Naga Panchami 22nd January: శక్తులు లాక్కొని మరీ పంచమి, ఫణీంద్రలకు నాగదేవత శాపం!

Naga Panchami: నాగ పంచమి సీరియల్ రోజురోజుకూ మరింత రసవత్తరంగా సాగుతోంది. ఎవరూ ఊహించని స్థాయిలో సాగుతూ.. అనుక్షణం బుల్లితెర ప్రేక్షకులను ఉర్రూతలూగిస్తోంది. తాజా ఎపిసోడ్ లో మేఘన రూపంలో ఉన్న కరాళీ.. మోక్షను ప్రాణాలతో కాపాడింది. నాగచంద్రకాంత మొక్క పసరుతో అతడిని కాపాడగా.. అంతా మేఘనను పొగడ్తలతో ముంచెత్తారు. మోక్ష కుటుంబ సభ్యులు అయితే మాత్రం నీ రుణం తీర్చుకోలేమంటూ తెగ ప్రశంసించారు. మరోవైపు ఫణీంద్ర మాత్రం ఆమెపై అనుమానంతో ఏం జరిగిందో తెలియాక అల్లాడిపోయాడు.

అయితే మోక్ష ప్రాణాలతో బయట పడగానే.. పంచమి అక్కడి నుంచి కాస్త దూరంగా వచ్చింది. సూర్యుడికి దండం పెట్టుకుంటూ.. సుబ్రహ్మణ్యేశ్వరా.. నువ్వే నా భర్తను బతికించావంటూ మురిసిపోతుంది. పంచమి పక్కకు వెళ్లడం గమనించిన ఫణీంద్ర కూడా ఆమె వెంటే వెళ్తాడు. యువరాణీ మేఘన తెచ్చిన పసరు ఉత్తి ఆకు పసరు అంటే నమ్మశక్యంగా లేదు.. ఒక్క నాగ చంద్రకాంత మొక్క తప్ప అతడిని ఏదీ బతికించలేదు అంటూ అంటాడు. ఏమో పణీంద్ర నా భర్త బతికాడు నాకదే చాలంటూ పంచమి అంటుంది. మీరు నాతో నాగలోకం రావాలి యువరాణి లేదంటే నేను నాగ దేవత ముందే ప్రాణాలు అర్పిస్తానని చెప్పాను అంటూ ఫణీంద్ర అంటాడు.

Naga Devatha Curse to Panchami And Phanindra on Naga Panchami January 22nd Episode

మోక్షను ఒప్పించిన తర్వాతే తాను నాగలోకం వస్తానని అనగా.. లేదు అది జరగని పని అని ఫణీంద్ర అంటాడు. తాను ప్రాణాలు కూడా తీసుకుంటానని చెబుతాడు. పంచమి వద్దని.. ఇకపై తన వల్ల ఎవరూ చనిపోకూడదని వివరిస్తుంది. నాగలోకం వెళ్లిపోదాం అనగానే.. నాగదేవతను స్మరించమని చెబుతాడు. అలా స్మరించిని వెంటనే నాగ దేవత ప్రత్యక్షం అవుతుంది. వీరిద్దరూ అమ్మవారికి నమస్కారం చేసుకుంటుండగానే.. నాగ దేవత చాలా ఆగ్రహంగా చూస్తుంది. ఆపండి మీ కపట నాటకాలు అంటూ అరుస్తుంది.

యువరాణి దొంగతనంగా నాగలోకం వచ్చి నాగ చంద్రకాంత మొక్కను తీసుకు రావడం చాలా పెద్ద తప్పని అంటుంది. ఆ మాట విన్న పంచమి, ఫణీంద్రలు షాక్ కు గురవుతారు. అదేంటని ప్రశ్నిస్తారు. అవును నాకు నాగకన్య చెప్పింది.. పంచమియే నాగలోకం వచ్చి నాగ చంద్రకాంత మొక్క తీసుకు వచ్చి మోక్షను కాపాడుకుందని మీ నుంచి శక్తులు తీసేసుకుంటున్నానని అంటుంది. అలా శక్తులు తీసేసుకుంటుంది. మీరు చేసిన తప్పుకు మీకు మరణ శిక్ష విధించాలని అంటుంది. కానీ యువరాణి, యువరాజు కావడం వల్ల మిమ్మల్ని ప్రాణాలతో వదిలేస్తున్నానని నాగ దేవత చెబుతుంది.

ఆ తర్వాత వారి నుంచి శక్తులు లాగేసుకుని.. ఇక మీరు భూలోకంలోనే ఉండిపోతారు.. మీకు నాగలోక ప్రవేశం లేదని హెచ్చరిస్తుంది. ఇక్కడే ఉండి పౌర్ణమికి పాముల్లా మారతారని అంటుంది. పాముల్లా మారి ప్రజల చేతిలో దెబ్బలు తిని మరీ చనిపోతారని శాపం విధిస్తుంది. ఓవైపు పంచమి, ఫణీంద్రలు తాము ఏ తప్పూ చేయలేదని చెబుతున్నా వినకుండా మాయం అయిపోతుంది. ఇక ఆ తర్వాత నాగదేవత అబద్ధం చెప్పదు.. నీ రూపంలో ఎవరో నాగలోకం వెళ్లారని ఫణీంద్ర అంటాడు. తనకు ఆ మేఘనపైనే అనుమానం ఉందని.. ఇప్పుడే తీసుకు వస్తాను ఇక్కడే ఉండండి అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతాడు.

Naga Devatha Curse to Panchami And Phanindra on Naga Panchami January 22nd Episode

మేఘనను తీసుకురాగానే ఆమె తాను ఏ తప్పూ చేయలేదని కన్నీరు కారుస్తుంది. ఫణీంద్ర మాత్రం నువ్వే నాగ లోకం వెళ్లి నాగ చంద్రకాంత మొక్క తెచ్చావు.. మోక్ష ప్రాణాలు కాపాడావంటూ నిందిస్తాడు. నీకు మంత్రశక్తులు కూడా తెలుసంటూ చెప్పుకొస్తాడు. నేను మోక్షను కాపాడడమే తప్పు అయిందంటూ మేఘన ఏడవగా.. పంచమి వదిలేయమని ఇవేవీ మనసులో పెట్టుకోకుండా వెళ్లిపో అంటుంది. అలా మేఘన అక్కడి నుంచి వెళ్లగానే.. తనే ఇదంతా చేసిందని మరోసారి ఫణీంద్ర పంచమితో అంటాడు. తన తప్పు త్వరలోనే బయటపడుతుంది... ఇప్పటికి నా భర్త బతికాడు అంతే చాలంటూ పంచమి చెప్పగా ఈరోజు ఎపిసోడ్ పూర్తి అవుతుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X