Naga Panchami: నాగదేవత ఉగ్రతాండవం.. కరాళీని తోకతో కట్టి... మోక్షపైకి దూసుకొస్తున్న ఐదు తలల పంచమి పాము!
నాగ పంచమి సీరియల్ పేరు చెబితేనే బుల్లితెర ప్రేక్షకులకు గూస్ బంప్స్ వచ్చేలా ఉంది. ముఖ్యంగా గత నెల రోజులుగా కార్తీక పౌర్ణమి గురించి పెద్ద ఎత్తున చర్చ సాగగా.. ఆ ఎపిసోడ్ వచ్చేసింది. ముఖ్యంగా పంచమి పాములా మారడం ఒకెత్తు అయితే... కార్తీక పౌర్ణమికి ఆమె శక్తులు మరింతగా పెరిగి ఏకంగా ఐదు తలల పాములా మారిపోయింది. ఆత్మాహుతి చేసుకోబోతున్న ఆమె అదే మంటల్లోంచి మరింత శక్తివంతంగా బయటకు వచ్చింది. ఈక్రమంలోనే పంచమిని కాపాడేందుకు గుడిలోంచి వచ్చిన మోక్షను చంపేందుకు దూసుకు వస్తోంది. మరోవైపు దుష్ట శక్తులు కల్గిన కరాళీని తన తోకతో బంధించి మోక్షపై కాటు వేయాలని చూస్తోంది.
పాము నుంచి తప్పించుకోవడానికి మోక్ష చాలానే ప్రయత్నాలు చేశాడు. కానీ అవేవీ అయ్యేలా కనిపించడం లేదు. ముఖ్యంగా అదే విషయం మోక్షకు కూడా అర్థం అయిపోయింది. ఇక ఎవరు ఏం చేసినా తనను ప్రాణాలతో కాపాడలేరని అతడు చెప్పడం మనం చూడవచ్చు. ఇదంతా మనం రేపటి ఎపిసోడ్ లో పూర్తిగా తెలుసుకోవచ్చు. అయితే ఈరోజుటి ఎపిసోడ్ లో మాత్రం పంచమి... ఆత్మాహుతి చేసుకోవడానికి భర్తను వదిలి వెళ్లడం దగ్గర నుంచి చూపించారు. పంచమితో నాగుల వరం గ్రామానికి ఉన్న అనుబంధం, అలాగే భర్తతో తనకు పెళ్లి జరిగిన క్షణాలను గుర్తు చేసుకుంది.

ఆమె మనసులో భర్తతో తనకు జరిగిన పెళ్లి, వారిద్దరి మధ్య సాగిన బంధం గురించి ఆలోచిస్తూనే ఉంటుంది. ఓ సాడ్ సాంగ్ వేసి మరీ వారిద్దరి బంధాన్ని బ్లాక్ అండ్ వైట్ కలర్ లో చూపించారు. ఇక ఆ తర్వాత ఓ నమఃశివాయ అంటూనే కట్టెలకు నిప్పు పెట్టడం దానికి ఆనుకుని ఉండడం కనిపిస్తుంది. ఇక ఆ తర్వాత మోక్షను చూపిస్తారు. గుడిలో పంచమి గురించి ఆలోచిస్తూ అతడు కూర్చోగా.. కరాళీ అక్కడకు వెళ్తుంది. అయితే గుడిలో నాగ సాధువు ఇచ్చిన విభూది వేయగా... దాన్ని దాటి ఆమె లోపలకు వెళ్లలేకపోతుంది. ఆ విషయం మోక్షకు అర్థం కాకుండా ఉండాలని.. మోక్షను రమ్మని పిలుస్తుంది.
ఆమె దగ్గరకు వెళ్లిన అతడిని.. ఈ గీత ఏంటని ఏమీ తెలియనట్లు అడుగుతుంది. అయితే ఇది పంచమి వేసిందని.. దీన్ని దాటి అస్సలే రాలేనని వెల్లడించాడు. మరి పంచమి ఎక్కడికో వెళ్లిందో తెలియదుగా.. ఇప్పుడు పంచమి పాములా మారి ఉంటుందని కరాళీ అంటుంది. తను ఎక్కడ ఉందో చూడాలంటూ తనకు అంజనం వేసి చూసే మంత్రశక్తి తెలిసని చెప్పి అంజనం వేసి చూస్తుంది. ఆ అంజనలో పంచమి మంటల్లో కాలిపోవడం చూస్తాడు మోక్ష. తనతో పంచమి అంతకు ముందు మాట్లాడిన మాటలు గుర్తు చేసుకుంటూ... తనకోసం పంచమి చనిపోవాలని నిర్ణయించుకున్నట్లు గుర్తిస్తాడు. తాను చనిపోయినా ఫర్వాలేదని... పంచమిని ఎలాగైనా కాపాడాలంటూ అక్కడకు వెళ్దామని కరాళీతో చెబుతాడు. అలా వారిద్దరూ కలిసి పంచమి దగ్గరకు పయనం అవుతారు.
మరోవైపు యాగం చేస్తున్న నాగ దేవతకు పంచమి అరుపులు వినిపిస్తాయి. ముందుగా అర్థం చేసుకోలేని నాగ దేవత.. ఎట్టకేలకు విషయం తెలుసుకుంటుంది. భర్తను కాపాడుకోవడానికి ఆత్మహత్య చేసుకోవాలనుకుంటున్నావా... నాగ లోకాన్నే మోసం చేయాలనుకుంటున్నావా అంటూ ఫైర్ అయి ఉగ్రతాండవం చేస్తుంది. తన శక్తులను పంచమిలోకి పంపిస్తుంది. ఓ అదిరిపోయే పాట వేయగా... నాగ దేవత డ్యాన్స్ చేస్తుంది. ఇలా తన శక్తులన్నీ పంచమిలోకి పంపగా.. ఆమె ఐదు తలల పాములా మారి చాలా పెద్దగా అయిపోతుంది.
ఇక మహా మృత్యుంజయ యాగం చేస్తున్న సప్త రుషులను అడ్డుకునేందుకు ఫణీంద్ర.. మరో ఇద్దరు నాగులు ప్రయత్నిస్తూనే ఉంటారు. కానీ సప్త రుషుల మంత్ర శక్తి వల్ల వాళ్లు గీత దాటి లోపలకు వెళ్లలేరు. ఇదిలా ఉండగానే పంచమిని వెతుకుతూ.. కరాళీ, మోక్షలు వెళ్లడం.. పంచమి ఉగ్రరూపాన్ని చూడడం కనిపిస్తుంది. ఇంతటితో ఈరోజుటి ఎపిసోడ్ పూర్తి కాగా.. రేపటి ఎపిసోడ్ లో పంచమి మోక్షను కాటేస్తుందా లేకఆ మహాశివుడే వచ్చి కాపాడాతాడా అనేది చూడాలి.


Click it and Unblock the Notifications











