంది. అయితే ఈ విమర్శలపై మెగాబ్రదర్ తనదైన శైలిలో వివరణ ఇవ్వడంతో పాటు.. తమ షోలో అసభ్యత ఏమీ లేదని సమర్థించుకున్నారు.

    చమ్మక్ చంద్ర స్కిట్లలో...

    చమ్మక్ చంద్ర స్కిట్లలో...

    జబర్దస్త్‌లో చమ్మక్ చంద్ర చేసే కొన్ని స్కిట్లు మాత్రమే అలా ఉన్నాయి. మిగతా వారి స్కిట్లు అలా లేవు. రాఘవ, రాకేష్, అభి, సుధీర్, ఆది అంతా బాగా చేస్తారు. ఒక్కొక్కరిదీ ఒక్కో స్టైల్. చంద్ర స్టైల్ అది. అయితే అందులో పెద్దగా వల్గారిటీ ఏమీ ఉండదు, ఒక చిన్న అడల్ట్ కామెడీ ఉంటుందని నాగబాబు తెలిపారు.

    బూతు మూవీస్, నీచమైన షోలు ఎన్నో...

    బూతు మూవీస్, నీచమైన షోలు ఎన్నో...

    కామెడీ షో అంటే అన్నిరకాల కామెడీ ఉంటుంది. మాది అంతగా చూడలేనంత భయంకరమైన షో కాదు. సినిమా థియేటర్లలో ఇంతకంటే భయంకరమైన బూతు సినిమాలు వస్తున్నాయి. ఇంతకంటే నీచమైన కార్యక్రమాలు ఉన్నాయి. వాటితో పోలిస్తే మేము చూపించేది నథింగ్... అని నాగబాబు అన్నారు.

    సీరియస్ కంటెంటే కానీ..

    సీరియస్ కంటెంటే కానీ..

    ‘నా ఛానల్ నా ఇష్టం' ద్వారా నేను చేస్తున్న వీడియోల్లో కంటెంట్ సీరియస్సే.. కాకపోతే దానిపై హ్యూమర్ అనే షుగర్ కోటింగ్ వేస్తాను. అలా చేస్తే ఎక్కువ మందికి రీచ్ అవుతుందని అలా చేయడం జరుగుతోందని తెలిపారు.

    మా ఇంట్లో అందరికంటే షార్ట్ టెంపర్ నేనే

    మా ఇంట్లో అందరికంటే షార్ట్ టెంపర్ నేనే

    నేను చాలా ఆవేశంగా కూడా మాట్లాడగలను. ఒక విషయాన్ని హ్యూమర్‌గా మలిచి జనాల్లోకి తీసుకెళ్లడం కంటే అవేశంగానే మాట్లాడం నాకు ఈజీ. మా ఇంట్లో అందరికంటే ఎక్కువ ఆవేశం, షార్ట్ టెంపర్ నేనే. కాకపోతే బయట నా ప్రవర్తన అలా ఉండదని నాగబాబు తెలిపారు.

    English summary
    Naga Babu Comments On Chammak Chandra Jabardasth Skits. Konidela Nagendra Babu is an Indian, Telugu film actor and producer. He acts mainly in supporting roles. He currently appears in television serials and is also a judge on the comedy show, Jabardasth.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X