»   » ప్రేక్షకులను ఫూల్స్ చేసిన నాగబాబు అండ్ బ్యాచ్!

ప్రేక్షకులను ఫూల్స్ చేసిన నాగబాబు అండ్ బ్యాచ్!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: తెలుగు టెలివిజన్ రంగంలో 'జబర్దస్త్' ఎంత పాపులర్ అయిందో అందరికీ తెలిసిందే. అత్యధిక టీఆర్పీ రేటింగులు సాధిస్తున్న కామెడీ షో కూడా ఇదే. నాగబాబు, రోజా జడ్జిలుగా వ్యవహరిస్తున్న ఈ షోకు సంబంధించి ఇటీవల ప్రసారమైన సుడిగాలి సుధీర్ స్కిట్ ప్రోమో హడావుడిపై విమర్శలు వస్తున్నాయి.

సుడిగాలి సుధీర్ టీం.... నాగబాబు, రోజాలతో గొడవ పడ్డట్లు, సుధీర్ టీంను షో నుండి బయటకు గెంటేసినట్లు కొన్ని రోజుగా ప్రోమోలతో హడావుడి చేసి.... ప్రేక్షకుల్లో ఏదో తెలియని టెన్షన్ క్రియేట్ చేసారు. అయితే ఇదంతా కేవలం టీఆర్పీ రేటింగుల కోసం ఆడిన నాటకమే అని, అలా గొడవ పడటం కూడా స్కిట్టులో భాగమే అని మార్చి 31న ప్రసారమైన పూర్తి షోతో తేలిపోయింది.

ఫూల్స్ చేసారు

ఫూల్స్ చేసారు

అయితే తమను కావాలని ఫూల్స్ చేయడంపై పలువురు ప్రేక్షకులు మండి పడుతున్నారు. ఇలాంటి గిమ్మిక్స్ వల్ల నమ్మకం పోతుందని..... ప్రేక్షకుల్లో నమ్మకం పోతే చివరకు షో మీద ఎఫెక్ట్ పడుతుందని హెచ్చరిస్తున్నారు.

టీఆర్పీల కోసమే

టీఆర్పీలు రాబట్టు కోవడానికి ప్రయత్నించడంలో తప్పులేదు. కానీ అందుకు కోసం ఇలా ప్రేక్షకును ఫూల్స్ చేసే ట్రిక్స్ ప్లే చేయడం సరికాదు. నాగబాబు, రోజా లాంటి వారు సైతం ఇలాంటి చీప్ ట్రిక్స్ ప్లే చేయడం ఏంటని ప్రశ్నిస్తున్నారు.

యూట్యూబ్ లో డిస్ లైక్స్

యూట్యూబ్ లో డిస్ లైక్స్

ఈ ఎపిసోడ్‌కు యూట్యూబ్ లో కూడా భారీగా డిస్ లైక్స్ వచ్చాయి. 1300లకు పైగా లైక్స్ వస్తే... 1800 పైగా డిస్ లైక్స్ వచ్చాయి.

ఇప్పటికే పలు విమర్శలు

ఇప్పటికే పలు విమర్శలు

జబర్దస్త్ షో మీద ఇప్పటికే అనేక విమర్శలున్నాయి. స్కిట్స్ లో డబల్ మీనింగ్ డైలాగులు, అడల్ట్ కంటెంట్ ఎక్కువగా ఉంటోందనే టాక్ ఉంది. ఇపుడు ప్రేక్షకులను ఫూల్స్ చేసి టీఆర్పీ రేటింగులు పెంచుకునే ప్రయత్నంతో మరోసారి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ఫోటో సౌజన్యం: ఈటీవీ

English summary
Naga Babu And Roja Fire On Sudigali Sudheer Team. Extra Jabardasth 31st March 2017 Promo shocked everyone naga baba and Roja angry on Sudheer and Get up srinu video. But it is just a prank. Check out full details.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu