For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  వారి కోసమే బయటకు వచ్చా.. రోజా అలా చేసేది.. జబర్దస్త్‌పై నాగబాబు

  |

  బుల్లితెరపై ఎన్నో సంచలనాలు సృష్టించిన జబర్దస్త్.. గత కొంత కాలం నుంచి సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ఎక్కడ చూసినా వీటికి సంబంధించిన వార్తలే.. జబర్దస్త్ నుంచి నాగబాబు బయటకు వెళ్లడం.. జబర్దస్త్‌కు పోటీగా మరో షోను మొదలు పెట్టడం.. లాంటివి జరుగుతుండటంతో అందరి చూపు వాటిపై పడింది. అయితే జబర్దస్త్ నుంచి తాను ఎందుకు వెళ్లిపోవాల్సి వచ్చిందో వివరిస్తూ నాగబాబు తన యూట్యూబ్ చానెల్ ద్వారా వీడియోలు రిలీజ్ చేస్తూ వస్తోన్న సంగతి తెలిసిందే. తాజాగా మరో వీడియోను రిలీజ్ చేస్తూ.. సంచలన నిజాలను బయటపెట్టాడు.

  రెమ్యూనరేషన్ గురించి అడిగేవారు..

  రెమ్యూనరేషన్ గురించి అడిగేవారు..

  కార్పోరేట్ సిస్టమ్‌లా మారిపోయిందని గత వీడియోలో నిప్పులు చెరిగిన నాగబాబు.. లీడర్లకు, కంటెస్టెంట్లకు సరైన భోజనం కూడా పెట్టలేదని సంచనల కామెంట్లు చేసిన సంగతి తెలిసిందే. అయితే తాజా వీడియోలో మాట్లాడుతూ.. కొంతమంది టీమ్ లీడర్లు (భాస్కర్, చంటి, సుధీర్) కంటెస్టెంట్లు వచ్చి రెమ్యూనరేషన్ గురించి మాట్లాడేవారని చెప్పుకొచ్చాడు. మల్లెమాల కార్పోరేట్ సంస్థగా మారిందని అక్కడ వారికేం కావాలో తీసుకుంటున్నారని, ఇవతల వారికేం కావాలో ఇవ్వడం లేదని అన్నాడు.

  #CineBox : Ileana D'Cruz Missed Out 2 Golden Chances With Salman Khan In These Two Films !
  రోజా నాలా కాదు..

  రోజా నాలా కాదు..

  రాజకీయాల పరంగా వేరైనా.. ప్రొఫెషన్‌కు వచ్చేసరికి తమ మధ్య విబేధాలుండేవి కావని పేర్కొన్నాడు. అయితే ఆమెకుండే బిజీ షెడ్యూల్స్ వల్ల.. వచ్చామా.. పని చూసుకున్నామా? వెళ్లామా అనేలా ఉండేదని తెలిపాడు. అందరితో తనకు ఉన్నంత పర్సనల్ అటాచ్ మెంట్ ఆమెకు ఉండేది కాదని అన్నాడు.

  రష్మీని అలా అనడంతో..

  రష్మీని అలా అనడంతో..

  రష్మీ చాలా ప్రతిభ ఉన్న వ్యక్తి అని చెప్పకొస్తూ.. ఓ సంఘటనను గుర్తు చేశారు. రష్మీ, అనసూయలపై టీమ్ లీడర్స్ స్కిట్స్‌లో భాగంగా జోకులు వేస్తుంటారని, అయితే కొత్తగా వచ్చిన ఓ టీమ్ ఆమెపై చాలా హార్ష్ జోకులు వేశారని అన్నాడు. వెంటనే వారిని మందలించానని, ఓ అమ్మాయిని అలా అనకూడదని వార్నింగ్ ఇచ్చినట్లు తెలిపాడు.

  వారి కోసమే బయటకు వచ్చా..

  వారి కోసమే బయటకు వచ్చా..

  జబర్దస్త్ కోసం ఏడేళ్లు కష్టపడ్డ కుర్రాళ్లు నితిన్ భరత్ అని అంటూ.. వారిద్దరు ఓసారి తన వద్దకు వచ్చారని అన్నాడు. జబర్దస్త్‌ను మానేశామని తనతో చెప్పడంతో అలా ఎందుకు చేశారని ప్రశ్నించానని అన్నాడు. అయితే వారి కోసమే తాను బయటకు వచ్చానని, మల్లెమాల వారిని నడిరోడ్డు మీద వదిలేసినట్టు తనకు అనిపించిందని అన్నాడు. వారికి అండగా నిలబడేందుకే తాను జబర్దస్త్ నుంచి బయటకు వచ్చానని పేర్కొన్నాడు.

  అలా చేయడం తప్పు..

  అలా చేయడం తప్పు..

  ఎవరైనా ఒక చోట నుంచి మరో చోటకి వెళితే వారిని పీడించకూడదని, ఓ రకంగా వారిద్దరికీ సహాయ నిరాకరణ లాంటిది చేశారని మల్లెమాల, ఈటీవీని ఉద్దేశించి నాగబాబు ఫైర్ అయ్యాడు. ఎంతో ప్రతిభ, భవిష్యత్తు ఉన్న వాళ్లు అలా నడిరోడ్డు మీద ఉండేసరికి తనకు ఏదోలా అనిపించిందని అన్నాడు. కొత్తగా ఏదో ఒకటి చేయడంని, వారి వెంట తానుంటానని ధైర్యమిచ్చినట్లు నాగబాబు తెలిపాడు. వారికోసం జబర్దస్త్‌ను వదలడం, జీ చానెల్‌లో కొత్త ప్రోగామ్‌ను పెట్టామని అందరి ఆశీస్సులు కావాలని కోరాడు. అలాగే జబర్దస్త్ కూడా బాగా నడవాలని, తనకు మల్లెమాలకు, శ్యామ్ ప్రసాద్ రెడ్డికి కూడా ఎలాంటి గొడవలు లేవని మరోసారి క్లారిటీ ఇచ్చాడు. తనకు ఆ కార్పోరేట్ సిస్టమ్ నచ్చక, అందులో ఇమడలేక బయటకు వచ్చానని పేర్కొన్నాడు.

  English summary
  Naga Babu Revealed Facts About Quitting Jabardasth. Anasuya, Kirak RP Also Comes Out From Jabardasth. Remaining Some Team Leaers ALso May Leaves Jabardasth And Enters Into Starts Local Gangs Show. Roja Emotional Block mail And Naga Babu Sweet Warning To Team Leaders.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X