Naga Panchami: మోక్షను కాపాడినందుకు పంచమికి నాగ దేవత శాపం.. దేవుళ్లే ఇలాంటి శిక్ష విధిస్తే ఎలా?

Naga Panchami December 15th Episode: నాగ పంచమి సీరియల్ సినిమాల్లో మించిన ట్విస్ట్ లతో బుల్లితెర ప్రేక్షకులకు గూస్ బంప్స్ తెప్పిస్తోంది. ఎవరూ ఊహించని స్థాయిలో సీరియల్ ను రసవత్తరంగా మార్చడంలో సీరియల్ నిర్వాహకులు సఫలం అవుతున్నారు. అయితే తాజా ఎపిసోడ్ లో ప్రాణాలతో బయట పడ్డ మోక్షను ఇంటికి తీసుకు వస్తుంది. పంచమి. ఇక ఆ తర్వాత ఆమె ఓ చోట కూర్చొని ఉండగా... తన జీవితం ఏమవుతుంది, తన భర్తకు ఈ ప్రాణగండం ఎలా పూర్తిగా తొలగిపోతుందని ఆలోచిస్తూ కూర్చుంటుంది. అయితే అప్పుడే నాగ దేవత ప్రత్యక్షమై పంచమిపై విరుచుకు పడుతుంది.

కావాలని అనేక ప్లాన్ లు వేసి మరీ చాలా సార్లు నాగ లోకాన్ని మోసం చేయడం సరికాదని అంటుంది. తమను పదే పదే మోసం చేసిన పంచమికి... ఇకపై నాగ లోకానికి రావాల్సిన అవసరం లేదని చెబుతుంది. అలాగే శత్రువు అయిన మోక్షను చంపాల్సిన బాధ్యత కూడా లేదని ఆ బాధ్యతను తమ నాగ లోకమే తీసుకుంటుందని నాగ దేవత వివరిస్తుంది. పౌర్ణమి రోజు పాముగా మారిన నువ్వు జనాల కళ్లల్లో పడి... వారు కర్రలతో నిన్న కొట్టి చంపేస్తారు.. అలా నువ్వు ప్రాణాలు కోల్పోతావని నాగ దేవత పంచమికి శాపం ఇస్తుంది. ఇంతటితో ఈరోజుటి ఎపిసోడ్ అయిపోతుంది. ఇక నిన్నటి ఎపిసోడ్ లో పాము నుంచి పంచమిగా మారిన పంచమి.. మోక్షను చూస్తుంది.

Naga Devatha Curse to The Panchami For Saving Moksha on December 15th Episode Number 227 in Naga Panchami Telugu Serial

అతడిని పిలిచే ప్రయత్నం చేస్తుంది. ముందుగా ఆమె చనిపోయిందేమో అనుకుని అసలు రాత్రి ఏం జరిగిందో గుర్తు తెచ్చుకుంటుంది. ముఖ్యంగా మోక్ష నోట్లో నురగ వస్తుందా, తానేమైనా కాటు వేశానా అని వెతుకుతుంది. అంతా చూసి అతడు ప్రాణాలతోనే ఉన్నట్లు గుర్తించి.. స్పృహ తప్పి పడిపోయినట్లు గ్రహిస్తుంది. మోక్షను లేపేందుకు నీళ్లు తీసుకు వచ్చేందుకు వెళ్తుంది. ఆమె అలా వెళ్లగానే కరాళీ వచ్చి మోక్షను తీసుకెళ్లాలనని అనుకుంటుంది. అతడిని వశం చేసుకుంటే శక్తులు అయినా దక్కుతాయని.. వశపరుచుకుని వెంట తీసుకెళ్లే ప్రయత్నం చేస్తుంది. అయితే పంచమి వచ్చేసరికి మోక్ష లేకపోవడం చూసి వెతుకుతూ వెళ్తుంది.

కరాళీ తీసుకువెళ్తున్నట్లు గుర్తించి కర్రతో ఆమెపై దాడి చేస్తుంది. తన భర్త జోలికి వస్తే ప్రాణాలు తీస్తానని హెచ్చరిస్తుంది. ఓ బండరాయి తీసుకొచ్చి తల పగలగొట్టబోతుంది. ఇక్కడి నుంచి వెళ్తే ప్రాణాలతో బయట పడతావు అనగానే.. కరాళీ భయంతో పారిపోతుంది. కానీ మళ్లీ తిరిగి వచ్చి నీ భర్తను అడ్డు పెట్టుకుని నీతోనే నాగ మణిని తెప్పించేలా చూస్తాను చూడు అంటూ హెచ్చరిస్తుంది. ఇక ఆ తర్వాత మోక్ష స్పృహలోకి వచ్చేలా చేయగానే.. అతడు పంచమిని చూసి ఏడ్చేస్తాడు. పంచమి నువ్వు బాగానే ఉన్నావా అంటూ అడుగుతాడు. రాత్రి నువ్వు ఐదు తలల పాములా మారావు, ఆత్మహత్య ఎందుకు చేసుకోవాలనుకున్నవంటూ ప్రశ్నల వర్షం కురిపిస్తాడు.

Naga Devatha Curse to The Panchami For Saving Moksha on December 15th Episode Number 227 in Naga Panchami Telugu Serial

మీ కోసం నేను చావనండి.. ఎవరితోనైనా యుద్ధం చేస్తానని అనగా.. నాగదేవతకు నా మీద కోపం వచ్చి ఐదు తలల పాములా మార్చి ఉంటుందని పంచమి అంటుంది. ఇక ఆ తర్వాత కుటుంబ సభ్యులు అందరూ పంచమి, మోక్షల గురించి భయపడుతూ ఉంటారు. వారికి ఏమైందోనని తెగ టెన్షన్ పడుతూ కనిపిస్తారు. ఇంతలోనే వాళ్లు వచ్చేస్తారు. పంచమి తల్లి పంచమిని, మోక్ష తల్లి మోక్షను గట్టిగా కౌగిలించుకుని ఏడ్చేస్తారు. మీకేమైనా అయితే మేము కూడా చనిపోయే వాళ్లం అంటూ చెప్పుకొస్తారు. ఆ తర్వాత మోక్ష నేను బతికానన్నది నాకే ఆశ్చర్యం కల్గిస్తుందని అంటాడు.

మీ ప్రేమ వల్ల తిరిగి వచ్చానా, యాగ ఫలితం వల్ల ప్రాణాలతో బయటపడి బట్టకట్టానా తెలియదు కానీ... అంత పెద్ద పాము భారి నుంచి తప్పించుకోవడం చాలా గ్రేట్ అంటూ చెప్పుకొస్తాడు. ఆ పాము ఐదు తలల పాము అని చెప్పగానే.. కుటుంబ సభ్యులు అంతా షాకవుతారు. దాని గురించి మోక్ష వివరిస్తూ ఉంటాడు. ఇలా ఈ ఎపిసోడ్ పూర్తవుతుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X