తొమ్మిది మందిని ట్రై చేసినా పడలేదు.. నూతనోత్సాహంలో నాగబాబు.. వేడిపుట్టించిన అనసూయ, శేఖర్ మాస్టర్

గత కొన్ని రోజులుగా ఎక్కడ చూసిన జబర్దస్త్.. నాగబాబు.. అనే వార్తలే కనిపిస్తున్నాయి. నాగ బాబును జబర్దస్త్ వీడటం గురించి ఎన్ని రకాలు రూమర్లు వచ్చాయో.. వాటిపై మీడియా ఎంతగా కవర్ చేసిందో అందరికీ తెలిసిందే. ఇక సోషల్ మీడియాలోనైతే ప్రత్యేకంగ చెప్పనక్కర్లేదు. ఎక్కడా చూసినా వీటికి సంబంధించిన కామెంట్లే కనిపించాయి. జబర్దస్త్ కంటెస్టెంట్లు బయట ఎక్కడైనా కనిపించినా వీటికి సంబంధించిన ప్రశ్నలే ఎదరుయ్యేవంటే ఏ రేంజ్‌లో ఆ వార్తలు వైరల్ అయ్యాయో అర్థం చేసుకోండి.

కొత్త ప్రోగ్రామ్‌లకు ఫుల్ పబ్లిసిటీ..

కొత్త ప్రోగ్రామ్‌లకు ఫుల్ పబ్లిసిటీ..

ఈ వార్తల పుణ్యమా అంటూ నాగ బాబు జంప్ చేసిన కొత్త చానెల్, వాటికి సంబంధించిన ప్రోగ్రామ్‌లకు బాగానే పబ్లిసిటీ వచ్చేసింది. జీ చానెల్‌లో ప్రారంభం కానున్న కొన్ని కార్యక్రమాల్లో నాగబాబు, కొంత మంది జబర్దస్త్ కంటెస్టెంట్లు పాల్గొనబోతోన్నారు. గత కొన్ని రోజులుగా బుల్లితెరకు దూరమైన యాంకర్ ప్రదీప్ సైతం నాగబాబుతో చేతులు కలిపేసి కొత్త ప్రోగ్రామ్‌కు జంప్ అయ్యాడు.

వరుస షోలు.. ప్రోమోలు హల్ చల్..

వరుస షోలు.. ప్రోమోలు హల్ చల్..

ఈటీవీ జబర్దస్త్ నుండి జీ తెలుగుకి జంప్ చేసిన నాగబాబు.. వరుస షోలతో రచ్చ మొదలుపెట్టేశాడు. ‘సరె.. సర్లే.. ఎన్నెన్నో అనుకుంటాం..! అన్ని జరుగుతాయా ఏంటి?'.. అంటూ కార్తీకమాసం సందర్భంగా స్పెషల్ షో నిర్వహించింది. యాంకర్ ప్రదీప్ హోస్ట్ చేస్తున్న ఈ కార్యక్రమంలో నాగబాబు, అనసూయ, ధనరాజ్, చమ్మక్ చంద్ర, వేణు ఇలా జబర్దస్త్ టీం మొత్తం నవ్వులు జల్లును కురిపించేందుకు సిద్దమయ్యారు. దీనికి సంబంధించిన ప్రోమోలు ఏ రేంజ్‌లో హల్ చల్ చేస్తున్నాయో అందరికీ తెలిసిందే.

కొత్త షోలో హంగామా..

కొత్త షోలో హంగామా..

యాంకర్‌గా లాంగ్ గ్యాప్ తీసుకున్న ప్రదీప్ ఈ షోతో రీ ఎంట్రీ ఇచ్చాడు. అతనితో పాటు యూట్యూబ్ సంచలనం దేత్తడి హారిక.. ప్రదీప్‌లో కో యాంకర్‌గా సందడి చేస్తుంది. వీరితో పాటు జబర్దస్త్ నుండి బయటకు వెళ్లి రెండు మూడు సినిమాల్లో కనిపించి తెరమరుగైన ధనరాజ్, వేణు లాంటి కమెడియన్స్‌తో పాటు.. చమ్మక్ చంద్ర, ఆర్పీ, శేఖర్ మాస్టర్ కొడుకు విన్ని వీళ్లంతా జీ స్టేజ్ షేర్ చేసుకోనుండటంతో నవ్వుల పంట పండటం ఖాయమనిపిస్తోంది. ఇక రంగమ్మా మంగమ్మా అంటూ రంగమ్మత్త (అనసూయ) తన స్టైల్లో స్టెప్పులేసి స్టేజ్‌ను హీటెక్కించింది.

నూతనోత్సాహంలో నాగబాబు..

నూతనోత్సాహంలో నాగబాబు..

నిప్పురా తాకరా అంటూ సూపర్ స్టార్ కబాలి బ్యాక్ గ్రౌండ్ స్కోర్‌తో అదిరిపోయేలా ఎంట్రీ ఇచ్చిన నాగబాబులో ఏదో తెలియని కొత్త ఉత్సాహం కనిపిస్తోంది. ఈ ‘లోకల్ గ్యాంగ్'కి బాస్ అతనే కావడంతో సాలరీ పెంచాలని ప్రదీప్ కోరగా.. ‘పెంచుతా.. పెంచుతా మనం ఆల్రెడీ ఓ చోట నుండి వచ్చాంగా కాబట్టి.. ' అంటూ కంటిన్యూ చేశాడు.

తొమ్మిదిమందిని..

తొమ్మిదిమందిని..

ఈ షో పేరే లోకల్ గ్యాంగ్ కాబట్టి కాలేజ్ గ్యాంగ్‌ల గురించి ప్రదీప్ ఇచ్చిన ఇంట్రో అదిరిపోయింది. నాగబాబును ఉద్దేశించి.. మీ కాలేజ్ డేస్‌లో మీ గ్యాంగ్ గురించి చెప్పండి అని ప్రదీప్ అడగ్గా.. ‘ఆరోజుల్లో నా ముఖం ఎవరూ చూసేవారు కాదు కాని.. నేనైతే ఓ ఎనిమిది తొమ్మిది మంది అమ్మాయిల్ని వన్ సైడ్ చేశా' అని నవ్వులు పూయించాడు. నేను అంతమందిని లవ్ చేసినా ఒక్కరు కూడా పట్టించుకోలేదు అని నాగబాబు నిరుత్సాహం వ్యక్తం చేశాడు. ఇప్పుడు ఆ ఎనిమిది తొమ్మిది మంది టీవీలు చూస్తుంటారు అంటూ కౌంటర్ వేశాడు ప్రదీప్.

Recommended Video

#CineBox : Allu Arjun Is taking Huge Remuneration For Trivikram Srinivas's 'Ala Vaikuntapuramlo'?
వేడిపుట్టించిన అనసూయ, శేఖర్ మాస్టర్

వేడిపుట్టించిన అనసూయ, శేఖర్ మాస్టర్

రాధే గోవిందా ప్రేమే కుట్టిందా.. కసిగా రమ్ముంటూ కబురెట్టిందా అంటూ ఇంద్ర సినిమాలోని మోస్ట్ రొమాంటిక్ సాంగ్‌కు అనసూయ, శేఖర్ మాస్టర్‌లు ఓ రేంజ్‌ పెర్ఫామెన్స్ ఇచ్చారు. నోరు తిరగని పదాలు ఎందుకు మాట్లాడతావ్ అని.. ప్రదీప్ అంటుంటే వాట్ ఆర్ యు టాకింగ్ అంటూ బొంగరంలా తన వయ్యారాలను తిప్పింది అనసూయ. ప్రోమోనే ఈ రేంజ్‌లో వర్కౌట్ అవుతుంటే.. భవిష్యత్తులో జబర్దస్త్‌కు గట్టి పోటీ ఇస్తుందనే కామెంట్లు వినిపిస్తున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X